News
News
X

Swallowing Mucus: కఫాన్ని మింగేస్తే ఏం జరుగుతుంది? శ్లేష్మం ఎందుకు ఏర్పడుతుంది?

గొంతులో కిచ్‌కిచలాడే.. శ్లేష్మాన్ని నోట్లోకి తెచ్చుకుని మళ్లీ మింగేస్తున్నారా? అయితే, మీరు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.

FOLLOW US: 

ఛాతిలో కఫం లేదా శ్లేష్మం పట్టిందంటే తప్పకుండా జ్వరం వస్తుంది. ఒక వేళ జ్వరం రాకపోయినా.. అది మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది. కొందరికి కఫం వల్ల దగ్గు కూడా విపరీతంగా వస్తుంది. మరికొందరు.. మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడతారు. కొందరికి ఛాతి భారంగా ఉంటుంది. ఆ కఫాన్ని గొంతులోకి తెచ్చుకుని బయటకు ఊసేస్తే పర్వాలేదు. కానీ, దాన్ని చాలామంది నోట్లోకి వచ్చిన తర్వాత మింగేస్తుంటారు. అలా చేయడం చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ కఫం అంటే ఏమిటీ? అది ఎలా ఏర్పడుతుంది? అది ఎందుకంత ప్రమాదకరం? 

కఫం అంటే?: కఫం అనేది శ్వాసకోశ మార్గాల శ్లేష్మ స్రావం. శ్లేష్మంలో 95% నీరు, 3% మ్యూకిన్-యాంటీబాడీస్‌తో వంటి ప్రోటీన్లు, 1% ఉప్పు తదితరాలు ఉంటాయి. మ్యూకిన్ బిందువులు నీటిని గ్రహిస్తాయి. అది శ్లేష్మ గ్రంథుల నుంచి విడుదలైన మూడు సెకన్లలో వందల రెట్లు ఉబ్బుతాయి. శ్లేష్మ తంతువులు క్రాస్ లింక్‌లను ఏర్పాటు చేయడం వల్ల కఫం సాగే జెల్‌గా మారుతుంది. అందుకే అది కఫం అంత చిక్కగా జిగటలా కనిపిస్తుంది.  

మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు.. మీ కఫం పలుచగా, నీరులా ఉంటుంది. రోజూ మీకు తెలియకుండానే 1.5 లీటర్ల కఫాన్ని మింగేస్తారు. మీకు జలుబు లేదా ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఉన్నా, లేదా స్మోకింగ్ అలవాటు ఉన్నా.. మీ కఫం చిక్కగా, ముదురు రంగులో ఉండవచ్చు. బ్యాక్టీరియా, వైరస్‌లు, తెల్ల రక్త కణాల, యాంటీబాడీల వల్ల కఫం అలా మారుతుంది. అయితే, శ్లేష్మాన్ని మింగడం మంచిదా? కాదా అనే సందేహంపై భిన్న వాదనలు ఉన్నాయి.

శ్లేష్మం ఏం చేస్తుంది?: శ్లేష్మం ఒక్కోసారి మేలు కూడా చేస్తుంది. అది లైంగిక అవయవాలు, ప్రేగులతో సహా మన అంతర్గత అవయవాలను రక్షిస్తుంది. కానీ, ఊపిరితీత్తుల్లోని వాయు మార్గానికి మాత్రం ఇది సమస్యాత్మకమే. ఎందుకంటే.. మన ముక్కులోని రెండు నాసిక కుహరాలు కలిపి 150 చదరపు సెంటీమీటర్లు ఉంటాయి. వాటి గోడలపై మడతలు ఉంటాయి. మనం పీల్చే గాలిలో 80 శాతం మలినాలు ఇక్కడే పిల్టర్ అవుతాయి. గోడలపై వెంటుకల తరహాలో ఉండే సిలియా మలినాలను అడ్డుకుంటుంది. శ్లేష్మాన్ని క్లియర్ చేస్తుంటుంది. కాబట్టి, ప్రమాదకర దుమ్మూ, దూళి శ్లేష్మానికి అంటుకోవు. శ్లేష్మం నిరంతరం ఉత్పత్తి అవుతుంది. నిద్రలో తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అవుతుంది. శ్లేష్మంలో మృతకణాలు, దుమ్ము, శిధిలాలు ఉంటాయి. అది కడుపులోకి వెళ్లిన తర్వాత రీసైక్లింగ్ అవుతుంది. ముక్కు రోజుకు 100 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఊపిరితిత్తులు రోజుకు దాదాపు 50 మిల్లీలీటర్ల కఫాన్ని ఉత్పత్తి చేస్తాయి.

