By: ABP Desam | Updated at : 18 May 2023 10:00 AM (IST)
Image Credit: Pexels
ఎప్పుడూ అలసటగా అనిపిస్తుందా? అలసటకి అనేక కారణాలు ఉన్నప్పటికీ వాటిలో ఫోలేట్ లోపం కూడా ఒకటి. ఫోలేట్ అంటే ఇది ఒకరకమైన విటమిన్ బి. DNA తయారీలో, ఎర్ర రక్త కణాలను (RBC) ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఫోలేట్ ని విటమిన్ బి9 అని కూడా పిలుస్తారు. శక్తి ఉత్పత్తికి, శరీర పనితీరుకి ముఖ్యమైనది. తగినంత ఫోలేట్ తినకపోతే కేవలం కొన్ని వారాల్లోనే లోపం ఏర్పడుతుంది. ఫోలేట్ లోపం రక్తహీనతకు కారణమవుతుంది. శరీరానికి ఆక్సిజన్ ను తీసుకువెళ్ళే ఎర్ర రక్తకణాలను తగ్గించడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది.
ఫోలేట్ లోపం లక్షణాలు
⦿ దీర్ఘకాలిక అలసట
⦿ బలహీనత
⦿ నాలుక వాపు
⦿ నీరసం
⦿ చిరాకు
⦿ పాలిపోయిన చర్మం
⦿ శ్వాస ఆడకపోవడం
హెల్త్ లైన్ ప్రకారం ఈ లక్షణాలను అధిగమించాలంటే ఫోలేట్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం పెద్దలు రోజువారీ సిఫార్సు చేసిన దాని 400 మైక్రోగ్రాములు తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు వారి వయస్సుని బట్టి రోజుకు 600-800 మైక్రోగ్రాములు తీసుకోవడం అవసరం. గర్భిణులకి ఫోలేట్ చాలా అవసరం. ఇది లోపితే పుట్టే పిల్లలు అవయవాల లోపం తలెత్తవచ్చు. ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి ఫోలేట్ అవసరం. ఈ లోపం తలెత్తితే వచ్చే సమస్యలు..
⦿ మెగాలోబ్లాస్టిక్ రక్తహీనత, అంటే ఎర్ర రక్తకణాలు సాధారణం కంటే పెద్దవిగా ఉండటమే కాకుండా అవి పూర్తిగా అభివృద్ధి చెందవు
⦿ తెల్ల రక్తకణాలు, ప్లేట్ లెట్ల తక్కువ స్థాయిలో ఉండటం
⦿ గర్భంలో ఉన్న పిండం వెన్నుపాము, మెదడులో తీవ్రమైన పుట్టుక అసమానతలు. వీటినే న్యూరల్ ట్యూబ్ లోపాలు అంటారు
⦿ పరిధీయ నరాల వ్యాధి
ఫోలేట్ అధికంగా లభించే ఆహారాలు
⦿ బ్రకోలి
⦿ బచ్చలికూర వంటి ఆకుపచ్చ కూరగాయలు
⦿ బ్రసెల్స్ మొలకలు
⦿ పీట్స్
⦿ సిట్రస్ ఫ్రూట్స్
⦿ గుడ్లు
⦿ బీన్స్
⦿ కాలేయం వంటి జంతు మాంస అవయవాలు
ఫోలేట్ లోపించిన లక్షణాలు ఏవైనా ఎక్కువ కాలం పాటు శరీరంలో కనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించాలి. లేదంటే తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫోలిక్ యాసిడ్, ఫోలేట్ రెండూ విటమిన్ బి9 రకాలు. ఇవి ఆరోగ్యానికి చాలా అవసరం. విటమిన్స్ అనగానే ఎక్కువగా ఏ, సి, డి, ఇ మాత్రమే ఎక్కువగా వినిపిస్తాయి. కానీ వాటికంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగింది ఫోలేట్. ఇది ఆహార పదార్థాలలో మాత్రమే దొరుకుతుంది. ఇది లోపిస్తే బైపోలో డిజార్డర్, మెమరీ లాస్, డిప్రెషన్ వంటి వాటి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: పెదాలకు వడదెబ్బ తగిలినప్పుడు ఇలా చేశారంటే మృదువుగా మారిపోతాయ్
Also Read: పరగడుపున ఖాళీ పొట్టతో ఈ టీ తాగితే బరువు తగ్గడం సులువు
Milk in Dream: పాలు తాగుతున్నట్లు కల వచ్చిందా? మీకేం జరగబోతోందో తెలుసా?
Diabetes: మీ పొట్టే మిమ్మల్ని డయాబెటిస్ నుంచి రక్షిస్తుందట - తాజా స్టడీతో సరికొత్త ఆశలు!
Babies In Lab: గర్భంలో కాదు ల్యాబ్‌లోనే పిల్లల సృష్టి - ఇంకో ఐదేళ్లలో అందుబాటులోకి!
Curd: సమ్మర్‌లో రోజూ పెరుగు ఎందుకు తీసుకోకూడదు? ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది
Diabetes: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?
4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం
Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
'యూత్ ను ఎంకరేజ్ చేయాలే, ధమ్ ధమ్ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!
Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా