Health problems with Pigeons: పావురాలతో శ్వాసకోశ సమస్యలు తప్పవా? వాటికి ఆహారం వేయొద్దని గతంలో అధికారులు ఎందుకు చెప్పారు?
పావురాలతో మనుషులకు ఆరోగ్యసమస్యలు వస్తాయని వార్తలు వస్తున్నాయి, అందులో నిజమెంత?
మీనా భర్త మరణంతో మళ్లీ పావురాలు హాట్ టాపిక్‌గా మారాయి. లాంగ్ కోవిడ్‌తో బాధపడుతున్న మీనా భర్త విద్యాసాగర్ రోజూ పావురాలకు గింజలు చల్లే వారు. ఆ పావురాలు వదిలిన వ్యర్థాల వల్లే ఈయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్టు చెబుతున్నారు. దాని వల్లే పరిస్థితి విషమించి మరణించారని వార్తలు వస్తున్నాయి. దీంతో పావురాలు అంత ప్రమాదకరమా? అనే చర్చ నడుస్తోంది. గతంలో కూడా పావురాలకు ఆహారం వేయడానికి వెళ్లొద్దంటూ అధికారులు చెప్పారు. దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారు పావురాలు ఉన్న చోటికి కూడా వెళ్లొద్దని చెప్పేవారున్నారు. ఇంతకీ ఎందుకు పావురాలు అంత ప్రమాదకరం అని చెబుతున్నారు? అందులో నిజమెంత?
ఇదే సమస్య
హైపర్ సెన్సిటివ్ న్యుమోనైటిస్ లేదా బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్... ఇదొక ఊపిరితిత్తులకు వచ్చే అలెర్జీ. పావురాల వదిలే రెట్టల వల్ల వచ్చే వ్యాధి ఇది. దీని లక్షనాలు నిమోనియాకు దగ్గరగా ఉంటాయి కాబట్టి, చాలా మంది వైద్యులు గందరగోళపడుతుంటారు. ఈ అలెర్జీ వల్ల జ్వరం, దగ్గు, కీళ్ల నొప్పులు,శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పావురాలు మూత్రం, మలం కలిపి ఒకసారే విసర్జిస్తాయి. అందుకే వీటి విసర్జితాలు చాలా ప్రమాదకరం. ఇవి ఎండిపోయాక చిన్న కణాలుగా గాలిలో కలిసిపోతాయి. వాటికి గింజలు వేయడానికి వెళ్లిన వారికి శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటాయి. అక్కడ అలెర్జీకి, ఇన్ఫెక్షన్ కు దారి తీస్తాయి. ఆ ఇన్ఫెక్షన్ ముదిరి ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. తక్కువ రోగినిరోధక శక్తి ఉన్నవారు, రోగాలు ఉన్నవారు, కోవిడ్ వచ్చిన తగ్గిన వారు పావురాలకు దూరంగా ఉండమని సూచిస్తున్నారు వైద్యులు.
అధ్యయనాలు తేల్చి చెప్పాయా?
పావురాలతో నూరు శాతం ప్రమాదం అని చెప్పిన అధ్యయనాలు లేవు. కానీ దాదాపు ఇది నిజమేనని చెప్పిన పరిశోధనలు ఉన్నాయి. వైద్యులు కూడా పావురాలకు దగ్గరగా జీవించవవద్దని సూచిస్తున్నారు. 2019లో హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ పరిధిలో పావురాలకు ఆహారం వేయాడాన్ని నిషేధించారు. అంతేకాదు వందలకొద్దీ పావురాలను పట్టి అడవుల్లో విడిచి పెట్టారు కూడా. కేవలం జీహెచ్ఎంసీ అధికారులే కాదు విదేశాల్లో చాలా చోట్ల పావురాలను నిషేధించారు. లండన్లో పావురాలకు దానా వేస్తే 500 పౌండ్ల జరిమానా వేస్తారు.
Also read: హైదరాబాద్‌లో కచ్చితంగా రుచి చూడాల్సిన ఫుడ్ ఐటెమ్స్ ఇవే, తింటే మైమరచిపోవడం ఖాయం