Figs for male: మగాళ్లూ, ఇది మీకు తెలుసా? ఆ విషయంలో ఛాంపియన్స్ కావాలంటే అంజీర్ తినాలట!
పోషకాలు కలిగిన ఆహారం ఎంచుకోవడం చాలా ముఖ్యం. అటువంటి ఆహారాల్లో డ్రైఫ్రూట్స్ ఒకటి. రకరకాల గింజలు, పండ్లను కలిపి డ్రైఫ్రూట్స్ అంటారు. ఎండు ఫలాల్లో అంజీర్ ఎంతో బలవర్ధకమైంది.
ఈ రోజుల్లో జీవితం చాలా వేగవంతం అయిపోయింది. ముఖ్యంగా పురుషుల లైంగిక ఆరోగ్యం జీవితంలో ఒత్తిడి మూలంగా బాగా ప్రభావితం అవుతోంది. అందువల్ల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఈ జాగ్రత్త వారి దీర్ఘ ఆయువును మాత్రమే కాదు జీవిత నాణ్యతను పెంపొందిస్తుంది.
ఆరోగ్యవంతమైన జీవన విధానం చాలా అవసరం. ఇందులో ఆహారం అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆహారంతోనే శరీరం శక్తి సంతరించుకుంటుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. పోషకాలు కలిగిన ఆహారం ఎంచుకోవడం చాలా ముఖ్యం. అటువంటి ఆహారాల్లో డ్రైఫ్రూట్స్ ఒకటి. రకరకాల గింజలు, పండ్లను కలిపి డ్రైఫ్రూట్స్ అంటారు. ఎండు ఫలాల్లో అంజీర్ ఎంతో బలవర్ధకమైంది.
పురుషుల ఆరోగ్యానికి అంజీర
సూపర్ ఫూడ్స్ గురించిన చర్చలో అంజీరాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది ముఖ్యంగా పురుషుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వీటిలో మినరల్స్, ఫైబర్, ప్రొటీన్, విటమిన్లతో పాటు కొవ్వు, సోడియం పాళ్లు తక్కువ కలిగి ఉంటాయి. పోషకాలే కాకుండా అంజీరాలతో ఇంకా పురుషులకు ప్రత్యేకంగా కలిగే లాభాలేమిటో తెలుసుకుందాం.
స్పెర్మ్ కౌంట్ మెరుగుపడుతుంది
పోషకాలన్నింటితో పాటు అంజీరాలలో జింక్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది సహజంగా టెస్టోస్టిరాన్ సంశ్లేషణకు తోడ్పడుతుంది. ఫలితంగా వీర్య నాణ్యత పెరుగుతుంది. అంజీరాల్లోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలన్నీ కూడా వీర్యకణాల కదలికలు చురుగ్గా ఉండేందుకు దోహదం చేస్తాయి. ఆ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.
మలబద్దకం పరిష్కారానికి
ప్రతి రోజూ ఆహారంలో డ్రై అంజీరా చేర్చుకుంటే మలబద్దకం క్రమంగా తగ్గిపోతుంది. అంజీరాలో ఉండే ఫైబర్ వల్ల కడుపులో కదలికలు ఎక్కువ గా ఉంటాయి. మ్యూసిలేజ్, ఇంకా ఇతర ఎంజైముల వల్ల సహజమైన విరేచనకారిగా పనిచేస్తుంది.
బరువు తగ్గొచ్చు
తక్కువ క్యాలరీలు కలిగిన డ్రైఫ్రూట్ అంజీరా. క్యాలరీ కౌంట్ గురించి ఆలోచించకుండా తినొచ్చు. డైటరీ ఫైబర్ వల్ల కడుపు నిండుగా ఉన్న భావన కలిగి క్యాలరీ ఇన్ టేక్ తగ్గుతుంది. కనుక ఆరోగ్యవంతమైన బరువుకు తోడ్పడుతుంది.
ప్రొస్టేట్ ఆరోగ్యానికి
ప్రొస్టేట్ అతి ముఖ్యమైన లైంగిక అవయవంగా చెప్పుకోవాలి. ఇది జీవిత పర్యంతం కూడా పెరుగుతుంది. వయసు పెరిగే కొద్ది తప్పకుండా దీని ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అంజీరాలు బలబద్దకాన్ని తగ్గించడం వల్ల పరోక్షంగా ప్రొస్టేట్ గ్రంథి లో ఇన్ఫ్లమేషన్ ను నివారిస్తాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్ల వల్ల ఆక్సిడేటివ్ ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇలా అన్ని రకాలుగా ప్రొస్టేట్ ఆరోగ్యానికి తోడ్పడుతాయి.
ఎముకల బలానికి
ఎండు అంజీరాలు ఎముకలు బలోపేతం కావడానికి కూడా దోహదపడతాయి. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ వల్ల ఎముకల బలంగా ఉంటాయి. ఎముకల సాంద్రతకు కాల్షియం అవసరం. మెగ్నీషియం వల్ల కాల్షియం గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. ఫాస్ఫరస్ ఎముకల స్వరూపాన్ని నిలిపి ఉంచుతుంది.
బీపి అదుపులో
పురుషుల్లో బీపి మహిళల కంటే ఎక్కువగా ఉంటుందని చాలా అధ్యయనాలు రుజువులు చూపుతున్నాయి. ఆరోగ్యకరమైన జీవన విధానం కలిగి ఉంటే బీపిని నివారించవచ్చు. అందులో భాగంగా ప్రతిరోజూ ఆహారంలో అంజీరాలు భాగం చేసుకోవాలి. ఇవి రక్తనాళాల ఆరోగ్యానికి మంచిది. ఫలితంగా గుండె పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది.
శక్తి పెంచుతాయి
అంజీరాల్లో ఉండే పోషకాలు అద్భుత ఫలితాలను ఇస్తాయి. వీటిలోని సహజమైన చక్కెరలు, డైటరీ ఫైబర్, పొటాషియం వంటి మినరల్స్, విటమిన్లు, ఐరన్ వంటి పోషకాలు శరీరంలో శక్తిని పెంచుతాయి. పొటాషియం ఫ్లూయిడ్ బ్యాలెన్స్ కి తోడ్పడుతుంది. డైటరీ ఫైబర్ వల్ల షుగర్ స్థాయిలు స్థిరంగా ఉండేందుకు దోహదం చేస్తాయి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్ల వంటి పోషకాల వల్ల అంజీరాలు మొత్తంగా ఆరోగ్యంగా, శక్తి కలిగి ఉండేందుకు తోడ్పడుతాయి.