Health Tests: మీ వయస్సుని బట్టి ఈ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి
రోగాలు ఎప్పుడు ఏ వయసులో వస్తాయో ఎవరికీ తెలియదు. కొంతమందికి 20 ఏళ్ల వయసులోనే గుండె పోటు వచ్చి కుప్పకూలిపోతున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
క్యాన్సర్ నుంచి కొలెస్ట్రాల్ వరకు ఆరోగ్య సమస్యలను సకాలంలో కనుక్కుంటే చికిత్స ఈజీ. రోగాలకు సంబంధించిన లక్షణాలు ముదిరే వరకు వాటిని గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు. దీని వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే ప్రభుత్వం వయసుల వారీగా చేయాల్సిన వైద్యు పరీక్షల జాబితాను విడుదల చేసింది. వాటి ప్రకారం నిపుణుల ప్యానెల్ ఏ వయసులో ఎటువంటి రోగనిర్ధారణ పరీక్షలు జరపాలనే దాని గురించి ప్రణాళిక రచించింది. వయసుని బట్టి ఆరోగ్య పరీక్షలు చేయించుకుని సరైన సమయంలో చికిత్స తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
20 ఏళ్ల వయసులో..
అనేక స్క్రీనింగ్ సిఫార్సులు మిడ్ లైఫ్ లో స్టార్ట్ అవుతాయి. గోనెరియా, క్లామిడియా, హెచ్ఐవీ వంటి లైంగికంగా సంక్రమించే వ్యాధులకు సంబంధించిన అతడు/ ఆమె కనీసం 20 ఏళ్లలో ఒకసారైనా పరీక్షలు చేయించుకోవాలని మిచిగాన్ విశ్వవిద్యాలయ నిపుణులు సూచిస్తున్నారు. ప్రమాద కారకాల ఆధారంగా తరచుగా పరీక్షలు చేయించుకోవడం మరీ మంచిది. హెపటైటిస్ సి కోసం కూడా పరీక్షలు చేయించుకుంటే మంచిది. ఇక మహిళలు గర్భాశయ క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ 21 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు పరీక్షలు చేయించుకోవాలి. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సర్వైకల్ సైటోలజీ పరీక్షను సూచిస్తున్నారు.
30 ల్లో..
30 నుంచి 65 సంవత్సరాల వయసు గల మహిళలకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పాప్ స్పెర్మ్ కొనసాగించాలి. హెచ్ పీవీ వైరస్ గర్భాశయ, ఇతర క్యాన్సర్లకు కారణమవుతుంది. మధుమేహం, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి. అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వాళ్ళు ప్రీడయాబెటిస్, టైప్ 2 మధుమేహం స్క్రీనింగ్ తప్పనిసరి. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం 35 ఏళ్లు పైబడిన వారందరూ టైప్ 2 డయాబెటిస్ పరీక్ష చేయించుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. 35 ఏళ్ల వయసు మహిళలు కొలెస్ట్రాల్ స్థాయిలు తనిఖీ చేయించుకోవాలి.
40 ల్లో..
కొలోరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకునేందుకు 45 ఏళ్ల వయసు సరైన సమయం. కోలోనోస్కోపీ లేదా మెయిల్ ఇన్ స్టూల్ టెస్ట్ ద్వారా పరీక్షిస్తారు. 40 దాటిన మహిళలు ప్రతి రెండేళ్లకు ఒకసారి రొమ్ము క్యాన్సర్ మమోగ్రామ్ పొందటం ముఖ్యం. కంటి సంబంధిత పరీక్షలు కూడముఖ్యం. మధుమేహం ఉంటే అధిక రక్తపోటు, కంటి వ్యాధుల పరీక్షలు తప్పనిసరి.
50 ల్లో..
మెనోపాజ్ దశలోకి వచ్చిన తర్వాత మహిళలు తప్పనిసరిగా ఆస్టియోపొరొసిస్ పరీక్షించాలి. ధూమపానం చరిత్ర ఉన్న పెద్దలు అయితే ఊపిరితిత్తుల క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి. ప్రొస్టేట్ క్యాన్సర్ పరీక్షలు పురుషులు చేయించుకోవాలి.
60 ల్లో..
65 ఏళ్లు అంతకంటే పైబడిన వయసు ఉన్న మహిళల్లో ఎముకల అరుగుదల కనిపిస్తుంది. అందుకే బోలు ఎముకల వ్యాధి పరీక్షలు చేయించుకోవాలి. 65 నుంచి 75 సంవత్సరాల మధ్య వాళ్ళకి బ్రెయిన్ అనూరిజం పరిసఖలు తప్పనిసరి. కొంతమంది వైద్యులు డీమెన్షియా పరీక్షలు కూడా చేయాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: అలసటగా ఉంటుందా? ఇది లోపించడం వల్లే కావచ్చు!