Hyderabad to Araku Budget Trip : హైదరాబాద్ టూ అరకు 3 డేస్, 2 నైట్స్ ట్రిప్.. బడ్జెట్ ఫ్రెండ్లీ టిప్స్ ఇవే
Araku Trip Cost : వింటర్లో అరకు వెళ్తే అబ్బా ఆ కిక్కే వేరురా చారి అనిపిస్తుందా? అయితే హైదరాబాద్ నుంచి అరకును అతి తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్లి రావచ్చో ఇప్పుడు చూసేద్దాం.
Budget Friendly Trip to Araku : అరకు అందాలు చూడాలంటే వింటర్ పర్ఫెక్ట్ టైమ్. బడ్జెట్ పెట్టుకుని గోవా, కులుమనాలి వంటి ప్రదేశాలకు వెళ్లలేని వారు.. తక్కువ ఖర్చుతో కనీసం అరకునైనా చుట్టేయొచ్చు. అయితే ఇలా వెళ్లాలన్నా డబ్బులు కావాలి కదా అనుకుంటున్నారా? 3 డేస్, 2 నైట్స్ కోసం తక్కువ బడ్జెట్లో అరకు వెళ్లి ఎలా రావొచ్చో ఇప్పుడు చూసేద్దాం.
హైదరాబాద్ టూ అరకు
హైదరాబాద్ నుంచి అరకుకు నేరుగా ట్రైన్స్ ఉండవు కాబట్టి.. మీరు సికింద్రాబాద్ నుంచి నేరుగా వైజాగ్ వెళ్లాలి. ప్రతిరోజు గోదావరి ఎక్స్‌ప్రెస్ (12728) సికింద్రాబాద్ నుంచి వైజాగ్‌కు వెళ్తుంది. సాయంత్రం 4:05కి ఎక్కితే.. ఉదయం 5:45కి వైజాగ్‌లో దిగుతారు. ఈ ట్రైన్ స్లీపర్ టికెట్ ధర రూ.410 ఉంటుంది. వైజాగ్ నుంచి అరకుకు ట్రైన్లో వెళ్లొచ్చు. ఉదయం 6.45కి ట్రైన్ ఎక్కితే 10.55కి అరకులో దిగుతారు. దీని ధర రూ.145.
వైజాగ్ టూ అరకు బస్సులో కూడా వెళ్లొచ్చు. కానీ ట్రైన్ జర్నీ మీకు బ్యూటీఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇలా వెళ్తే 15 టన్నెల్స్ గుండా మీరు ఈ హిల్ స్టేషన్‌కు చేరుకుంటారు. అరకులో స్టేయింగ్కి చాలా క్యాంపింగ్ ఆప్షన్స్ ఉంటాయి. మీ బడ్జెట్‌కి తగ్గట్లు మీరు దానిని ఎంచుకోవచ్చు. రూ.800ల్లో కూడా మీరు అక్కడ స్టే చేయవచ్చు. మంచి ఫుడ్ తినాలనుకుంటే బొర్రా కేవ్స్‌కి దగ్గర్లో రకరకాల ఫుడ్ ఐటమ్స్‌ని మీరు ట్రై చేయవచ్చు. మూడు రోజులు ఉంటే.. రోజుకు రూ.500 మీరు తినడానికి స్పెండ్ చేయవచ్చు.
చూడాల్సిన ప్రదేశాలు ఇవే..
అరకు వెళ్లినప్పుడు మీరు కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలను ఓ లిస్ట్ చేసుకోవాలి. బొర్రా కేవ్స్, కాటిక వాటర్ ఫాల్స్, గాలికొండ వ్యూ పాయింట్, చపరాయ్ వాటర్ ఫాల్స్, అనంతగిరి వాటర్ ఫాల్స్, లంబసింగి, మడగడ వ్యూ పాయింట్, తాటిగూడ వాటర్ ఫాల్స్, కాఫీ మ్యూజియం, గిరి గ్రామ దర్శిని, బొటానికల్ గార్డెన్ అరకును మీరు కవర్ చేయవచ్చు.
తిరుగు ప్రయాణం
అరకు టూ వైజాగ్‌కి ట్రైన్ లేదా బస్‌లో వచ్చేయొచ్చు. ట్రైన్ జర్నీ చేస్తే.. అరకు టూ వైజాగ్ (08552) సాయంత్రం 3.45కి ఉంటుంది. 8.20కి మీరు వైజాగ్‌లో ఉంటారు. దీని ధర రూ.145, వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు కోనార్క్ ఎక్స్‌ప్రెస్ (11020) ఉంటుంది. రాత్రి 10.20కి ఎక్కితే ఉదయం 11కి దిగొచ్చు. దీని టికెట్ ధర రూ. 395. ఇలా అతి తక్కువ బడ్జెట్లో అరకు ట్రిప్‌కి వెళ్లి వచ్చేయొచ్చు.
కండీషన్స్ అప్లై
పైన చెప్పిన బడ్జెట్ ఒక్క పర్సన్‌కి అయ్యే ఖర్చులు మాత్రమే. మీ కంఫర్ట్, టైమ్, ట్రావెల్‌ని బట్టి ఈ బడ్జెట్ మారుతూ ఉంటుంది. డబ్బులు లేవని బాధపడడం కంటే.. ఉన్న ఎమోంట్తో ఓ చిన్న ట్రిప్ వేసి రిఫ్రెష్ అవ్వాలనుకునేవారికి అరకు మంచి ఆప్షన్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీ వీకెండ్ సమయంలో తక్కువ బడ్జెట్లో సరదాగా అరకు వెళ్లొచ్చేయండి.
Also Read : గర్ల్ ఫ్రెండ్‌తో రోడ్ ట్రిప్ ప్లానింగ్.. 2025లో ఒక్కో నెలకి ఒక్కో బెస్ట్ ప్లేస్, పూర్తి డిటైల్స్ ఇవే