అన్వేషించండి

Suicide: ఏటా ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య ఆ దేశంలోనే ఎక్కువ

రకరకాల కారణాలతో ప్రతి ఏటా ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఆత్మహత్య అనేది వారి వారి వ్యక్తిగత సమస్యలుగా చాలామంది చూస్తారు, కానీ అది ప్రజారోగ్య సమస్య గానే భావించాలని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆత్మహత్య ఆలోచనలు రావడం అనేది వారి మానసిక పరిస్థితి పై ఆధారపడి ఉంటుందని, కాబట్టి అది కూడా ఒక రుగ్మతేనని అంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ  లెక్కల ప్రకారం ఏటా ప్రపంచవ్యాప్తంగా ఏడు లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందులో ఎక్కువగా అమెరికాలోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దాదాపు 40 శాతం మంది అమెరికా వాస్తవ్యులే. సూసైడ్ చేసుకుంటున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. గత ఏడాది సంపన్న దేశమైన అమెరికాలో ఒక్క ఏడాదిలోనే 50 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ప్రతి 11 నిమిషాలకు అక్కడ ఒక ఆత్మహత్య నమోదు అవుతుంది.

మానసిక ఆరోగ్యం బాగోనప్పుడే ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి. కాబట్టి అది కూడా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటే అలాంటి ఆలోచనలు రాకుండా ఉంటాయని చెబుతున్నారు వైద్యులు. ఒంటరితనం వల్ల కూడా ఆత్మహత్య ఆలోచనలను పెరుగుతాయని చెబుతున్నారు. ఆత్మహత్యల ఆలోచనలకు కేవలం వారి వ్యక్తిగత సమస్యలు, మానసిక ఆరోగ్యమే కాదు గాలిలో నాణ్యత తగ్గినా కూడా ఆ ఆలోచనలు వస్తాయని ఒక అధ్యయనం చెబుతోంది. వాయు కాలుష్యం అధికంగా ఉన్న ప్రదేశాల్లో జీవించే వారికి అలాంటి సూసైడ్ ఆలోచనలు త్వరగా వచ్చే అవకాశం ఉందని ఈ పరిశోధనా వివరిస్తోంది. యేల్ యూనివర్సిటీకి చెందిన సహోద్యోగులు కలిసి వాయు కాలుష్యానికి, ఆత్మహత్యలకు ఉన్న సంబంధం పై అధ్యయనాన్ని నిర్వహించారు. దానిలో భాగంగా 18 పరిశోధనలను సమీక్షించారు. అడవులు కాలిపోవడం వల్ల, ఇల్లు తగలబడడం వల్ల, భవన నిర్మాణాల జరగడం వల్ల, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు, వాయువులు, ఇంధనాలు అధికంగా గాలిలో కలుస్తాయి. ఆ గాలిలో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ వంటివి అధికంగా ఉంటాయి. వాటిని పీల్చినప్పుడు ఆత్మహత్యల ఆలోచనలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వాయు కాలుష్యానికి దూరంగా ఉండమని చెబుతున్నారు పరిశోధకులు. వాయు కాలుష్యంలో మూడు రోజుల కన్నా ఎక్కువగా ఉంటే వారి ఆలోచనలు మారుతాయని, దీర్ఘకాలిక వాయు కాలుష్యం వల్ల డిప్రెషన్ వస్తుందని కూడా వివరిస్తుంది అధ్యయనం.

ఊపిరితిత్తుల్లోకి గాలి ద్వారా ప్రవేశించే వాయు కాలుష్య కారకాలు రక్త ప్రవాహం పై ప్రభావం చూపిస్తాయి. ఆ తరువాత మెదడుకు, ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తాయి, ఇలా చేయడం వల్ల మెదడులో సెరటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే సెరటోనిన్ ఉత్పత్తి తగ్గితే...నిరాశ, డిప్రెషన్ వంటివి కలుగుతాయి. కాబట్టి వాయు కాలుష్యానికి దూరంగా ఉంటే మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కూడా వాయు కాలుష్యాన్ని పెంచుతున్నాయని చెబుతున్నారు పరిశోధకులు. అధిక ఉష్ణోగ్రతల వల్ల  వాయు కాలుష్యం తీవ్రమై స్త్రీ, పురుషుల్లో ఆత్మహత్యా ఆలోచనలు అధికంగా అవుతున్నట్టు వారు గుర్తించారు. అయితే ఈ వాయు కాలుష్యం ఎక్కువ ప్రభావం చూపించేది మగవారిపైనే. అమెరికాలో గత ఏడాది సూసైడ్ చేసుకున్న వారిలో 80 శాతం మంది పురుషులే.

Also read: రాత్రిపూట రెండు సార్లు మూత్ర విసర్జనకు లేస్తున్నారా? అయితే మీ సమస్య ఇదే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

టాప్ హెడ్ లైన్స్

Chewing Gum Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
Multani Mitti for Hair : ముల్తానీ మట్టి తలకు అప్లై చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే
ముల్తానీ మట్టి తలకు అప్లై చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Wearing Slippers at Home : ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Embed widget