అన్వేషించండి

Women Food: మహిళలూ 30 దాటిందా? అయితే ఈ పానీయాలు తాగాల్సిందే

మహిళల కోసమే ప్రత్యేక కథనం ఇది. అదులోనూ 30 ఏళ్లు దాటుతున్న స్త్రీలు కచ్చితంగా చదవాలి.

మహిళలు పుట్టుకతోనే మగవారితో పోలిస్తే కాస్త శక్తిహీనంగా ఉంటారు. సరిగ్గా చెప్పాలంటే పురుషుల కన్నా 30 శాతం తక్కువ శారీరక శక్తితో పుడతారు స్త్రీలు. అయితే మానసికంగా మాత్రం స్త్రీలే బలవంతులు. కష్టాలను తట్టుకునే శక్తి వీరికే ఎక్కువ. అయితే ఇక్కడ మనం శారీరక శక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. 30 ఏళ్లు దాటిన ఆడవారిలో శారీరకంగా చాలా మార్పులు మొదలవుతాయి. ఎముకల్లో కాల్షియం తగ్గడం, కాసేపు నడిస్తేనే మోకాలి నొప్పులు రావడం వంటివి జరుగుతాయి. అంతేకాదు ఓపక్క ఇంటి పని, మరో పక్క ఉద్యోగం, ఇంకో పక్క పిల్లల బాధ్యతలు ఇన్ని పనుల మధ్యలో తన గురించి తాను పట్టించుకోదు ఇల్లాలు. కానీ 30 ఏళ్లు దాటుతున్న మహిళకు స్వీయ సంరక్షణ చాలా అవసరం. ఆ వయసు దాటాక ఫిట్ గా ఉండాలన్న,చురుగ్గా పనిచేయాలన్నా కొన్ని రకాల ఆహారాలు తప్పకుండా తీసుకోవాలి. టీ , షర్బెత్‌లు, స్మూతీలు, జ్యూస్‌లు వంటివి చేసుకుని తాగేటప్పుడు కింద చెప్పిన పదార్థాలను జత చేసుకోవాలి. 

బెర్రీలు
బ్లూబెర్రీలు, క్రాన్ బెర్రీలు, రాస్ బెర్రీలు వంటివి సూపర్ మార్కెట్లో దొరుకుతుంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని స్మూతీస్ లేదా షేక్స్ రూపంలో చేసుకుని తాగితే మంచిది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ముందుంటాయి. మూత్రనాళ సమస్యలు,వృద్ధాప్య సంకేతాలు త్వరగా రావు. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో కూడా ముందుంటాయి. 

చేమంతి పూల టీ
చేమంతి పూల టీని అప్పుడప్పుడు తయారు చేసుకుని తాగాలి. ఈ పూలను పాలలో లేదా నీటిలో వేసి మరిగించుకుని తాగితే మంచిది. చేమంతి పూల టీ వల్ల కండరాలు, నరాలు సడలించడంలో ఇవి సహకరిస్తాయి. చేమంతి పూలలో హీలింగ్ గుణాలు అధికం. ఇది ఎముకలను బలంగా మారుస్తుంది. బోలు ఎముకల వ్యాధి రాకుండా అడ్డుకుంటుంది. రుతుక్రమ సమయంలో నొప్పిని, తిమ్మిరిని తగ్గిస్తుంది. అనేక రకాల క్యాన్సర్లను అడ్డుకుంటుంది. 

పాలకూర
పాలకూరలో ఐరన్, ఫొలేట్, మెగ్నిషియం, కాల్షియం అధికంగా ఉంటాయి. అలాగే విటమిన్ కె, విటమిన్ బి కూడా పుష్కలంగా దొరుకుతాయి. ఇవి కూడా ఎముకలను బలోపేతం చేస్తాయి. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి. రక్తహీనత వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. అందుకే పాలకూర స్మూతీ చేసుకుని తాగితే మంచిది. స్మూతీగా తాగలేని వారు పాలకూరను వేయించుకుని తిన్నా మంచిదే. 

చియా సీడ్స్
ఇంట్లో చేసుకునే స్మూతీలు, జ్యూస్ లు,లస్సీలు వంటి వాటిల్లో చియా సీడ్స్ వేసుకుని తాగితే మంచిది. వీటిని కలుపుకుని తాగడం వల్ల పోషక విలువలను పెంచుకోవచ్చు. ఈ గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు నిండుగా ఉంటాయి. ఇవి మంటను తగ్గించడంలో, శరీరంలో నీటిని నిలపడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇవి సహాయపడతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పనితీరును పెంచుతాయి. 

పెరుగు
పెరుగుతో స్మూతీలు, షేక్‌లను చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంంది. 30 ఏళ్లు దాటిన తరువాత మహిళల్లో రోగనిరోధక శక్తి, ఎముకల సాంద్రతను పెంచడం అవసరం. పాల కన్నా పెరుగుతో చేసిన పానీయాలు తాగడం మంచిది. ఇవి పొట్ట ఆరోగ్యాన్ని కాపాడడంలో పెరుగు ముందుంటుంది. ప్రొబయోటిక్ బ్యాక్టిరియాలో పెరుగు నిండి ఉంటుంది. ఇదే మంచి బ్యాక్టిరియా. అన్నట్టు ఇందులో ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా అధికం. కాల్షియం పుష్కలంగా ఉంటుంది.  

Also read: ఈ బొమ్మలో ఒక జంతువు దాక్కొని ఉంది, 30 సెకన్లలో దాన్ని కనిపెడితే మీ కంటి చూపు భేష్

Also read: రాకాసి మిరపకాయ, ప్రపంచంలోనే అత్యంత స్పైసీ మిర్చి, అస్సామీల పళ్లెంలో ఇది ఉండాల్సిందే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - నలుగురు మృతి
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
The Raja Saab Exclusive Update : ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారుVenkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - నలుగురు మృతి
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
The Raja Saab Exclusive Update : ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
Sajjala Bhargav Reddy Latest News: సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
5G Smartphones Under 20000: రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
Tiger Attacks in Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
Farmers Protest: ఈ 6 నుంచి రైతుల ‘ఢిల్లీ ఛలో’ పాదయాత్రతో అలర్ట్, భారీగా పోలీసుల మోహరింపు
ఈ 6 నుంచి రైతుల ‘ఢిల్లీ ఛలో’ పాదయాత్రతో అలర్ట్, భారీగా పోలీసుల మోహరింపు
Embed widget