Meena Husband Lung Infection: ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో మీనా భర్త మరణం , ఈ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? ట్రాన్స్‌ప్లాంటేషన్ కుదురుతుందా?
మీనా భర్త విద్యాసాగర్ మరణించిన వార్త సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది.
నటి మీనా భర్త విద్యా సాగర్‌కు నలభైఎనిమిదేళ్లు. చిన్న వయసులోనే ఊపిరితిత్తులు మొత్తం ఇన్ఫెక్షన్ వల్ల పాడైపోయాయి. ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం పడింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి ఊపిరితిత్తుల కోసం వెతుకుతుండగానే పరిస్థితి విషమించి ఆయన మరణించారు. అంతగా ఆయన ఊపిరితిత్తులు ఎందుకు చెడిపోయాయి? ఎలాంటి పరిస్థితులు ఆయనను మరణానికి చేరువ చేశాయి? లాంగ్ కోవిడ్ తో బాధపడుతున్న వారికి ఇలా జరిగే అవకాశం ఎంతుంది? అనే అంశాల గురించి ఇక్కడ వివరించాం.
అసలేం జరిగింది?
మీనా కుటుంబం మొత్తం ఈ ఏడాది జనవరిలో కోవిడ్ బారిన పడింది. మీనాతో పాటూ విద్యాసాగర్‌కు కూడా కరోనా ఇన్ఫెక్షన్ త్వరగానే నెగిటివ్ వచ్చింది కానీ, పోస్ట్ కోవిడ్ లక్షణాలు మాత్రం వేధించడం మొదలుపెట్టాయి. లాంగ్ కోవిడ్ అంటే కరోనా వైరస్ శరీరంలో లేనట్టు నెగిటివ్ చూపించినా, కొన్ని నెలల పాటూ దాని లక్షణాలు వదలకుండా వేధించడం. దీని బారినే విద్యాసాగర్ పడినట్టు తెలుస్తోంది. అలాగే ఆయనకు పావురాలకు ఆహారాన్ని వేసే అలవాటు ఉంది. ఆ అలవాటును కూడా ఆయన పొస్ట్ కోవిడ్ లక్షణాలతోనే కొనసాగించినట్టు తెలుస్తోంది. దాని వల్ల పరిస్థితి చేజారిందని, ఇన్ఫెక్షన్ పెరిగిందని అంటున్నారు.
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అంటే?
కరోనా వైరస్ వల్ల కలిగే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ గురించి చెప్పాలంటే... గొంతులోంచి ఆ వైరస్ ఊపిరితిత్తుల్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. వాటిపైనే తీవ్రప్రభావం చూపిస్తుంది.శ్వాసమార్గంలో ఇబ్బందులు కలుగజేస్తుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. గొంతునొప్పి, పొడి దగ్గు ఎక్కువైపోతుంది. ఊపిరితిత్తుల్లోని గాలి సంచులు ద్రవంతో నిండిపోతాయి. ఊపిరితిత్తులు వాచిపోతాయి. నిమోనియా లక్షణాలు పూర్తిగా కనిపిస్తాయి. కొంతమంది పాతికశాతం ఊపిరితిత్తులు పాడవుతాయి. కానీ కొందరిలో మాత్రం దాదాపు పూర్తిగా పాడైపోతాయి. అయితే ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఇదే మీనా భర్త విద్యాసాగర్ విషయంలో జరిగింది.
ట్రాన్స్‌ప్లాంటేషన్ సులువా?
మనశరీరంలో కొన్ని అవయవాలు చెడిపోతే మార్పడి చేసుకుని తిరిగి జీవించవచ్చు. వాటి జాబితాలో ఊపిరితిత్తులు కూడా ఉన్నాయి. కొందరికి ఇక ఊపిరితిత్తే పాడవుతుంది, మరికొందరిలో రెండూ పాడవుతాయి. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి ఊపిరితిత్తులను తీసి వీరికి అమర్చాలి. అయితే ఇది చాలా కష్టమైన ప్రక్రియ. ఖర్చు కూడా అధికం. మార్పిడి చేశాక ఎన్నాళ్లు జీవిస్తారు అనేది రోగి వయసు మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో ఊపిరితిత్తుల మార్పిడి చేసుకున్నాక అత్యంత ఎక్కువ కాలం జీవించి వ్యక్తి పామ్ ఎవ్రెట్ స్మిత్. ఈమె మార్పిడి అయ్యాక ముఫ్పె ఏళ్లు పాటూ జీవించారు. సాధారణంగా చెప్పుకోవాలంటే కొంతమంది అయిదేళ్లు, పదేళ్లు, పదిహేనేళ్లు ఇలా జీవించే అవకాశాలు ఉన్నాయి.
Also read: హైదరాబాద్‌లో కచ్చితంగా రుచి చూడాల్సిన ఫుడ్ ఐటెమ్స్ ఇవే, తింటే మైమరచిపోవడం ఖాయం
Also read: లస్సీ అంటే ఇష్టమా? అధికంగా తాగితే వచ్చే సైడ్ ఎఫెక్టులు గురించి తెలుసుకోండి మరి