Lassi Side Effects: లస్సీ అంటే ఇష్టమా? అధికంగా తాగితే వచ్చే సైడ్ ఎఫెక్టులు గురించి తెలుసుకోండి మరి
లస్సీ అంటే ప్రాణమిచ్చేసే వాళ్లు ఎంతోమంది. కానీ ఏదీ అతిగా తినకూడదు, తాగకూడదు.
చల్లటి గ్లాసులో స్వీట్ లస్సీ తాగుతుంటే ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంది చాలా మందికి. ఆ పానీయానికి ఎంతో మంది బానిసలుగా కూడా మారిపోయారు. ఉత్తర భారతదేశంలో దీన్ని రోజూ తాగే వారు ఎంతో మంది. లస్సీని ఒక్కొక్కరూ ఒక్కోలా తయారు చేస్తారు. కుంకుమ పువ్వు,కోవా ముద్ద, బాదం పప్పుల తరుగు, చక్కెర, పండ్లు, మసాలా దినుసులు ఇలా రకరకాల వస్తువులు కలిపి చేస్తారు. కాబట్టి దీని రుచి అదిరిపోతుంది. కొంతమంది కేవలం ఉప్పు, పంచదార, పెరుగు మాత్రమే వేసుకుని తాగే వారు ఉన్నారు. అయితే ఇది మితంగా తాగితే మంచిదే. కానీ అధికంగా తాగితే మాత్రం కొన్ని సైడ్ ఎఫెక్టులు ఉన్నాయి.
అధిక చక్కెర
లస్సీ ఇచ్చే రుచికి దాసోహమైపోయి చాలా మంది దీన్ని తాగేస్తారు. కానీ ఇందులో అధిక చక్కెర, కొవ్వు ఉంటాయి. వీటిని రోజూ తాగడం వల్ల వివిధ రకాల ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మసాలా లస్సీ
లస్సీలో ఓ రకం మసాలా లస్సీ. ఇందులో ఉప్పు అధికంగా ఉంటుంది. మసాలా పొడిని కూడా వేస్తారు. ఈ డ్రింకును తాగడం వల్ల సోడియం అధికంగా ఒంట్లో చేరి హైబీపీకి కారణం అవుతుంది. అలాగే కిడ్నీ సమస్యలు కూడా పెరుగుతాయి. రక్తపోటు స్థాయిలకు ఆటంకం కలుగుతుంది.
బరువు పెరుగుతారు
ఇందులో కొవ్వు నిండిన పాలు, పంచదార, ఉప్పు, మసాలాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ క్యాలరీలను పెంచేవే. దీన్ని తరచూ తాగడం వల్ల బరువు పెరుగుతారు. అంతేకాదు దీనిలో ఉండే అధిక ప్రొటీన్ జీర్ణం కాక ఇబ్బంది పెడుతుంది. నిద్ర కూడా పట్టనివ్వదు.
చర్మ వ్యాధులు
తామర వంటి చర్మ సమస్యలతో బాధపడేవారు మజ్జిగ, పెరుగు, లస్సీ వంటి వాటికి దూరంగా ఉండాలి. చర్మంపై మంట, చికాకు, పొడిబారడం వంటి సమస్యలు కలుగుతాయి.
ఊపిరితిత్తుల్లో మ్యూకస్
రాత్రిపూట లస్సీ తాగడం వల్ల జలుబు, దగ్గుకు కారణం అవుతుంది. ఊపిరితిత్తుల్లో మ్యూకస్ అతిగా ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల జలుబు దగ్గు త్వరగా వస్తాయి. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు కూడా పెరుగుతాయి.
Also read: మహిళలూ 30 దాటిందా? అయితే ఈ పానీయాలు తాగాల్సిందే
Also read: ఈ బొమ్మలో ఒక జంతువు దాక్కొని ఉంది, 30 సెకన్లలో దాన్ని కనిపెడితే మీ కంటి చూపు భేష్
Also read: రాకాసి మిరపకాయ, ప్రపంచంలోనే అత్యంత స్పైసీ మిర్చి, అస్సామీల పళ్లెంలో ఇది ఉండాల్సిందే