Gokarna and Dandeli Budget trip : హైదరాబాద్ టూ గోకర్ణ, దండేలి బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్.. మూడురోజులకు ఎంత ఖర్చువతుందంటే
Gokarna Trip : గోకర్ణ, దండేలిని బడ్జెట్లో వెళ్లి రావాలనుకుంటున్నారా? అయితే మీకు ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ మంచి ఆప్షన్. మూడు రోజుల్లో ఏమేమి ఎక్స్ప్లోర్ చేయొచ్చో ఇప్పుడు చూసేద్దాం.
Hyderabad to Gokarna and Dandeli Budget Trip Under 9k : హైదరాబాద్‌లో ఉంటూ కర్ణాటకను ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే.. మీరు గోకర్ణ, దండేలి బెస్ట్ ఆప్షన్. టెంపుల్స్, బీచ్‌లను ఎంజాయ్ చేసేవారికి ఈ ట్రిప్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ప్రకృతిని ఇష్టపడేవారు, ట్రెక్కింగ్, బీచ్ వ్యూలు ఎంజాయ్ చేసేవారు.. బడ్జెట్లో వెళ్లాలనుకుంటే ఇది మంచి ఆప్షన్. మరి ఈ ట్రిప్‌కి బడ్జెట్లో ఎలా వెళ్లొచ్చు? మూడు రోజుల్లో అక్కడ ఏయే ప్రదేశాలు కవర్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ నుంచి హుబ్లీకి ప్రతిరోజు సాయంత్రం 3.50కి ట్రైన్ అందుబాటులో ఉంటుంది. HYD UBL EXP(17320) ట్రైన్ ఎక్కితే.. హుబ్లీలో ఉదయం 6.35కి వెళ్తారు. స్లీపర్ టికెట్ ధర రూ.370 ఉంటుంది. హుబ్లీ నుంచి గోకర్ణ, దండేలి వెళ్లేందుకు మీరు టూర్స్ అండ్ ట్రావెల్స్ తీసుకోవచ్చు. నలుగురు కలిసి క్యాబ్‌ను మూడురోజులకు తీసుకుంటే రూ.12,000 ఛార్జ్ చేస్తారు. అంటే మనిషికి మూడువేలు పడుతుంది.
Day - 1 (దండేలీ ప్యాకేజ్)
హుబ్లీ నుంచి దండేలి వెళ్లాక అక్కడ ఒకరోజుకు స్టే బుక్ చేసుకోవచ్చు. ఫుడ్, స్టే చేయడానికి, యాక్టివిటీల(silver wood Adventure stay packge) కోసం బుక్ చేసుకుంటే (24 Hours package) రూ.1300 పడుతుంది. ఈ ప్యాకేజ్‌లో మూడు పూటల భోజనం ఫ్రీ. లంచ్‌లో వెజ్ మాత్రమే ఉంటుంది కానీ అన్లిమిటెడ్. డిన్నర్లో వెజ్, నాన్‌వెజ్ కూడా ఉంటుంది. ఇది కూడా అన్లిమిటెడ్. ఈ ప్యాకేజ్‌లో మూడు వాటర్ యాక్టివిటీలు చేయవచ్చు. బోటింగ్, కైకింగ్, జోర్బింగ్ చేయవచ్చు. ఇండోర్ యాక్టివిటీలు ట్రెక్కింగ్, క్యాంప్ ఫైర్, క్యారమ్స్, రైన్ డ్యాన్స్, డార్ట్బోర్డ్, ఆర్చరీ, బ్యాడ్మెంట్, వాలీబాల్, స్విమ్మింగ్ పూల్ ఇలా యాక్టివిటీలు చేయవచ్చు.
Day - 2 (గోకర్ణ)
దండేలి నుంచి గోకర్ణ మార్నింగ్ స్టార్ట్ అయితే.. దారిలో విబూధి వాటర్ ఫాల్స్‌ని విజిట్ చేయవచ్చు. గోకర్ణలో స్టే ఒక రోజుకు తీసుకోవచ్చు. స్టేకి రూ.500 అవుతుంది. గోకర్ణలో మురుదేశ్వర్, హోన్నవర్ని విజిట్ చేయవచ్చు.
Day - 3 (మహబళేశ్వరం)
మార్నింగ్ శ్రీ మహబళేశ్వరం గుడికి వెళ్లి.. అక్కడి నుంచి గోకర్ణలోని ఫేమస్ బీచ్‌లు చూడొచ్చు. వీటిని ట్రెక్ చేయడానికి 4 నుంచి 5 గంటలు పడుతుంది. కాబట్టి మీ షెడ్యూల్‌ని దీని ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు. ఈవెనింగ్ మీరు హబ్లీకి వెళ్లొచ్చు. ఈ రెండు రోజులకు ఫుడ్‌కి రూ. 1000 అవుతుంది. వాటర్ యాక్టివిటీస్‌లో పాల్గొనాలనుకుంటే 1000 అవుతుంది.
రిటర్న్
మీరు హుబ్లీ నుంచి హైదరాబాద్‌కు రోజూ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. స్లీపర్ టికెట్ ధర రూ.370. హుబ్లీ జంక్షన్లో రాత్రి 8.50కి ఎక్కితే.. హైదరాబాద్ ఉదయం 10.40కి రీచ్ అవుతారు.
ఈ ట్రిప్‌లో భాగంగా మూడురోజులకు రూ. 8,500 అవుతుంది. మీరు చేసే యాక్టివిటీలు, వాటర్ గేమ్స్ బట్టి ఖర్చు తగ్గడం లేదా పెరుగుతూ ఉంటుంది. మరి ఇంకేమి ఆలస్యం. మీరు కూడా వీకెండ్ సమయంలో లేదా న్యూ ఇయర్లో భాగంగా ట్రిప్‌కి వెళ్లాలనుకుంటే ఈ ట్రిప్ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
Also Read : హైదరాబాద్ టూ అరకు 3 డేస్, 2 నైట్స్ ట్రిప్.. బడ్జెట్ ఫ్రెండ్లీ టిప్స్ ఇవే