అన్వేషించండి

Nocturia: రాత్రిపూట రెండు సార్లు మూత్ర విసర్జనకు లేస్తున్నారా? అయితే మీ సమస్య ఇదే

రాత్రి మూత్ర విసర్జనకు పదేపదే లేవడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది.

ఆరోగ్యకరమైన జీవితానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో, నాణ్యమైన నిద్ర కూడా అంతే అవసరం. కానీ కొంతమందికి రాత్రిపూట రెండు నుంచి మూడుసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల వారికి నిద్రా భంగం కలుగుతుంది. తిరిగి నిద్ర పట్టడానికి చాలా సమయం తీసుకుంటుంది. మరుసటి రోజు ఉదయం నిద్ర సరిపోక చాలా చికాకుగా ఉంటారు. నిద్ర సరిపోకపోతే ఆ రోజంతా వెలితిగా అనిపిస్తుంది. ఇలా పదే పదే అర్ధరాత్రి లేవడాన్ని అడల్ట్ నాక్టూరియా అని పిలుస్తారు. రాత్రి మూత్ర విసర్జన కోసం ఒకసారి మాత్రమే లేవడం సహజం. రెండుసార్లు లేస్తున్నారంటేఅది అడల్ట్ నాక్టూరియాగా చెప్పుకోవాలి. ఇది నిద్రను తీవ్రంగా ప్రభావితం చేసే సమస్య. వయసు పైబడిన వారిలో ఇది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు 30 ఏళ్లు దాటిన వారిలో కూడా కనిపిస్తోంది.

నాక్టూరియా సమస్య రావడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి బ్లాడర్ సామర్థ్యం తగ్గిపోవడం, రెండోది మూత్రం అధికంగా ఉత్పత్తి కావడం. మూత్రం అధికంగా ఉత్పత్తి కావడానికి పాలీయూరియా అని పిలుస్తారు. యాంటీ డయోరిటిక్ హార్మోన్ విడుదల శరీరంలో తగ్గిపోవడం వల్ల మూత్రం ఉత్పత్తి పెరిగిపోతుంది.

ఇక బ్లాడర్ అనేది మన శరీరంలో ఒక అవయవం. ఇది 300 నుంచి 600 మిల్లీలీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఆ సామర్థ్యం తగ్గిపోయినప్పుడు ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. శరీర బరువు పెరగడం. పెల్విక్ వ్యవస్థలో మార్పులు రావడం వంటి వాటి వల్ల కూడా ఈ బ్లాడర్ సామర్థ్యం తగ్గిపోయి, రెండు మూడు సార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ఇవి కాకుండా డయాబెటిస్ ఉన్న వారిలో కూడా మూత్ర విసర్జనకు అధికంగా వెళ్లాల్సి రావచ్చు. గుండె జబ్బులు ఉన్నవారు, అధికంగా ద్రవాలు తీసుకున్న వారు, ఆల్కహాల్, ధూమపానం వంటివి చేసేవారు, సిరల పనితీరు క్షీణించినప్పుడు కూడా మూత్రం అధికంగా ఉత్పత్తి అవుతుంది. కొన్ని రకాల మందులు వాడడం వల్ల కూడా బ్లాడర్ సామర్థ్యం తగ్గిపోయి మూత్ర విసర్జన పదేపదే రావచ్చు.

బ్యాక్టీరియా సమస్యతో బాధపడుతున్న వ్యక్తి తన జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా రాత్రిపూట మూత్ర విసర్జనకు ఒకసారి కంటే ఎక్కువ వెళ్లకుండా అడ్డుకోవచ్చు. నిద్రపోవడానికి కొన్ని గంటల ముందు ద్రవాహారాలను తీసుకోవడం తగ్గించాలి. రాత్రిపూట ఆల్కహాల్ తాగకూడదు, కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. అధిక బరువును తగ్గించుకోవాలి. పడుకోబోయే ముందు మూత్ర విసర్జన చేయాలి. డయాబెటిస్ వంటి సమస్యలు ఉంటే దానికి తగ్గ చికిత్సలు తీసుకోవాలి.

Also read: ఇలా ప్రవర్తిస్తే దెయ్యం పట్టిందనుకుంటారు, నిజానికి ఇదో జబ్బు

Also read: బరువు పెరుగుతున్నారని అన్నం తినడం మానేయకండి, అది చాలా ప్రమాదకరం

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

టాప్ హెడ్ లైన్స్

Saddula Bathukamma Naivedyam : సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
Fenugreek Water 21 Days : 21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Dondakaya Pachadi : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget