అన్వేషించండి

Kidney Damaging Mistakes : ఆ పనులతో కిడ్నీలు హాంఫట్.. రోటీన్​ కాదు డేజంర్ అంటోన్న నిపుణులు, జాగ్రత్త

Kidneys : రోటీన్​గా చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇంతకీ ఆ మిస్టేక్స్ ఏంటి? వాటిని ఎలా ఓవర్​కామ్ చేసి కిడ్నీలను కాపాడుకోవాలో తెలుసుకుందాం. 

Kidneys Health : రక్తంలోని టాక్సిన్లను ఫిల్టర్ చేసి.. శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపడంలో కిడ్నీలు హెల్ప్ చేస్తాయి. ఇవి శరీరంలోని ఎలక్ట్రోలైట్ లెవెల్స్​ను రెగ్యూలేట్ చేసి.. నరాలు, కండారాల పనితీరును మెరుగుపరుస్తుంది. హార్మోన్లను ప్రొడ్యూస్ చేసి.. బీపీని కంట్రోల్ చేస్తుంది. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తిని పెంచి.. ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి కిడ్నీలను కాపాడుకోవడం ఆరోగ్యానికి ఎంతో అవసరం.

రోటీన్​ అనుకుని చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల కిడ్నీలు డ్యామేజ్ ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. తెలియకుండా చేసే మిస్టేక్స్ వల్ల కిడ్నీల ఆరోగ్యం పాడై.. పూర్తి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని చెప్తున్నారు. ఇంతకీ కామన్​ అనుకుని చేసే మిస్టేక్స్ ఏంటి? కిడ్నీల ఆరోగ్యంపై అవి ఏవిధంగా ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

హైడ్రేషన్

కొందరు సరైన మోతాదులో నీటిని తీసుకోరు. దీనివల్ల డీహైడ్రేషన్​ను పెరుగుతుంది. హైడ్రేటెడ్​గా లేకుంటే కిడ్నీల ఆరోగ్యంపై నెగిటివ్ ప్రభావం పడుతుంది. డీహైడ్రేషన్ ప్రధానంగా కిడ్నీల పనితీరును డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి వీలైనంత ఫ్లూయిడ్స్ తీసుకోవడం మంచిది. 

ఉప్పు వాడకం

చాలామంది ఉప్పును ఎక్కువగా వాడతారు. ఇలా తీసుకునే సోడియం బీపీని పెంచుతుంది. దీనివల్ల కిడ్నీలపై ఎక్స్​ట్రా భారం పడుతుంది. దీనివల్ల కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటుంది. బయట దొరికే ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్స్ వంటి వాటితో పాటు.. ఇంట్లో చేసే వంటల్లో ఉప్పు తగ్గిస్తే మంచిది. 

యూరినేషన్ విషయంలో

యూరిన్​ వచ్చినప్పుడు చాలామంది వాష్​రూమ్​కు వెళ్లకుండా దానిని కంట్రోల్ చేసుకుంటారు. కానీ ఇలా దానిని ఆపేయడం వల్ల కిడ్నీలపై ఎక్కువ ప్రభావం పడుతుంది. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్లు పెరిగే అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి బ్లాడర్ నిండినప్పుడు కచ్చితంగా వాష్​రూమ్​కి వెళ్లండి. పనులేమైనా ఉంటే వాటిని తర్వాత చేసుకోండి. 

షుగర్ లెవెల్స్

డయాబెటిస్ సమస్య ఉన్నవారికి కిడ్నీలు పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్​ని కంట్రోల్​లో ఉంచుకోవాలి. వైద్యులు ఇచ్చే మందులు రెగ్యులర్​గా తీసుకుంటూ.. హెల్తీ డైట్​ని ఫాలో అవ్వాలి. 

కెఫిన్

శరీరంలో కెఫిన్​ శాతం ఎక్కువైతే.. కిడ్నీల డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇది బీపీని, హృదయ స్పందన, యూరిన్ ప్రొడెక్షన్​ను నెగిటివ్​గా ఎఫెక్ట్ చేస్తుంది. ఇది కిడ్నీలపై ఎక్స్​ట్రా భారాన్ని పెంచుతుంది. కాబట్టి వీలైనంత వరకు కాఫీ, టీలను తగ్గించాలంటున్నారు నిపుణులు. 

మెడిసిన్స్.. 

కొన్నిరకాల మందులు కిడ్నీల ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. ముఖ్యంగా పెయిన్​కిల్లర్స్ ఎక్కువగా తీసుకుంటే కిడ్నీల్లోని టిష్యూలను పాడు చేస్తాయని అంటున్నారు నిపుణులు. వైద్యులు ఇచ్చే సూచనలు ఫాలో అవుతూ.. ఆ ప్రకారం మందులు తీసుకుంటే ఈ డ్యామేజ్ తగ్గుతుంది. 

నిద్ర 

నిద్ర సమస్యలున్నవారికి కిడ్నీల సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువ. నిద్ర లేకుంటే బీపీ పెరుగుతుంది. ఇన్​ఫ్లమేషన్ పెరిగి.. కిడ్నీలు రీసెట్​ అయ్యే సమయం దొరకదు. రోజుకు 8 నుంచి 9 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈ రోటీన్​ కిడ్నీల డ్యామేజ్​ను తగ్గిస్తుంది.

స్మోకింగ్ 

స్మోకింగ్ అలవాటు ఉన్నా.. లేదా స్మోకింగ్ చేసేవారి పక్కన ఉన్నా కిడ్నీలు పాడయ్యే అవకాశం ఎక్కువ. బ్లడ్ వెజెల్స్​ను డ్యామేజ్ చేసి.. కిడ్నీలకు రక్తప్రవాహాన్ని తగ్గిస్తాయి. ఇవి కిడ్నీల ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి స్మోకింగ్ తగ్గించడం కాకుండా.. పూర్తిగా మానేస్తేనే మంచిదంటున్నారు. 

డైట్​

ప్రొసెస్ చేసిన ఫుడ్ ఎక్కుగా తింటే పూర్తి ఆరోగ్యంతో పాటు.. కిడ్నీల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. వీటిని తినడం వల్ల బీపీ, షుగర్, ఒబెసిటీ పెరుగుతాయి. ఇవి కిడ్నీల సమస్యలను పెంచుతాయి. హెల్తీ ఫుడ్, హెల్తీ డైట్​ కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 

ఈ మిస్టేక్స్ చేయకుండా రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటే.. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ముందుగానే ప్రమాదాన్ని గుర్తిస్తే.. సమస్య పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే పైన తెలిపిన మిస్టేక్స్ జోలికి వెళ్లకుండా హెల్తీ రోటీన్​ను, జీవనశైలిని ఫాలో అయితే ఆరోగ్యంగా ఉండొచ్చు. 

Also Read : హైదరాబాద్ టూ గోకర్ణ, దండేలి బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్.. మూడురోజులకు ఎంత ఖర్చువతుందంటే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Sai Pallavi: సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
PF Withdraw: ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
Swiggy One BLCK: స్విగ్గీ కొత్త ప్రీమియం ప్లాన్‌ - అపరిమిత ఫ్రీ డెలివెరీలు, డిస్కౌంట్‌లు, OTT ఆఫర్లు!
స్విగ్గీ కొత్త ప్రీమియం ప్లాన్‌ - అపరిమిత ఫ్రీ డెలివెరీలు, డిస్కౌంట్‌లు, OTT ఆఫర్లు!
Tiger Attack In Kakinada District: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం- వణికిపోతున్న ప్రజలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం- వణికిపోతున్న ప్రజలు
Embed widget