అన్వేషించండి

Castor Oil on the Belly Button : బొడ్డుపై ఆముదం మసాజ్.. వైరల్ ట్రెండ్ వల్ల నిజంగా లాభాలున్నాయా? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే

Castor Oil Belly Patch : ఈ రోజుల్లో ట్రెండ్ అవుతున్న ఆరోగ్య చిట్కాలలో నాభిపై ఆముదం రాయడం ఒకటిగా చెప్పవచ్చు. ఇలా పొట్టకు ఆముదం రాయడం వల్ల కలిగే లాభాలు ఏంటో.. నష్టాలో ఉన్నాయో లేదో తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బొడ్డులో ఆముదం పూయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని ట్రెండ్ అవుతోంది.
  • కొంతమంది జీర్ణక్రియ, నొప్పి నివారణకు దీనిని ఉపయోగిస్తున్నారు.
  • శాస్త్రీయ ఆధారాలు లేవని, చర్మపు చికాకు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
  • తీవ్రమైన సమస్యలకు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Belly Button Oiling Trend : ఈరోజుల్లో హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం ఎంత ముఖ్యమో.. అంతే కష్టంగా కూడా మారింది. ఉదయాన్నే నిద్రలేవడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం వంటివి కేవలం ప్రణాళికలుగానే మిగిలిపోతున్నాయి. ఫలితంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆరోగ్య చిట్కాలకు ఎక్కువమంది ఆకర్షితులవుతున్నారు. అలా ఎక్కువమందిని అట్రాక్ట్ చేస్తోన్న ట్రెండ్‌లలో ఆముదం బెల్లీ ప్యాచ్ ఒకటి. 

ఆముదాన్ని బొడ్డులో వేసి కాసేపు మసాజ్ చేస్తే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, వాపును తగ్గిస్తుందని, శరీరాన్ని డీటాక్స్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ఎంతవరకు ప్రభావవంతమైనదో.. ఆముదం అప్లై చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటో.. ఎలా అప్లై చేయాలో.. నష్టాలు ఉన్నాయో లేదో.. నిపుణులు ఇస్తోన్న సలహాలు ఏంటో చూసేద్దాం. 

ఎలా అప్లై చేయాలంటే..

ఆముదం నూనెను దూది ఉండకు లేదా గుడ్డకు పూసి బొడ్డు ప్రాంతంలో ఉంచాలి. తర్వాత దానిని టేప్ లేదా గుడ్డతో సెట్ చేసుకుని.. కొన్ని గంటలు లేదా రాత్రంతా అలాగే వదిలేస్తారు. చాలామంది దీనిని వారానికి 4 నుంచి 7 సార్లు ఉపయోగించమని సిఫార్సు చేస్తారు. లేదా నిద్రపోయే ముందు రెండు, మూడు చుక్కలు ఆముదం బొడ్డులో నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇది మరో టెక్నిక్.

ఆముదం అప్లై చేయడం వల్ల కలిగే లాభాలు..

ఆయుర్వేదం ప్రకారం.. పొత్తికడుపు చుట్టూ ఉన్న ప్రాంతం జీర్ణాశయ శక్తితో ముడిపడి ఉంటుంది. జీర్ణశక్తిని, రోగనిరోధక శక్తిని కాపాడుకోవడానికి ఈ ప్రాంతం చాలా కీలకమైనదిగా పరిగణిస్తారు. ఈ పద్ధతి వల్ల కొంతమందిలో జీర్ణక్రియలో స్వల్ప మెరుగుదల, మలబద్ధకం నుంచి ఉపశమనం, కడుపు ఉబ్బరం తగ్గడం, పీరియడ్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెప్తున్నారు. అయితే దీనిని ఒక సహాయక చర్యగా మాత్రమే పరిగణిస్తారు.

శాస్త్రీయ ఆధారాలు

వైద్య నిపుణులు ఏమంటున్నారంటే.. ఈ ధోరణి అన్ని ఫలితాలు ఇస్తుందని నమ్మట్లేదు. బయటి నూనెలు శరీరంలోకి లోతుగా చొచ్చుకుపోకుండా నిరోధించే విధంగా మన చర్మ నిర్మాణం ఉందని నమ్ముతారు. అందువల్ల కడుపునకు ఆముదం నూనెను పూయడం వల్ల జీర్ణవ్యవస్థపై గానీ, హార్మోన్లపై గానీ ఏదైనా ప్రభావం ఉంటుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. దానివల్ల కలిగే ఏ కొద్దిపాటి ఉపశమనమైనా.. ఆ వెచ్చదనం లేదా సున్నితమైన మసాజ్ వల్ల జరిగేవే అంటున్నారు. 

సైడ్ ఎఫెక్ట్స్.. 

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దీనిని పరిమిత సమయం వరకు ఉపయోగించడం సురక్షితమే. కానీ ఎక్కువ సేపు లేదా రాత్రంతా పూయడం వల్ల చర్మపు చికాకు, రంధ్రాలు మూసుకుపోవడం లేదా మొటిమలు వంటి సమస్యలు రావచ్చు. సున్నితమైన చర్మం, అలర్జీలు లేదా చర్మ సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. గర్భిణీ స్త్రీలు కూడా దీనిని ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.

ఆముదంతో చేసే ఈ ప్రక్రియ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయని, ఉబ్బరాన్ని తగ్గిస్తాయని లేదా నిద్రకు సహాయపడతాయని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవని కొందరు వైద్యులు కూడా అంటున్నారు. జీర్ణక్రియ అనేది శరీరంలోని అంతర్గత అవయవాలు, పేగులు, నరాలు, హార్మోన్ల మధ్య జరిగే పరస్పర చర్య ద్వారా జరిగే ప్రక్రియ అని.. చర్మానికి నూనెను పూయడం వల్ల ఈ ప్రక్రియలపై ఎలాంటి ప్రభావం ఉండదని అంటున్నారు.

మీకు తరచుగా కడుపు ఉబ్బరం లేదా జీర్ణ సమస్యలు ఉంటే.. వైద్యుడిని సంప్రదించడం మంచిదని చెప్తున్నారు. అలాగే మీ ఆహారం, తగినంత నీరు తాగడం, శారీరక శ్రమ, ఒత్తిడి స్థాయిలపై శ్రద్ధ పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు

వీడియోలు

Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget