News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Chapathi: ముందు రోజే చపాతీ, పూరి పిండిని కలిపి నిల్వ చేయడం మంచిదేనా?

చపాతీ, పూరీ పిండిని ముందుగా కలిపి ఉంచుకోవడం ఆరోగ్యానికి మంచిదో కాదో తెలుసుకుందాం.

FOLLOW US: 
Share:

బరువు తగ్గేందుకు చపాతీలు మంచి ఉపాయమని ఎంతోమంది భావిస్తూ ఉంటారు. రోజూ రాత్రిపూట చపాతీలు తినేందుకే ఇష్టపడతారు. చపాతీ పిండిని ప్రతిరోజూ కలపడానికి బద్దకించిన వారు ఒక రోజే మూడు రోజులకు సరిపడా చపాతీ పిండిని కలిపి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటూ ఉంటారు. ఇలా నిల్వచేసిన చపాతీ, పూరీ పిండిని రోజూ వాడడం మంచిదో కాదో వివరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా ముందు రోజే చపాతీ, పూరీ పిండిని చేసుకుని తినడం వల్ల ఇలాంటి ఉపయోగం ఉండదు. పైగా అది హానికరం కూడా. చపాతీ పిండిని కలిపాక రెండు గంటల్లోపే దాన్ని వాడేయాలి. మిగిలిన పిండిని ఫ్రిజ్‌లో దాయడం వంటివి చేయకూడదు. ఫ్రిజ్‌లో చపాతీ పిండిని కలిపి నిల్వ చేస్తే దానిలో రసాయనిక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ పిండిలో బ్యాక్టీరియా, ఫంగస్ కూడా అభివృద్ధి చెందుతాయి.

ఒకరోజు నిల్వ చేస్తేనే చపాతీ పిండిపై ఈ ఫంగస్, బ్యాక్టీరియా కంటికి కనిపించవు. కానీ అప్పటికే అభివృద్ధి చెంది ఉంటాయి. అదే రెండు నుంచి మూడు రోజులు నిల్వ చేస్తే చిన్న చిన్న నల్ల చుక్కల్లాగా ఇవి కనిపిస్తాయి. అలాంటి పిండితో చపాతీ, పూరీలు చేస్తే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. కడుపు ఉబ్బరం, కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. పిల్లలకి ఇవి చాలా ప్రాణాంతకంగా మారుతాయి. కాబట్టి చపాతీలు, పూరీలు వీలైనంత వరకు ఎప్పటికప్పుడు పిండి కలుపుకొని వండుకోవడమే మంచిది. ఇలా నిల్వ చేసిన పిండితో చేసిన చపాతీలు, పూరీలు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలగదు. గోధుమ పిండిలో ఉన్న జింక్, ఐరన్, క్యాల్షియం వంటివి కూడా నిల్వ చేసే క్రమంలో కనుమరుగైపోతాయి. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. ఇలాంటి పిండిని అధికంగా తినడం వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పిండిని కలిపి చేయడం వంటిది మానుకోవాలి. కొందరు చపాతీ పిండి మెత్తగా రావాలని దానిలో వేడిపాలు కలపడం వంటివి చేస్తారు. పాలల్లో కూడా బ్యాక్టీరియా, ఫంగస్‌లు చేరుతాయి.

చాలామందికి చపాతీలు మెత్తగా వస్తే ఇష్టం. అలా రావడానికి  పాలు పోయడం, చల్లటి నీళ్లు కలపడం వంటివి చేస్తూ ఉంటారు. పిండిని బాగా కలుపుకున్నాక అందులో ఒక స్పూను నూనె వేసి కలిపితే చాలు. చపాతీలు మెత్తగా వస్తాయి. ఇలా నూనె వేసి కలుపుకున్నాక అరగంట పాటు పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత వాటితో చపాతీలు చేసుకోవాలి. వీటితో పరోటాలు కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు. చపాతీలు ఒత్తుకునేటప్పుడు పెనం బాగా వేడెక్కాక వేయాలి. చపాతీ పిండి కలిపినప్పుడు నూనె అందులో కలుపుకుంటే, కాల్చినప్పుడు పెద్దగా నూనె అవసరం పడదు. చపాతీలు కాల్చుకున్నాక గాలి తగలకుండా గిన్నెలో పెట్టి పైన మూత పెట్టుకుంటే, అవి మరింత మెత్తగా ఉంటాయి. ఏ కూరతో తిన్నా కూడా చాలా రుచిగా వస్తాయి. 

Also read: ఏటా ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య ఆ దేశంలోనే ఎక్కువ

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Published at : 17 Sep 2023 08:03 AM (IST) Tags: Chapathi Chapathi Flour Puri Flour Chapathi Flour store

ఇవి కూడా చూడండి

Relatioships: నా భర్త ఆమెతో మళ్లీ మాట్లాడుతున్నాడు, నాకు నచ్చడం లేదు - ఏం చేయమంటారు?

Relatioships: నా భర్త ఆమెతో మళ్లీ మాట్లాడుతున్నాడు, నాకు నచ్చడం లేదు - ఏం చేయమంటారు?

Teenagers: తల్లిదండ్రులూ జాగ్రత్త, టీనేజర్లలో పెరిగిపోతున్న డిప్రెషన్ లక్షణాలు

Teenagers: తల్లిదండ్రులూ జాగ్రత్త, టీనేజర్లలో పెరిగిపోతున్న డిప్రెషన్ లక్షణాలు

Iron Kadhai: ఐరన్ పాత్రల్లో వంట చేస్తే నిజంగా ఆ సమస్యలు రావా? ఇందులో నిజమెంతా, ప్రయోజనాలేమిటీ?

Iron Kadhai: ఐరన్ పాత్రల్లో వంట చేస్తే నిజంగా ఆ సమస్యలు రావా? ఇందులో నిజమెంతా, ప్రయోజనాలేమిటీ?

Fish Oil Vs Fish: ఫిష్ ఆయిల్ మంచిదా? లేదా నేరుగా చేపలు తినేయడమే బెటరా? వీటిలో ఏది బెస్ట్?

Fish Oil Vs Fish: ఫిష్ ఆయిల్ మంచిదా? లేదా నేరుగా చేపలు తినేయడమే బెటరా? వీటిలో ఏది బెస్ట్?

Heart Attack: ఈ రక్తపరీక్షతో గుండె పోటు వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు

Heart Attack: ఈ రక్తపరీక్షతో గుండె పోటు వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు

టాప్ స్టోరీస్

Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'

Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'

Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌కు పోలీసుల నుంచి నోటీసులు

Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌కు పోలీసుల నుంచి నోటీసులు

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో

PM Modi: మోదీ తెలంగాణ టూర్ షెడ్యూ‌ల్‌లో స్వల్ప మార్పులు

PM Modi: మోదీ తెలంగాణ టూర్ షెడ్యూ‌ల్‌లో స్వల్ప మార్పులు