Thyroid: థైరాయిడ్ గ్రంథి పనితీరు సక్రమంగా లేదా? ఇవి పాటించి చూడండి
థైరాయిడ్ గ్రంథి పనితీరు సక్రమంగా లేకపోతే దాని ప్రభావం శరీరమంతా పడుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి, జీర్ణక్రియలో సమస్యలు, హార్మోన్ల అసమతుల్యతతో పాటు ఇతర కారణాలు హైపో థైరాయిడ్ కి దారి తీస్తుంది.
థైరాయిడ్ గ్రంథి పనితీరు సక్రమంగా లేకపోతే దాని ప్రభావం శరీరమంతా పడుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి, జీర్ణక్రియలో సమస్యలు, హార్మోన్ల అసమతుల్యతతో పాటు ఇతర కారణాలు హైపో థైరాయిడ్ కి దారి తీస్తుంది. మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. జీర్ణక్రియ, జీవక్రియ, నిద్ర, ఎనర్జీ లేవల్స్, రుతుచక్రం సక్రమంగా పని చేసేందుకు ఈ గ్రంథి ఉపయోగపడుతుంది. ఈ గ్రంథి శరీరానికి తగినంత హార్మోన్లను విడుదల చేయకపోతే అనేక అనారోగ్య సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది. కీళ్ల నొప్పులు, అధిక బరువు, గుండె సంబంధించిన సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే థైరాయిడ్ గ్రంథి పని తీరు బాగుండాలంటే మన జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి.
మనం ఏం తింటున్నాం
మనం ప్రతి రోజు ఏం తింటున్నాం, అది ఎంత వరకు మన శరీరానికి అందుతుందనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. జీవక్రియకు సహాయపడే జీర్ణక్రియను నియంత్రించే కాలానుగుణమైన పండ్లు, కూరగాయలు తప్పని సరిగా తీసుకోవాలి. మీకు కనుక థైరాయిడ్ సమస్య ఉన్నట్లయితే సోయా ఆధారిత ఉత్పత్తులు, క్యాబేజ్, నిల్వ ఉంచిన మాంసం వంటి పదార్థాలని తీసుకోకపోవడమే మంచిది. ఒమేగా ఫ్యాటీ 3 ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేప, గుడ్లు వంటి ఆహారాన్ని మీ డైట్లో భాగం చేసుకోవడం ఉత్తమం.
బరువు అదుపులో ఉండాలి
హైపో థైరాయిడ్ తో బాధపడే వాళ్ళు తమ బరువును తప్పని సరిగా అదుపులో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ బరువును తగ్గించుకోవాలి. అంతే కాదు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. గర్భిణీలకు తప్పనిసరిగా థైరాయిడ్ టెస్ట్ చేస్తారు. అది కనుక ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. థైరాయిడ్ సమస్య ఉంటే చనుబాలు తగ్గుతాయని పిల్లలకి సరిపడినంత పాలు రాకుండా చేస్తుందని అంటారు.
మద్యం, కాఫీకి దూరం
థైరాయిడ్ గ్రంథి పని తీరు సరిగా ఉండాలంటే మద్యపానానికి, కాఫీకి దూరంగా ఉండాలి. ఇవి తాగే అలవాటు ఉంటే వాటికి దూరంగా ఉండటం మంచిది. తలనొప్పిగా ఉంటే మైండ్ రిఫ్రెష్ కోసం కాఫీ తాగుతుంటారు కొందరు. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు కాఫీకి మాత్రం దూరంగా ఉండాలి. అలాంటి వాళ్ళు ఒత్తిడి నుంచి బయటపడాలంటే కాఫీ తాగకపోవడం మంచిది.
గ్లూటెన్ ఫ్రీ ఫుడ్
గ్లూటెన్ రిచ్ ఫుడ్ థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు తీసుకోకపోవడమే ఉత్తమం. గోధుమలు, బార్లీ వంటి ఆహార పదార్థాల వల్ల థైరాయిడ్ గ్రంథి వాపుని పెంచుతుంది. దీని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు మనల్ని ఇబ్బంది పెడతాయి. అందుకే గ్లూటెన్ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలను ఎంచుకోవాలి.
ధ్యానం చేయాలి
బరువును అదుపులో ఉంచేందుకు, ఒత్తిడిని దూరం చేసేందుకు మన జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. మీ శరీరాన్ని, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి రోజుకి కనీసం 30 నిమిషాల పాటు ధ్యానం లేదా యోగా చెయ్యడం అలవాటు చేసుకోవాలి.
Also Read: చింతపండు వంటలకు రుచి ఇవ్వడమే కాదు బోలెడు అనారోగ్య సమస్యలను దరి చేరనివ్వదు