అన్వేషించండి

Facts about Ghosts: దెయ్యాలు ఉన్నాయా? ఆత్మలు కనిపిస్తాయా? ఈ వాస్తవాలు మిమ్మల్ని షేక్ చేస్తాయ్!

మీరు ఎప్పుడైనా దెయ్యాలు చూశారా? అవి మీకు మాత్రమే కనిపించి, ఇతరులకు ఎందుకు కనిపించడం లేదు. అయితే, మీ సందేహానికి ఈ కథనంలో సమాధానం దొరకవచ్చేమో.

దెయ్యాలు ఉన్నాయా? ఇది సమాధానం దొరకని ప్రశ్న. కాదని ఖండించలేని వాస్తవం. ఔనని అంగీకరించలేని కల్పన. ఎందుకంటే, కొందరు దెయ్యాలను తమ కళ్లారా చూశామని చెబుతారు. ఎవరూ నమ్మకపోతే.. అసహనానికి గురవ్వుతారు. దీన్ని బట్టి చూస్తే.. వారు నిజంగా ఏదో చూశారు. కానీ, అది దెయ్యమా కాదా అనేదే సందేహం. అయితే, దెయ్యాల గురించి సైన్స్ ఇప్పటివరకు ఏమీ చెప్పలేదు. దెయ్యాలు ఉన్నట్లు ఆధారాలు కూడా లేవు. అయితే, ఏడు మానసిక, పర్యావరణ కారకాల వల్ల కొందరికి దెయ్యాలు కనిపిస్తాయట. ఒక్క మాటలో చెప్పాలంటే.. మనం కళ్లు తెరిచి కనే కలలే దెయ్యం. 

సినిమాల్లో చూపించినట్లుగా ఆత్మలకు ఆకారం ఉండకపోవచ్చు. అలాగే వాటికి, మాయలు.. మంత్రాలు కూడా రాకపోవచ్చు. ఆత్మలు తిరుగుతున్నాయనేది కేవలం ఊహ మాత్రమే అనే భావన ఉంది. అయితే, ఏడు మానసిక, శారీరక కారకాలు ఏదైనా గగుర్పాటు కలిగించే సంఘటనలకు కారణమవుతాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్న హర్రర్ సినిమాలు, క్యాంప్‌ఫైర్‌లో చెప్పుకునే సరదా దెయ్యం కథలు మనకు తెలియకుండానే మన మనసులో నాటుకుపోతాయి. అంటే, ‘చంద్రముఖి’ సినిమాలో జ్యోతికలా కథలు విని, వాటిలోని పాత్రలతో ఊహాలోకాన్ని ఏర్పాటు చేసుకుని స్ప్లిట్ పర్శనాలిటీగా మారిపోవడం.  

రెండు గ్రూపులు.. వేర్వేరు అభిప్రాయాలు: అమెరికా ప్రజలకు దెయ్యాలంటే నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా రక్తాన్ని పీల్చుకుని తాగే డ్రాకులాలు ఉన్నాయని బాగా నమ్ముతారు. కొన్ని పీడకలలు కూడా దెయ్యాలు ఉన్నాయనే భ్రమను కలిగిస్తాయి. 1990లలో స్ప్రింగ్‌ఫీల్డ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లోని మనస్తత్వవేత్తలు కొన్ని శతాబ్దాలుగా మూసి ఉన్న   లింకన్ స్క్వేర్ థియేటర్‌లోకి రెండు గ్రూపులను పంపారు. ఆత్మల గురించి పరిశోధిస్తున్నామని ఒక గ్రూపుకు మాత్రమే చెప్పారు. మరో గ్రూప్‌కు ఈ విషయం తెలియదు. ఈ నేపథ్యంలో ఆత్మల ఉన్నాయనే భావనతో వెళ్లిన గ్రూపులోని సభ్యులు ఆ అనుభూతికి లోనయ్యారు. ఏవో ఆకారాలు కనిపించడం, పక్కనే ఎవరో నిలుచున్నట్లు అనిపించడం వంటివి ఫీలయ్యారు. అయితే, ఆత్మల గురించి తెలియని గ్రూప్ మాత్రం అలాంటి ఫిర్యాదులు, అనుభూతులేవీ నివేదికలు వెల్లడించలేదు. దీన్నిబట్టి.. మన మానసిక ఆలోచనలు ఎలాంటి ఆందోళనలకు గురిచేస్తాయో అర్థం చేసుకోవచ్చు. అంటే, మన మనసు మనల్నే మోసం చేస్తుందన్నమాట. 

