అన్వేషించండి

Fruit Bats Diabetes: గబ్బిలాలతో మధుమేహానికి మందు - ఆశలు పుట్టిస్తోన్న కొత్త పరిశోధన

Diabetes Medicine: గబ్బిలాలను మనం బ్యాడ్ అనుకుంటాం. కానీ, వాటి వల్ల మేలు కూడా జరగబోతోంది. అదెలా అనుకుంటున్నారా? ఇదిగో ఇలా..

Diabetes Cure: గబ్బిలాల పేరు వినగానే.. అమ్మో కరోనా అనుకుంటాం. కానీ, భయం వద్దు. అది భవిష్యత్తులో మనల్ని దీర్ఘ కాలిక వ్యాధుల నుంచి బయటపడేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మధుమేహం (Diabetes) నుంచి యావత్ ప్రపంచాన్ని కాపాడే ఛాన్సులున్నాయి. ఎందుకంటే.. తాజాగా జరిపిన ఓ పరిశోధనలో కొన్ని కీలక విషయాలు తెలిశాయి. అవేంటో చూసేయండి.

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది డయాబెటిస్‌తో నరకం అనుభవిస్తున్నారు. ఒక్కసారి ఈ వ్యాధి మొదలైందంటే.. ఆపడం ఎవరితరం కాదు. ఆహారం నుంచి నిద్ర వరకు ప్రతి ఒక్కటీ పక్కగా ఉంటేనే.. మరికొన్నేళ్లు బతికే అవకాశం ఉంటుంది. లేకపోతే.. అవయవాలు ఒక్కొక్కటిగా పాడైపోతూ.. ఎప్పుడు మరణిస్తారో ఎవరికీ తెలియదు. అందుకే, దీనికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రూట్ బ్యాట్ (గబ్బిలాల్లో మరోరకం) డీఎన్ఏతో డయాబెటిస్‌ను కంట్రోల్ చేయొచ్చని తెలిసింది.

ఎక్కువ తినడమే కారణం

నోటిని కంట్రోల్ చేసుకోకపోతే.. చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా స్థూలకాయం, మధుమేహం, క్యాన్సర్ వంటి రోగాలు క్యూ కడతాయి. అందుకే, ఎంత తక్కువ తింటే అంత మంచిది. అలాగని కడుపు మాడ్చుకోవద్దు. పోషకాలు కలిగిన ఆహారాన్ని తగినంత తీసుకుంటే సరిపోతుంది. అయితే, ఈ రూల్స్ మనకు మాత్రమే. గబ్బిలాలకు వర్తించవు.

ఎందుకంటే.. తమ శరీర బరువు కంటే దాదాపు రెండు, మూడు రెట్లు ఎక్కువగా చక్కెర కలిగన పండ్లు తినే ఫ్రూట్ బ్యాట్స్ ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా హెల్దీగా జీవిస్తున్నాయి. ఇవి రోజూ నాలుగు గంటల పాటు తియ్యని పండ్లు తిని.. మరో 20 గంటల పాటు నిద్రపోతాయి. ఇదే పని మనిషి చేస్తే డయాబెటిస్ మాత్రమే కాదు, ఇంకా చాలా రోగాలు వస్తాయి. అందుకే.. యూనివర్సిటి ఆప్ కాలీఫోర్నియాకు చెందిన ఒక నిపుణుల బృందం ఫ్రూట్ బ్యాట్స్‌పై ఫొకస్ పెట్టాయి. 

డయాబెటిస్‌కు మందులేదు, కానీ..

