Tamarind Benefits: చింతపండు వంటలకు రుచి ఇవ్వడమే కాదు బోలెడు అనారోగ్య సమస్యలను దరి చేరనివ్వదు
పుల్లపుల్లగా, కాసింత తియ్యగా నోరూరించే విధంగా ఉంటుంది చింతపండు. ప్రతి భారతీయ వంటకంలోనూ దీన్ని గృహిణిలు కచ్చితంగా ఉపయోగిస్తూనే ఉంటారు. సాంబార్ దగ్గర నుంచి చట్నీ వరకు చింతపండు వెయ్యనిదే దేనికి రుచి రాదు
పుల్లపుల్లగా, కాసింత తియ్యగా నోరూరించే విధంగా ఉంటుంది చింతపండు. ప్రతి భారతీయ వంటకంలోనూ దీన్ని గృహిణిలు కచ్చితంగా ఉపయోగిస్తూనే ఉంటారు. సాంబార్ దగ్గర నుంచి చట్నీ వరకు చింతపండు వెయ్యనిదే దేనికి రుచి రాదు. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఇది ఉంటుంది. కేవలం రుచి కోసం మాత్రమే కాదండోయ్ దీని వల్ల బోలేడు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇందులో ఉండే గుణాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే కాదు బరువుని నియంత్రించడంలోనూ కీలకంగా మారుతుంది. ప్రోటీన్స్, అధిక మొత్తంలో కార్బో హైడ్రేట్స్, ఫైబర్, షుగర్, విటమిన్ బి1, బి 2, పొటాషియం మెండుగా ఉంటాయి. ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల మధుమేహ రోగులు తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. దీని వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం..
బరువు తగ్గొచ్చు
చింతపండులో చక్కెర, పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇందులో కొవ్వు ఉండదు. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ బరువు తగ్గడానికి బాగా పని చేస్తాయి. ఈ పండులోని ఎంజైమ్ లు ఆకలిని నియంత్రించేందుకు ఉపయోగపడతాయి.
జీర్ణక్రియను మెరుగుపరచడం
పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల కండరాలని బలోపేతం చేస్తుంది. జీర్ణ ప్రక్రియని మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది. అతిసారను తగ్గించేందుకు ఇది మంచి ఔషధం. పురుగు మందులు తాగిన సమయంలో దాన్ని కక్కించేందుకు వాళ్ళతో ఇళ్ళల్లో చాలా మంది చింతపండు నీళ్ళు తాగిస్తారు. ఇలా చెయ్యడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతినకుండా ఉంటుందని పెద్దలు చెబుతారు.
గుండె సంరక్షణ
చింతపండు గుండెను సంరక్షిస్తుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీని వల్ల ధమనుల్లో కొవ్వు పేరుకుపోయే ప్రమాదాన్ని నివారిస్తుంది.
పేగుల్లోని అల్సర్ నివారణ
చిన్న పేగు, పొట్టలో ఏర్పడే అల్సర్ కారణంగా తిన్న ఆహారం జీర్ణమయ్యే సామర్ధ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పేగుల్లో మంట కారణంగా ఆహారాన్ని తినలేక ఎంతో ఇబ్బంది పడతారు. చింతపండు తినడం వల్ల ఇటువంటి అల్సర్స్ తో పోరాడుతుంది.
కాలేయాన్ని కాపాడుతుంది
చింతపండు కాలేయాన్ని రక్షిస్తుంది. దీన్ని రోజువారీ డైట్ లో భాగంగా తీసుకుంటే కాలేయం చుట్టూ ఏర్పడే కొవ్వుని నియంత్రిస్తుంది. ఫ్యాటీ లివర్ బారిన పడకుండా ఇది మనకు రక్షణగా నిలిస్తుంది.
Also Read: సమాధులు తవ్వి, శవాలకు నీళ్లు తాగిస్తున్న గ్రామస్తులు.. దీని వెనుక పెద్ద కథే ఉంది!
Also Read: పిల్లులను పెంచితే ‘బెడ్ రూమ్’లో రెచ్చిపోతారట, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!