దెయ్యం వాయిస్ వినడం నిజమేనా?: ఫ్రెంచ్ పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం.. దెయ్యాల వాయిస్‌ను వినడాన్ని ‘ప్యారిడోలియా’ అంటారు. దెయ్యాలు ఉన్నట్లు భావించే ఇంటిలో ఆత్మలను అన్వేషించే నిపుణుడు ఇంట్లోని శబ్దాలను రికార్డు చేస్తాడు. అవి చాలా అస్పష్టంగా ఉంటాయి. ఆ రికార్డు్ల్లో వచ్చే వాయిస్‌ను విని.. దెయ్యం ఏం చెబుతుందో చెప్పండి అని అడిగినప్పుడు.. మన మెదడు ఒక పదబంధాన్ని తయారు చేసుకుని.. దెయ్యం అలా మాట్లాడుతోందనే భావన కలిగిస్తుంది. అలాగే పగటి వేళ కంటే.. రాత్రివేళల్లోనే మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయట. అందుకే రాత్రిళ్లు ఒంటరిగా ఉండటానికి ఎక్కువ మంది భయపడతారు. నిశబ్ద వాతావరణం మన భయాన్ని రెట్టింపు చేస్తుంది. 

ఇళ్లల్లో దెయ్యాలు?: ఆర్కిటెక్చర్ పరంగానూ కొన్ని భయాలు ప్రజలను వెంటాడతాయట. 1975లో బ్రిటీష్ భౌగోళిక శాస్త్రవేత్త జే యాపిల్‌టన్ ఓ విషయాన్ని తెలుసుకున్నారు. మంచి వెలుతురు, చుట్టుపక్కల ఆవాసాలు కలిగే పరిసరాలను ఎక్కువ సురక్షితంగా భావిస్తారు. అయితే, వెలుతురు లేని చీకటి గదులు ఒక రకమైన భయాన్ని ప్రేరేపిస్తాయి. చీకటిగా ఉండే పాత ఇళ్లు నిజంగానే దెయ్యాలు ఉన్నాయనే భ్రమను కలిగిస్తాయి. అక్కడ ఉండే వాతావరణం గుండెల్లో ఏదో దిగులును రగిలిస్తుంది. దెయ్యాలను నమ్మేవారిలో అది భయాన్ని కలిగిస్తుంది.

దెయ్యాలు హానికరం కావు: ఇప్పటివరకు మనం దెయ్యాలను ఊహించుకోవడం కోసం తెలుసుకున్నాం. అయితే, కొందరు ఆత్మలు నిజంగానే ఉనికిలో ఉంటాయని వెల్లడించారు. అయితే, దెయ్యాలు లేదా ఆత్మలు ఎవరికీ హని చేయవట. వాటికి భయపెట్టే ఉద్దేశం కూడా ఉండదట. ముఖ్యమైన, మీకు నచ్చిన వ్యక్తిని కోల్పోయినప్పుడు మెదడు వారి ఆత్మలను పిలుస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. దీన్ని ‘ఫాంటమ్ లింబ్’ అని అంటారు. దీని వల్ల చాలామంది తమ సన్నిహితుల ఆత్మను చూశామని చెబుతుంటారు. బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లో 1971లో జరిపిన ఒక సర్వేలో వేల్స్, ఇంగ్లండ్‌లో దాదాపు సగం మంది వితంతువులు తమ భర్త ఆత్మను చూశామని చెప్పారట. మనస్తత్వవేత్తలు దీన్ని ‘కమ్యూనికేషన్ ఆఫ్టర్ డెత్’ అని పిలుస్తారు. అయితే, దెయ్యాలను విశ్వసించనివారు దీన్ని అస్సలు నమ్మరు.  

