Tea: టీలో బెల్లం వేసుకుని తాగుతున్నారా? ఆయుర్వేదం వద్దని చెబుతోంది
టీలో పంచదారకు బదులు చాలా మంది బెల్లం వేసుకుంటారు. ఇది మంచిది కాదని అంటోంది ఆయుర్వేదం.
చక్కెర తినడం మంచిది కాదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయాల కోసం వెతకడం మొదలుపెట్టారు ప్రజలు. అలాంటి వారికి ఉత్తమ ప్రత్నామ్నాయంగా దొరికింది బెల్లం. బెల్లంలో ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుందన్న నమ్మకంతో టీ, కాఫీలలో బెల్లం వేసుకుని తాగడం మొదలుపెట్టారు. కానీ టీ, కాఫీలలో బెల్లం కలిపి తాగడాన్ని ఆయుర్వేదం వ్యతిరేకిస్తోంది. అది మంచి పద్దతి కాదని చెబుతోంది.
పాలు - బెల్లం కలిపి తింటే...
ఆయుర్వేదం ప్రకారం బెల్లం - పాలు విరుద్ధ ఆహారం. అంటే ఆ రెండు ఆహారకలయికలు మంచివి కావు. ఈ రెండు కలిస్తే జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. ఈ రెండు కలిసి జీర్ణ ప్రక్రియలో విషపూరిత వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాయి.పాలు శరీరాన్ని చల్ల బరిచేందుకు ప్రయత్నం చేసినప్పుడు, బెల్లం వేడిని పుట్టిస్తుంది. చల్లదనం, వేడి కలిసి జీర్ణ క్రియను ఇబ్బందికి గురిచేస్తుంది. టీలో పాలు అధికంగా ఉంటాయి కాబట్టి బెల్లం కలపడం వల్ల పొట్టలో ఇబ్బంది మొదలవుతుంది. కాబట్టి టీలో బెల్లం వేయడం ఆపేయాలి. దాని బదులు పటిక బెల్లం వేసుకుని తాగడం మంచిది. ఎందుకంటే పటికబెల్లానికి కూడా చలువ చేసే గుణం ఉంది.కాబట్టీ ఈ రెండూ కలిసినా ఏం కాదు.
విరుద్ధ ఆహారం లేదా అసహజమైన పదార్థాల కలయిక హానికారక ప్రభావాలను చూపిస్తుందని చెబుతోంది ఆయుర్వేదం. రుచి, శక్తి, జీర్ణ క్రియపైనే అధికంగా ఈ ప్రభావాలు కనిపిస్తాయి. అలాగే అరటిపండు - పాలు కలిపి తినడం కూడా మంచిది కాదని ఆయుర్వేదం చెబుతోంది. పాలు - చేపలు, పెరుగు - తేనె వంటి కాంబినేషన్లు కూడా సరిపడవు. ఇవన్నీ శరీరంలో ఇన్‌ప్లమ్మేషన్‌కు కారణం అవుతాయి. కొందరిలో చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కింద చెప్పిన ఆహారపు కలయికలను ఆయుర్వేదం చెడువిగా సూచిస్తోంది.
కొన్ని చెడు ఆహార కలయికలు
అరటిపండు - పాలు
గుడ్డు - పాలు
నిమ్మ - పాలు
టమాటాలు - నిమ్మ
పప్పు ధాన్యాలు - పండ్లు
బీన్స్ - మాంసం
చీజ్ - పెరుగు
గుడ్డు - చీజ్
Also read: తిమ్మిర్లు ఎక్కువ వస్తున్నాయా? అయితే ఈ సమస్యలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి
Also read: పచ్చి మాంసాన్ని ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో తాజాగా ఉంచాలంటే ఈ చిట్కాలు పాటించండి