Amazon: ఒక ప్లాస్టిక్ బకెట్ ఇరవై ఆరువేల రూపాయలా? అది కూడా ‘సోల్డ్ అవుట్’
నిజమో లేక టెక్నికల్ ఎర్రరో తెలియదు కానీ, ఒక ప్లాస్టిక్ బకెడ్ ఖరీదు రూ.26,000 అని కనిపిస్తోంది అమెజాన్లో.
ఈ కామర్స్ సైట్లలో అమ్మకాలు దూసుకెళ్తున్నాయి. ఇంట్లో కూర్చునే హ్యాపీగా షాపింగ్ చేసే అవకాశం ఉండడంతో దుస్తుల నుంచి బాత్రూమ్ లో వాడే మగ్గుల వరకు ఆన్ లైన్లోనే ఆర్డర్లు పెడుతున్నారు వినియోగదారులు. వాటి ధరలు బయటి షాపుల్లో ధరలతో పోలిస్తే కాస్త తక్కువగానే ఉండడంతో ఎక్కువమంది అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లలో వస్తువులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా ఇప్పుడు అమెజాన్ ఓ బకెట్ విషయంలో ట్రోలింగ్ బారిన పడింది. సాధారణ ప్లాస్టిక్ బకెట్ ధర 25,999 రూపాయలుగా ఉంది. దాని అసలు ధర 35,900 రూపాయలు అని, డిస్కౌంట్ ఇచ్చి పదకొండు వేల రూపాయల తక్కువకు అందిస్తున్నట్టు రాసి ఉంది. అది చూసిన నెటిజన్లు ట్విట్టర్లో అమెజాన్ ను ఆడేసుకుంటున్నారు. ఆ స్క్రీన్ షాట్ ను షేర్ చేసి మరీ అమెజాన్ ను విమర్శిస్తున్నారు.
కొంతమంది నెటిజన్లు ‘ఈఎమ్ఐ పెట్టుకోవచ్చా’ అని కామెంట్ పెడితే, మరికొందరు ‘అన్నీ అమ్ముడైపోయినట్టు ఉన్నాయి, అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తోంది’ అని జోకులు పేల్చుతున్నారు. ఒక ప్లాస్టిక్ బకెట్ అంత ధరకు పెట్టడం టెక్నికల్ ఎర్రర్ అయి ఉంటుందని భావిస్తున్నారు ఎక్కువ మంది. ట్విట్లర్లో ట్రోలింగ్ మొదలయ్యాక అమెజాన్ లో ఆ బకెట్ పేజ్ ఓపెన్ కావడం లేదు. దాన్ని తొలగించారు.
Just found this on Amazon and I don't know what to do pic.twitter.com/hvxTqGYzC4
— Vivek Raju (@vivekraju93) May 23, 2022
మొన్నటికి మొన్న ఓ గొడుగు కారణంగా గూచీ, ఆడిదాస్ సంస్థలు ట్రోలింగ్ బారిన పడ్డాయి. వారు తయారు చేసిన ప్రత్యేక మైన గొడుగు ధరను లక్షా 27 వేల రూపాయలుగా నిర్ణయించారు. కానీ ఆ గొడుగు వాటర్ ఫ్రూఫ్ కాదు. అంటే వానలో ఆ గొడుగు వేసుకుంటే తడిసి ముద్దయిపోతారు. కేవలం ఎండలో మాత్రమే పనిచేస్తుంది. దీంతో నెటిజన్లు ఆ రెండు కంపెనీలను ట్రోల్ చేశారు. దీంతో గూచీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ‘ఆ గొడుగు కేవలం అలంకరణ కోసమే తయారుచేశాం’ అని ప్రత్యేకంగా ప్రకటించాల్సి వచ్చింది గూచీ సంస్థ.
Also Read: మానసికంగా కుంగిపోతున్నారా? మీ హ్యాపీ హార్మోన్ సరిగా పనిచేయడం లేదేమో
Also read: వీటి పేరేంటో తెలుసా? తింటే ఎంత రుచిగా ఉంటాయో, అంత ఆరోగ్యం కూడా