వేధింపులు.. ప్రమాదాలు కూడా కారణం: వేధింపులకు గురైన లేదా ప్రమాదకర పరిస్థితులకు గురయ్యే పిల్లలు పారానార్మల్ ఫాంటసీలను కలిగి ఉంటారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ముందుగా ‘చంద్రముఖి’లో జ్యోతిక ఫ్లాష్‌బ్యాక్‌లో చూపినట్లే.. చిన్నప్పుడు మనసుకు కలిగే గాయాలు.. పెద్దయ్యాక మానసిక ప్రభావాన్ని చూపుతాయి. స్ప్లిట్ పర్శనాలిటీకి దారి తీస్తాయి. మీకు తెలియకుండానే మీరు ఇద్దరిలా ప్రవర్తిస్తారు. ‘స్కిజోఫ్రెనియా’ అనే సమస్య కలిగిన వ్యక్తులకు కొన్ని స్వరాలు వినడం, ఆకారాలను చూసిన అనుభూతి కలుగుతుందట. మెదడులో అంతర్గత సమస్యలున్న వ్యక్తులు పారానార్మల్ ఘటనలను ఎదుర్కొంటున్నట్లు ఫీలవుతారట. మానసిక అనారోగ్యం లేనివారిలో కూడా మెదడులో తాత్కాలిక మార్పులు ఈ భయాలను ప్రేరేపిస్తాయట. 

30 శాతం మందికి ఆత్మలు కనిపిస్తాయ్: 2018లో నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ అప్లైడ్ అండ్ బేసిక్ మెడికల్ రీసెర్చ్‌’ సర్వే ప్రకారం.. సాధారణ జనాభాలో కనీసం 8 శాతం మంది మానసిక అనారోగ్యాలతో బాధపడుతున్నారట. వీరిలో 30 శాతం మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో రాత్రి వేళల్లో దెయ్యాలను చూసినట్లు భావిస్తున్నారట. ముఖ్యంగా కంబోడియా, నైజీరియా ప్రజలు దెయ్యాలను బాగా నమ్ముతారు. కంబోడియాలో ‘దెయ్యం మిమ్మల్ని కిందికి నెట్టె్స్తుంది’ అని బాధితులకు చెబతారు. నైజీరియాలో ‘దెయ్యం మీ వెనుకే ఉంది’ అని భయపెడుతుంటారు. దీంతో అక్కడి ప్రజలు తమతో దెయ్యాలు కూడా కలిసి జీవిస్తున్నాయనే భ్రమలో ఉంటారు. 

దాదాపు దెయ్యాన్ని చూశాడు, అన్వేషిస్తే అసలు విషయం తెలిసింది: 1980లో బ్రిటీష్ ఇంజనీర్ విక్ టాండీ ఒక మెడికల్ సప్లై కంపెనీ పరిశోధనాశాలలో పని చేస్తున్నప్పుడు అతనికి ఒక వింత అనుభూతిని ఎదుర్కొన్నాడు. అతడి శరీరం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఊహించనది ఏదో జరగబోతుందనే భావన అతడిలో కలిగింది. తనతో ఏదో ఉన్నట్లు భావించాడు. కొన్ని క్షణాల తర్వాత అతడికి బూడిద రంగులో ఓ ఆకారం కనిపించింది. అయితే, అతడు గది చుట్టూ తిరిగిన తర్వాత అది మాయమైంది. అయితే, అది తప్పకుండా దెయ్యం పనే అని అతడి సహోద్యోగులు చెప్పారు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కానీ, టాండీ నాస్తికుడు. దేవుడు, దెయ్యాలను నమ్మడు. క్యూరియాసిటీ కోసం అతడు మళ్లీ ఆ గదిని పరిశీలించాడు. అయితే, ఫ్యాన్ నుంచి 18.9 Hz రేటుతో వచ్చిన శబ్దమని తెలిసింది. అయితే, ఆ శబ్దం మనకు వినపడదు. కానీ, అది శరీరంపై ప్రభావాన్ని చూపుతుంది. మన కనుబొమ్మలు అదే పౌనఃపున్యంతో కంపిస్తాయి. ఆ శబ్దం టాండీలో ఆందోళన కలిగించింది. ఫలితంగా అతడు ఏదో ఆకారాన్ని చూసేలా చేసింది. అది అతడిలో భయాన్ని కూడా కలిగించింది. తరంగాల రూపంలో ఉండే ఈ శబ్దం చెవులకు వినిపించదు. 20 Hz కంటే తక్కువగా ఉండే ఈ శబ్దాన్ని ‘ఇన్‌ఫ్రాసౌండ్’ అని అంటారు. 1998 నుంచి 18.9 Hz శబ్దాన్ని ‘ఫియర్ ఫ్రీక్వెన్సీ’ అని పిలుస్తున్నారు. మీ ఇంట్లో ఏదో నెగటివ్ ఎనర్జీ ఉన్న ఫీలింగ్ మీకు కలుగుతున్నట్లయితే.. అది తప్పకుండా ఈ శబ్దమే అయ్యి ఉండవచ్చు. చూశారుగా..  