కఫం పడితే.. జ్వరం, దగ్గు ఎందుకు వస్తాయి?: శ్లేష్మంలో తెల్ల రక్త కణాలు, యాంటీబాడీలు ఉంటాయి. ఇన్ఫెక్షన్, చికాకులు లేదా అలెర్జీ కారకాలను తొలగించడానికి శ్లేష్మం పెరుగుతుంది. అయితే, కొన్ని వైరస్‌లు సిలియాను కూడా దెబ్బతీస్తాయి. దానివల్ల శ్లేష్మం ముదురుతుంది. దాని వల్ల దగ్గు, తుమ్ములు, ముక్కు కారడం వంటి సమస్యలు ఏర్పడతాయి. కొందరిలో జ్వరం కూడా ఏర్పడుతుంది. క్రానిక్ బ్రోన్కైటిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవారిలో శ్లేష్మ గ్రంథులు సాధారణ స్థాయిల కంటే మూడు నుంచి నాలుగు రెట్లు కఫాన్ని ఉత్పత్తి చేస్తాయి. దాన్ని సిలియా సులభంగా క్లీన్ చేయలేదు. దగ్గు వల్ల సిలియా అలసిపోతుంది. దానివల్ల అది శ్లేష్మాన్ని నెమ్మదిగా కదిలిస్తుంది. ఫలితంగా శ్లేష్మం మరింత జిగటగా మారుతుంది. అందుకే చాలామందికి జలుబు, గవత జ్వరం వస్తాయి. అయితే, శ్లేష్మం ఏర్పడినప్పుడు ఉప్పు ద్రవణాన్ని తీసుకుంటే ఫలితం ఉంటుందని తేలింది. కానీ, బీపీ, డయాబెటిస్ ఇతరాత్ర వ్యాధులు ఉన్నవారు.. వైద్యుడి సూచనలు లేకుండా ఉప్పు నీటిని తాగరాదు. 

శ్లేష్మాన్ని మింగితే ఏమవుతుంది?: కఫంలో బ్యాక్టీరియా ఉంటుందని, మింగడం వల్ల అది శరీరం మొత్తం పాకేస్తుందని భావిస్తారు. అలాగే, మన ఊపిరితీత్తుల్లో కఫాన్ని మరింత పెంచేస్తుందని అంటున్నారు. అయితే, నిపుణులు దీనిపై స్పందిస్తూ.. కఫం విషపూరితం కాదని, మింగడం వల్ల ఎలాంటి హాని కలగదని తెలిపారు. కడుపులోకి వెళ్లిన కఫాన్ని శక్తివంతమైన యాసిడ్‌లు, ఎంజైమ్‌లు నాశనం చేస్తాయి. కాబట్టి, అందులోని బ్యాక్టీరియా ఇతర శరీర భాగాలకు చేరడం అసాధ్యం. 

ఛాతిలో భారం, దగ్గు: ఛాతిలో భారంగా ఉండి, దగ్గు వస్తున్నట్లయితే.. అది చాతి ఇన్ఫెక్షన్‌కు సంకేతం. గొంతులోని కఫం ఊపిరితిత్తుల నుంచి పుట్టిందా? లేదా నాసికా కుహరం వెనుక నుంచి అక్కడికి జారిందా? అనేది నిర్ధారించడం చాలా కష్టం. గొంతులో కిచకిచలాడే శ్లేష్మం ఎక్కడ నుండి వచ్చినా ఛాతీలో ఉన్నట్లే అనిపిస్తుంది. అయితే, దగ్గు వల్ల సమస్య ఏమిటనేది స్పష్టంగా తెలుసుకోవచ్చట. 

