Thegalu: వీటి పేరేంటో తెలుసా? తింటే ఎంత రుచిగా ఉంటాయో, అంత ఆరోగ్యం కూడా
కనుమరుగవుతున్న ఆహారంలో తేగలు కూడా ఒకటి.
పిజ్జా, బర్గర్, ఫ్రాంకీలు, ఫ్రెంచ్ ఫ్రైస్... ఆకలేస్తే గుర్తొచ్చేవి ఇవే ఇప్పుడు. కానీ ఒకప్పుడు ఆరోగ్యానికి అవసరమైనవెన్నో తినేవారు. అన్నీ ప్రకృతి ప్రసాదించేవే. ప్రకృతి ప్రసాదించిన చాలా ఆహారాలు ఇప్పుడు వాడుకలో లేకుండా పోతున్నాయి. ఇప్పటి తరానికి చాలా ఆహార పదార్థాలు తెలియవు. వాటిలో ఈ తేగలు కూడా ఒకటి. ఒకప్పుడు పిల్లలకు ఇవే చిరుతిళ్లు. పాతికేళ్ల క్రితం స్కూళ్ల ముందు బుట్టలతో పెట్టి అమ్మేవాళ్లు. ఇప్పుడు కూడా గ్రామస్థాయిలో వీటి అమ్మకాలు బాగానే సాగుతున్నాయి. మెట్రోసిటీల్లో ఉన్న పెద్దలు, పిల్లలు మాత్రం వీటిని మర్చిపోయారు.
ఏంటివి?
తేగలు... ఇవి తాటి చెట్ల నుంచే వస్తుంది. తేగ ఇంకేంటో కాదు తాటి కాయను పాతితే వచ్చే మొలక. తాటికాయల్లో టెంకలు ఉంటాయి. వాటిని తీసి మట్టిలో పాతితే మొలక వస్తుంది. ఆ మొలకలే తేగలు. ఈ తేగల్ని కుండల్లో నింపి మంట మధ్యలో పెడతారు. లోపలున్న తేగలు బాగా ఉడుకుతాయి. తరువాత ఆ కుండని తీసి లోపలున్న తేగలను బాగా దులిపి కట్టలు కడతారు. తేగ మధ్యలో చీలికలాగా ఉంటుంది. అక్కడ చీల్చితే రెండు బద్దలుగా విడిపోతుంది. ఆ బద్దలను తినాలి. కాల్చిన తేగలు చాలా రుచిగా ఉంటాయి.
క్యాన్సర్‌ను అడ్డుకుంటుంది
తేగలు తినడం వల్ల బ్లడ్ క్యాన్సర్ వంటివాటిని అడ్డుకోవచ్చు. వీటిని తరచూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్యసమస్యలు దరిచేరవు. వీటిలో పొటాషియం, విటమిన్ బి1, బి2, బి3, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. పీచు, క్యాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు లభిస్తాయి. తేగల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. జీర్ణ క్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది. పెద్ద పేగుల్లో మలినాలు చేరకుండా, టాక్సిన్లను తొలగిస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే కాల్షియం ఎముకలకు బలాన్నిస్తుంది.
ఇందులో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో రక్షక భటులైన తెల్లరక్తకణాల సంఖ్యను పెంచుతుంది. కాబట్టి తేగలు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇవి మంచి ఎంపిక. వీటిని తింటే త్వరగా ఆకలి వేయదు. ఆకలిని నియంత్రించే శక్తి దీనికి ఉంటుంది. నాలుగు తేగలు తింటే త్వరగా ఆకలి వేయక, అధిక ఆహారం తినకుండా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే అధిక మోతాదులు తింటే మాత్రం అరగక కడుపునొప్పి వచ్చే ఛాన్సు ఉంది కాబట్టి అధికంగా తినకూడదు.
Also read: టీలో బెల్లం వేసుకుని తాగుతున్నారా? ఆయుర్వేదం వద్దని చెబుతోంది
Also read: భార్య మీద ప్రేమతో మోపెడ్ కొన్న బిచ్చగాడు, ఇప్పుడిద్దరూ మోపెడ్ పై తిరుగుతూ భిక్షాటన చేస్తారట