పరిశోధనలో భాగంగా ఈ గబ్బిలాలు ఎంత ఎక్కువ చక్కెరలు తిన్నా సరే ఎలా ఆరోగ్యంగా ఉంటున్నాయో తెలుసుకొనే ప్రయత్నం చేశారు. ఆ సిస్టమ్‌ను మనుషుల్లో కూడా డెవలప్ చేస్తే.. మధుమేహం అనేదే ఉండదు కదా అని ఆలోచించారు. డయాబెటిస్ బారిన పడితే మానవ శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చెయ్యదు లేదా ఇన్సులిన్ క్రియాశీలంగా ఉండదు. అందువల్ల రక్తంలో చక్కెరను నియంత్రించడం సాధ్యం కాదు. కానీ ఫ్రూట్ బ్యాట్లు తమ రక్తంలో చక్కెరను నియంత్రించుకోగలవు. ఈ మేరకు అవి జన్యు వ్యవస్థను కచ్చితంగా కలిగి ఉంటాయని పరిశోధకులు భావిస్తున్నారు. మెరుగైన ఇన్సులిన్ ఉత్పత్తి కోసం దీనిపై మరింత లోతుగా అన్వేషించడం ముఖ్యమని అంటున్నారు. ఈ మేరకు పాంక్రియాస్, కిడ్నీల పనితీరును పరిశీలించామన్నారు. వాస్తవానికి డయాబెటిస్‌కు మందు దొరకదు. కానీ, గబ్బిలాల్లోని డీఎన్ఏ.. కొత్త ఆశలు చిగురించేలా చేస్తున్నాయ్.

ఫ్రూట్ బ్యాట్స్ డీఎన్ఏ(DNA) కీలకం

ఈ అధ్యయనంలో గబ్బిలాల పాంక్రియాస్.. అపరిమిత చక్కెరలను ప్రాసెస్ చెయ్యగలిగే జన్యుపరమైన మార్పులు కలిగి ఉన్నట్టు గుర్తించారు. అంతేకాదు వాటి కిడ్నీలు కూడా ఎలక్ట్రోలైట్ లను నిలిపి ఉంచగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయట. డీఎన్ఏలో ఉన్న ఒకే ఒక లెటర్ మార్పు కూడా గబ్బిలాలకు ఇటువంటి సామర్థ్యాన్ని అందించగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పెద్ద బ్రౌన్ బ్యాట్ కేవలం కీటకాలను మాత్రమే తింటుంది. దీనిని ఫ్రూట్ బ్యాట్ తో పోలుస్తూ పరిశోధనలు సాగిస్తున్నారు. పండ్లను జీర్ణం చేసుకోగలిగే డీఎన్ఏ‌ను ఫ్రూట్ బ్యాట్స్ అభివృద్ధి చేసుకోగలిగాయట. ఇన్సులిన్, గ్లూకాగాన్ జన్యువుల చుట్టూ ఉండే డీఎన్ఏలో రెండు గబ్బిలాల జాతుల మధ్య స్పష్టమైన తేడా గమనించారట.

నిజానికి జన్యువుల చుట్టూ ఉండే డీఎన్ఏను జంక్ గా పరిగణిస్తారు. కానీ వీరి డెటాలో ఈ రెగ్యులేటరీ డీఎన్ఏ రక్తంలో చక్కెరల ఆకస్మిక పెరుగుదల లేదా తగ్గుదలకు ప్రతిస్పందించడాన్ని గుర్తించారు. ఫ్రూట్ బ్యాట్స్ జీవక్రియలకు ఇది ప్రధానంగా ఉపకరిస్తోందని అభిప్రాయపడుతున్నారు.

 Also read: బ్రెయిన్ రీస్టార్ట్ మెకానిజాన్ని రివీల్ చేసిన కొత్త అధ్యయనం.. నిద్రతోనే ఇది సాధ్యం 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Siddaramaiah MUDA Case: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు, ఈ 6న విచారణకు హాజరు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు, ఈ 6న విచారణకు హాజరు
CM Revanth Reddy: 'రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దు' - విద్యార్థులకు చదువు, సామాజిక స్పృహ రెండూ ముఖ్యమన్న సీఎం రేవంత్
'రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దు' - విద్యార్థులకు చదువు, సామాజిక స్పృహ రెండూ ముఖ్యమన్న సీఎం రేవంత్
Embed widget