Simple Hacks: పచ్చి మాంసాన్ని ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో తాజాగా ఉంచాలంటే ఈ చిట్కాలు పాటించండి
మాంసాహారం తాజాగా ఉంటే మాత్రమే వండుకుని తినాలి. లేకుంటే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.
చాలా మందికి రోజూ మాంసాహారాన్ని తినే అలవాటు ఉంటుంది. ప్రతి రోజూ షాపుకెళ్లి తెచ్చుకునే ఓపిక లేక కొంతమంది అధిక మొత్తంలో తెచ్చి ఫ్రిజ్ లో దాచుకుంటారు. కొన్ని రోజులు, వారాల పాటూ కూడా దాచుకుంటారు. అయితే మాంసాహారాన్ని సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే అనారోగ్యాన్ని కలుగచేస్తాయి. మాంసం తాజాగా ఉండేలా నిల్వ చేయాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి వాటిని పాటిస్తే కొన్ని రోజుల వరకు మాంసం తాజాగా ఉంటుంది.
జాగ్రత్తలు తప్పవు
వండిన మాంసంతో పోలిస్తే పచ్చి మాంసాన్ని ఉత్పత్తి చేయడం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే పచ్చి మాంసంపై త్వరగా బ్యాక్టిరియా వ్యాప్తి చెందుతుంది. కొన్ని సార్లు పచ్చి మాంసాన్ని సరిగా శుభ్రం చేయకపోయినా దాన్నుంచి తిన్న వారికి బ్యాక్టిరియా బదిలీ అవుతుంది. అందుకే పచ్చి మాంసాన్ని ఓపెన్ ఉంచకూడదు.
తడి ఉండకూడదు
మాంసాన్ని ప్యాకేజింగ్ నుంచి తీసివేసి సాధారణ నీటితో శుభ్రం చేయాలి. గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు లేదా ఉప్పు వేసి అందులో ఈ మాంసాన్ని వేసి కాసేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల బ్యాక్టిరియా, వైరస్ వంటివి పోతాయి. దాదాపు ఎనిమిది నుంచి పది నిమిషాల పాటూ ఉంచాక మరోసారి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. నీట్లోంచి తీసి వేశాక దాన్ని టిష్యూ పేపర్ తో లేదా టవల్ తో తుడిచేయాలి. మాంసం తడి లేకుండా పూర్తిగా ఎండిన తరువాత దాన్ని నిల్వ చేయాలి. తడి ఉండడం వల్ల బ్యాక్టిరియా త్వరగా ఉత్పన్నమవుతుంది.
మాంసం తడి లేకుండా ఆరిపోయిన తరువాత గాలి చొరబడని కంటైనర్లలో వేసి మూత పెట్టాలి. ఈ విధాంగా తాజా మాంసాన్ని వారం రోజులకు పైబడి రిఫ్రిజిరేటర్లో భద్రపరచవచ్చు. అలాగే దీన్ని వండడానికి కేవలం 30 నిమిషాల ముందు మాత్రమే తీసి బయటపెట్టాలి.
ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి
ఒకే కంటైనర్లో వివిధ రకాల మాంసాన్ని ఎప్పుడూ నిల్వ ఉంచకూడదు. అంటే చికెన్, మటన్ కలిపి ఉంచడం, లేదా చికెన్ - చేపలు కలిపి ఉంచడం, మటన్ - రొయ్యలు కలిపి ఉంచడం చేయకూడదు. అలాగే వండిన మాంసాన్ని, పచ్చి మాంసాన్ని పక్క పక్కనే పెట్టి ఫ్రిజ్ లో పెట్టవద్దు. దీని వల్ల వండిన మాంసం త్వరగా పాడవుతంది. రెండింటినీ దూరంగా పెట్టాలి.
Also read: పెళ్లి కాని వ్యక్తులు గుండె వైఫల్యంతో మరణించే ప్రమాదం ఎక్కువ, కొత్త పరిశోధన ఫలితం
Also read: ఉద్యోగ ఇంటర్వ్యూలకు వెళ్లేవారికి లక్కీ కలర్స్ ఇవేనట, ఈ రంగు డ్రెస్సులు రెడీ చేసుకోండి మరి