Cat Owners Benefits: పిల్లులను పెంచితే ‘బెడ్ రూమ్’లో రెచ్చిపోతారట, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
పిల్లులను పెంచే యజమానుల్లో పరిశోధకులు సరికొత్త పరాన్నజీవిని కనుగొన్నారు. పిల్లుల నుంచి సంక్రమించే పరాన్నజీవి వల్ల వాటి యజమానులు అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారని స్టడీ వెల్లడించింది.
మన దేశంలో చాలామంది కుక్క పిల్లలను మాత్రమే పెంచుకుంటారు. పిల్లులను పెంచుకొనేవారు చాలా తక్కువ. అయితే, పిల్లులను పెంచుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. అయితే, పిల్లులను పెంచుకోడానికి.. మనుషుల్లో లైంగిక సామర్థ్యం పెరగడానికి గల లింకేమిటనగే మీ సందేహం? బహుశా.. దీని గురించి మీరు ఎప్పుడూ విని ఉండరు. అసలు విషయం తెలిసిన తర్వాత మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు.
ఫిన్‌లాండ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ టర్కుకు చెందిన పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణం పెంపుడు జంతువుల నుంచి కొన్ని రకాల వ్యాధులు సంక్రమిస్తుంటాయి. ముఖ్యంగా పెంపుడు కుక్కులు లేదా పిల్లులు మీ గాయాలను నాకినట్లయితే.. ప్రమాదకర బ్యాక్టీరియా శరీరంలోకి చేరుతుంది. దానివల్ల ప్రాణాలు కూడా పోతాయి. అయితే, పిల్లుల్లో కనుగొన్న ఓ పరాన్నజీవి మనుషులకు చాలా మేలు చేస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇటీవల పిల్లులను పెంచుతున్న యజమానులను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. వారిలో ‘టోక్సోప్లాస్మా’ అనే పరాన్నజీవిని కొనుగొన్నారు.
‘టోక్సోప్లాస్మా’ ప్రమాదకర పరాన్నజీవి కాదని, పైగా దీనివల్ల వారికి ఆరోగ్యం కూడా లభిస్తుందని చెప్పడం విశేషం. ‘టోక్సోప్లాస్మా’ను కలిగిన స్త్రీ, పురుషులిద్దరూ అందంగా, ఆకర్షణీయంగా మారినట్లు పరిశోధకులు వెల్లడించారు. అంతేకాదు. ఈ పరాన్నజీవి మనుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుందని, దీనివల్ల సాధారణం కంటే ఎక్కువగా శృంగారంలో పాల్గొంటారని తెలిపారు. ఈ పరాన్నజీవి కొన్ని హార్మోన్లను యాక్టీవ్ చేయడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు.
ఈ పరాన్నజీవులు లైంగికంగా కూడా సంక్రమిస్తుందని పరిశోధకులు తెలిపారు. పిల్లులను ఎక్కువగా పెంచుకొనే బ్రిటన్ ప్రజల్లో ‘టోక్సోప్లాస్మా’ను ఎక్కువగా కనుగొన్నారట. ఆ దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ పరాన్నజీవిని మోస్తున్నారట. వాస్తవానికి ఈ పరాన్నజీవి ఎక్కువగా పిల్లి మలమూత్రల్లో ఉంటుంది. వాటిని క్లీన్ చేసేప్పుడు యజమానులకు ఆ పరాన్నజీవి సంక్రమిస్తుంది. అయితే, ‘టోక్సోప్లాస్మా’ను మోస్తున్నామనే సంగతి చాలామందికి తెలియదట.
Also Read: దెయ్యాలు ఉన్నాయా? ఆత్మలు కనిపిస్తాయా? ఈ వాస్తవాలు మిమ్మల్ని షేక్ చేస్తాయ్!
అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 213 మంది వ్యక్తుల డేటాను విశ్లేషించారు. ‘టోక్సోప్లాస్మా’ పరాన్నజీవి సోకిన వారు మూడవ వంతు మరింత ఆకర్షణీయంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. మహిళలు కూడా తక్కువ బరువును కలిగి ఉన్నారు. అయితే, ఈ పరాన్నజీవి మానవులపై ఇలా ఎందుకు పనిచేస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. హ్యాపీ హార్మోన్లుగా పేర్కొన్న సెరోటోనిన్, డోపమైన్ ఉత్పత్తిని నియంత్రించే జన్యువులతో ఈ పరాన్నజీవి కలవడం వల్లే ఈ ప్రయోజనం లభిస్తోందని భావిస్తున్నారు. దానివల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరిగి లైంగిక కోరికలను ప్రేరేపిస్తుందట. కొందరిలో మాత్రం కేలరీలు బర్న్ అయ్యేలా చేస్తున్నాయట.
Also Read: వృద్ధుడి వృషణాల నుంచి విజిల్స్, కారణం తెలిసి షాకైన డాక్టర్లు!
గమనిక: వివిధ అధ్యయనాలు, వైద్య నిపుణులు, హెల్త్ ఆర్టికల్స్ నుంచి గ్రహించిన కొన్ని వివరాలను మీ అవగాహన కోసం యథావిధిగా అందించాం. ఇది చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్య ఉన్న మీరు డాక్టర్ సలహా, సూచనలు తీసుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.