ఆకుపచ్చ కఫం: ఆకుపచ్చ శ్లేష్మం బ్యాక్టీరియా సంక్రమణను సూచిస్తుంది. దీనికి యాంటీబయాటిక్ చికిత్స అవసరం. శ్లేష్మం ఇంకా పసుపు పచ్చ, నారింజ, గోదుమ, బూడిద రంగుల్లో కూడా ఉంటుంది. ఆ రంగును బట్టి కూడా వైద్యులు మందులను సూచిస్తుంటారు. 

పాలు తాగితే కఫం?: చాలా మంది పాలు, పాల ఉత్పత్తులు అదనపు శ్లేష్మానికి కారణమవుతాయని నమ్ముతారు. కాబట్టి గవత జ్వరం, ఆస్తమా ఉన్నవారు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటం మంచిది. 

Also Read: వృద్ధుడి వృషణాల నుంచి విజిల్స్, కారణం తెలిసి షాకైన డాక్టర్లు!
Also Read: పావురాలతో శ్వాసకోశ సమస్యలు? వాటితో ఎలాంటి సమస్యలు వస్తాయి?

గమనిక: వివిధ అధ్యయనాలు, వైద్య నిపుణులు, హెల్త్ ఆర్టికల్స్ నుంచి గ్రహించిన కొన్ని వివరాలను మీ అవగాహన కోసం యథావిధిగా అందించాం. ఇది చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్య ఉన్న మీరు డాక్టర్ సలహా, సూచనలు తీసుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు. 

Published at : 01 Jul 2022 12:17 PM (IST) Tags: Mucus Side Effects Sputum Side Effects Phlegm side effects Mucus problem Swallowing Mucus

సంబంధిత కథనాలు

Diabetes: ఈ అయిదు ఆహారాలు రోజూ తింటే డయాబెటిస్ నియంత్రణలో ఉండడం ఖాయం

Diabetes: ఈ అయిదు ఆహారాలు రోజూ తింటే డయాబెటిస్ నియంత్రణలో ఉండడం ఖాయం

Zoonotic Langya Virus: కరోనాలాగే లాంగ్యా వైరస్ కూడా ప్రపంచాన్ని వణికిస్తుందా? లక్షణాలు ఎలా ఉంటాయంటే

Zoonotic Langya Virus: కరోనాలాగే లాంగ్యా వైరస్ కూడా ప్రపంచాన్ని వణికిస్తుందా? లక్షణాలు ఎలా ఉంటాయంటే

Viral: ‘పిచ్చెక్కించే తేనే’ దీన్ని తాగితే మామూలుగా ఉండదు, మద్యాన్ని మించిన కిక్కు, అతిగా తాగితే మరణమే

Viral: ‘పిచ్చెక్కించే తేనే’ దీన్ని తాగితే మామూలుగా ఉండదు, మద్యాన్ని మించిన కిక్కు, అతిగా తాగితే మరణమే

Languages: ప్రపంచాన్ని ఏలుతున్న అయిదు భాషలు ఇవే, ఒక్కో భాషని ఎంత మంది మాట్లాడుతున్నారో తెలుసా?

Languages: ప్రపంచాన్ని ఏలుతున్న అయిదు భాషలు ఇవే, ఒక్కో భాషని ఎంత మంది మాట్లాడుతున్నారో తెలుసా?

Weight Loss: ఈ రోటీలు రోజుకు రెండు తినండి చాలు, నెలలో అయిదు కిలోల బరువు తగ్గే అవకాశం

Weight Loss: ఈ రోటీలు రోజుకు రెండు తినండి చాలు, నెలలో అయిదు కిలోల బరువు తగ్గే అవకాశం

టాప్ స్టోరీస్

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం ! నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం !  నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్‌ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!

Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్‌ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!