అన్వేషించండి

Brain Health: దంతాలు పరిశుభ్రంగా లేకపోతే మీ మెదడు పరిమాణం తగ్గిపోతుంది, జాగ్రత్త

మెదడుకు, దంత ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని కనిపెట్టారు శాస్త్రవేత్తలు.

Brain Health: చాలామంది నోటి ఆరోగ్యాన్ని పట్టించుకోరు. రోజుకు ఒకసారి బ్రష్ చేసి ఊరుకుంటారు. దంతాలు బలంగా ఉంటాయని, వాటికి ఏమీ కావని అనుకుంటారు. కానీ దంతాలు, నోటి పరిశుభ్రత ఎంతో ముఖ్యం. దంతాలు ఆరోగ్యంగా లేకపోతే ఆ ప్రభావం నేరుగా మెదుడు పైనే పడుతుంది. ఈ విషయాన్ని జపనీస్ పరిశోధకులు తమ కొత్త అధ్యయనంలో కనుగొన్నారు.

పేలవమైన నోటి పరిశుభ్రత, చిగుళ్ల వ్యాధులు, దంత క్షయం వంటివన్నీ కూడా మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అలాగే మెదడు పరిమాణాన్ని తగ్గించే అవకాశం కూడా ఉంది. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ముందుగా నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధి, దంత క్షయం వంటివి మెదడు కుచించుకోవడంతో ముడిపడి ఉందని చెబుతున్నారు అధ్యయనకర్తలు. ఇది జ్ఞాపకశక్తిని తగ్గించడంతోపాటు మతిమరుపు వ్యాధి వచ్చేలా చేస్తుంది. జపాన్లోని సెండాయ్‌లోని యూనివర్సిటీ వారు నిర్వహించారు. నాలుగేళ్లపాటూ ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఆ నాలుగేళ్ల పాటూ దంతాల ఆరోగ్యం, మెదడు పరిమాణాన్ని అంచనా వేస్తూ వచ్చారు. ఈ అధ్యయనంలో భాగంగా 67 ఏళ్లు పైబడిన వారిని ఎంచుకున్నారు. వారికి మతిమరుపు వంటి సమస్యలు ఏవీ లేవు. వీరికి ముందుగా స్కాన్ చేసి మెదడులో హిప్పోక్యాంపస్ పరిమాణాన్ని కొలిచారు. అలాగే దంతాలు ఎన్ని ఉన్నాయి, చిగుళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి అనేది కూడా అంచనా వేశారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వారిని పరిశీలించారు. చిగుళ్ల జబ్బుల బారిన పడినవారు, పళ్ళు ఊడినవారు, దంత క్షయంతో ఇబ్బంది పడుతున్న వారు... వీరందరిలో మెదడులోని హిప్పోక్యాంపస్ ఎడమ భాగం కుచించుకుపోయినట్టు గుర్తించారు. అంటే దంత ఆరోగ్యం పై మెదడు ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంది.

రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకుని, నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా నోటి ఆరోగ్యాన్నే కాదు మెదడును కూడా కాపాడుకున్న వారవుతారు. చిగుళ్ల సమస్యలు, దంత సమస్యల వల్ల మతిమరుపు వంటివి త్వరగా వచ్చే అవకాశం ఉంది. చిగుళ్ల వాపు, నొప్పి కలవారు దాన్ని విస్మరించకుండా డాక్టర్‌ను కలిసి తగిన మందులు వాడడం చాలా ముఖ్యం. కదిలే దంతాలు ఉన్నవారు వాటిని వెంటనే తొలగించుకుని కృత్రిమ దంతాలు బిగించుకోవాలని చెబుతున్నారు పరిశోధకులు. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా మెదడును కూడా కాపాడుకున్న వారు అవుతారని చెబుతున్నారు.

Also read: పొట్ట చుట్టూ చేరిన కొవ్వు త్వరగా తగ్గాలా? ఉదయం ఈ పనులు చేయండి

Also read: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మలేరియా వ్యాక్సిన్ వచ్చింది, మనదేశంలో వచ్చేది ఎప్పుడు?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Dahi Vankaya Recipe : వంకాయ, పెరుగుతో టేస్టీ రెసిపీ.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపించే టేస్టీ, ఈజీ కూడా
వంకాయ, పెరుగుతో రెసిపీ.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపించే టేస్టీ, ఈజీ కూడా
Conjunctivitis : కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
Vegetables In Monsoon : వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Doppelgangers : మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారా? పరిశోధనలో బయటపడిన ఆసక్తికర విషయాలు ఇవే
మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారా? పరిశోధనలో బయటపడిన ఆసక్తికర విషయాలు ఇవే

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sugali Parvathi Devi On Pawan Kalyan: సుగాలి ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్! మోసం చేశారని పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు!
సుగాలి ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్! మోసం చేశారని పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు!
Nizamabad Crime News: నిజామాబాద్ జిల్లాలో భర్తను భవనంపై నుంచి తోసేసిన భార్య! చనిపోలేదని హార్పిక్‌ ఇంజెక్ట్ చేసి దారుణహత్య! 
నిజామాబాద్ జిల్లాలో భర్తను భవనంపై నుంచి తోసేసిన భార్య! చనిపోలేదని హార్పిక్‌ ఇంజెక్ట్ చేసి దారుణహత్య! 
Allu Arjun : సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
Revamped Gold Monetization Scheme: ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
Aha Series OTT : కమల్ హాసన్ మూవీ టైటిల్‌తో న్యూ సిరీస్ - ఈ స్టోరీ మీదే కావొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కమల్ హాసన్ మూవీ టైటిల్‌తో న్యూ సిరీస్ - ఈ స్టోరీ మీదే కావొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Warangal Crime News: భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ రైలు కింద పడి భర్త ఆత్మహత్య.. వరంగల్ జిల్లాలో ఘటన
భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ రైలు కింద పడి భర్త ఆత్మహత్య.. వరంగల్ జిల్లాలో ఘటన
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Embed widget