Also Read: కఫాన్ని మింగేస్తే ఏం జరుగుతుంది? శ్లేష్మం ఎందుకు ఏర్పడుతుంది?

మన మెదడే ఓ దెయ్యం: ఔనండి, మన మెదడే ఓ దెయ్యం. మెదడులోని టెంపోరల్ లోబ్‌లో ఏర్పడే మూర్ఛలు, విజువల్ మెమరీ, మాట్లాడే భాషను ప్రాసెస్ చేసే నోగ్గిన్ ప్రాంతాలు దెయ్యాల వీక్షణలను ప్రేరేపించవచ్చని మరో పరిశోధన వెల్లడించింది. మెదడు ప్రాంతంలోని విద్యుత్ అవాంతరాలు మనల్ని మరోప్రపంచానికి కనెక్ట్ చేసినట్లు అనిపిస్తాయట. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న రోగులు తాము దెయ్యాలు ఉన్నట్లు నమ్ముతారట. ఇలాంటి అనుభవాలు ఎక్కువగా తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల మధ్య ఉంటాయట. మరి, మీరు నిజంగా దెయ్యాలను చూసి ఉన్నట్లయితే.. అది నిజమైనా కావాలి. లేదా పై విధంగా చెప్పుకున్నల్లు ఊహైనా కావాలి. కాబట్టి, పదే పదే అలాంటి అనుభూతి ఏర్పడుతున్నప్పుడు మీరు మానసిక నిపుణులను సంప్రదించడం ఉత్తమ మార్గం. 

Also Read: వృద్ధుడి వృషణాల నుంచి విజిల్స్, కారణం తెలిసి షాకైన డాక్టర్లు!

Source: Mystery issue of Popular Science 2020

టాప్ హెడ్ లైన్స్

Rice Flour For Skin : రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
Soaked Figs Benefits : ఉదయాన్నే 2 నానబెట్టిన అంజీర్ తింటే.. మలబద్ధకం నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో లాభాలు
ఉదయాన్నే 2 నానబెట్టిన అంజీర్ తింటే.. మలబద్ధకం నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో లాభాలు
Coconut Laddu Recipe : బెల్లం పాకంతో కొబ్బరి లడ్డూలు.. ఆంధ్రా స్టైల్‌లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది
బెల్లం పాకంతో కొబ్బరి లడ్డూలు.. ఆంధ్రా స్టైల్‌లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Telangana Governor Quota MLC: తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
SIR Astrological Analysis: ఓటర్ల జాబితాపై వివాదం, SIR కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోతిష్య అంచనాలతో రాజకీయ ప్రకంపనలు!
ఓటర్ల జాబితాపై వివాదం, SIR కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోతిష్య అంచనాలతో రాజకీయ ప్రకంపనలు!
Rice Flour For Skin : రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
BC Reservations In AP: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
WagonR కొనుగోలుపై రూ. 64,600 డిస్కౌంట్ ఇస్తున్న మారుతి కంపెనీ.. ఆఫర్ పూర్తి వివరాలు
WagonR కొనుగోలుపై రూ. 64,600 డిస్కౌంట్ ఇస్తున్న మారుతి కంపెనీ.. ఆఫర్ పూర్తి వివరాలు
Embed widget