Optical Illusion: ఈ బొమ్మలో ఒక జంతువు దాక్కొని ఉంది, 30 సెకన్లలో దాన్ని కనిపెడితే మీ కంటి చూపు భేష్
చక్కని టైమ్‌పాస్‌నిచ్చే ఆప్టికల్ ఇల్యూషన్ తో వచ్చేశాం. కచ్చితంగా ఇది మిమ్మల్ని కాసేపు ఎంగేజ్ చేస్తుంది.
కళ్లను మాయ చేసే ఆప్టికల్ ఇల్యూషన్ ఇది. ప్రశ్న, జవాబు రెండూ తనలోనే దాచుకోవడం ఈ బొమ్మల స్పెషాలిటి. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనిపించి మెదడును కాసేపు గజిబిజి చేసేస్తుంది. కానీ కచ్చితంగా మెదడుకు మేత అని మాత్రం అని చెప్పుకోవాలి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఆప్టికల్ ఇల్యూషన్ మీ కంటిచూపుకు పరీక్ష. ఒక వ్యక్తి ముఖం మీకు కనిపిస్తోంది కదా. ఆ వ్యక్తి ముఖంలోనే ఒక జంతువు దాగి ఉంది. పరీక్షగా చూస్తే మీకు అది కనిపిస్తుంది. కాస్త తెలివిగా ఆలోచించినా కూడా ఇట్టే దొరికేస్తుంది. పరీక్షగా చూసి, తెలివిగా ఆలోచిస్తే పావు సెకనులోనే పట్టేస్తారు మీరు దాన్ని. ఓ అరగంట కష్టపడ్డాక ఎవరైనా ఆ జీవిని కనిపెడతారు. కానీ మీరు మాత్రం అర నిమిషంలోనే కనిపెట్టాలి. అప్పుడే మీ కంటి చూపు, మెదడు సమన్వయంతో పనిచేస్తున్నాయని అర్థం. కేవలం ఒక్కశాతం మంది మాత్రమే దీని జవాబును అరనిమిషంలో కనిపెట్టగలిగారు. మీరు ఆ ఒక్క శాతం మందిలో ఉన్నారో లేదో తెలుసుకోండి.
జవాబు...
జవాబును కనిపెట్టేసిన వారికి కంగ్రాట్స్. కాసేపు మల్లగుల్లాలు పడినా కూడా ఇంకా ఆ జంతువును కనిపెట్టని వారి కోసం ఈ జవాడు. ఆ మనిషి ముఖంలో దాక్కున్న జీవి శునకం. ఆ మనిషి ముఖాన్ని తిప్పి చూస్తే కూర్చున్న శునకం, నోట్లో ఎముక ముక్కతో కనిపిస్తుంది.
ఆప్టికల్ ఇల్యూషన్లు ఈనాటివి కావు. వీటికి వేల ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు. టీవీలు వంటి వినోదాలు లేని కాలంలో ఇవే అప్పటి ప్రజలకు అలరించాయిట. అయితే వీటి సృష్టి కర్త ఎవరో మాత్రం ఇంతవరకు తెలియలేదు . చరిత్రకారులు తెలుసుకునే ప్రయత్నం చేసినా జవాబు దొరకలేదు. మెదడు చురుగ్గా పనిచేయడానికి ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు మేలు చేస్తాయి. ఇలాంటివి మెదడుకు , కంటికి సమన్వయాన్ని పెంచుతాయి. అలాగే ఏకాగ్రతను పెంచుతుంది. అందుకే ఆప్టికల్ ఇల్యూషన్లు చాలా ప్రజాదరణ పొందుతున్నాయి. ఇప్పుడు ఆప్టికల్ ఇల్యూషన్లు క్రియేట్ చిత్రకారుల సంఖ్య పెరిగిపోయారు. విదేశాల్లో చాలా మంది చిత్రకారులు ఇప్పుడు ఆప్టికల్ ఇల్యూషన్లు వేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఇల్యూషన్లు వైరల్ గా మారాయి.
Also read: రాకాసి మిరపకాయ, ప్రపంచంలోనే అత్యంత స్పైసీ మిర్చి, అస్సామీల పళ్లెంలో ఇది ఉండాల్సిందే
Also read: నోట్లో వేస్తే కరిగిపోయేలా బెల్లంతో సొరకాయ హల్వా
Also read: బంగాళాదుంపలు కేవలం కూరకే కాదు, పాత్రల తుప్పును పోగొట్టి, ఆ మరకల్ని మాయం చేస్తాయి