అన్వేషించండి

Assam Congress troubles: అస్సాం కాంగ్రెస్ అస్సాం - సీనియర్ నేతలంతా బీజేపీ గూటికి - రాహుల్, ప్రియాంక చేతులెత్తేశారా?

Assam Congress: బీజేపీతో ముఖాముఖి పోరులో అస్సాంలో కాంగ్రెస్ పార్టీ దయనీయంగా మారుతోంది.కీలక నేతలు వరుసగా పార్టీ మారుతున్నా.. అగ్రనేతలు ఏమీ చేయలేకపోతున్నారు.

Key leaders from Assam Congress are joining BJP: ఎన్నికలు జరుగుతున్న ఐదు  రాష్ట్రాల్లో నేరుగా బీజేపీతో కాంగ్రెస్ ఢీకొడుతున్న రాష్ట్రం అస్సాం.  మిగిలిన రాష్ట్రాల్లో జూనియర్ భాగస్వామి గానో.. ప్రబావం చూపలేని పార్టీగానో ఉంది.  బీజేపీతో ముఖాముఖి పోరులో అస్సాంలో కాంగ్రెస్ పార్టీ దయనీయంగా మారుతోంది. గత కొద్ది రోజుల్లో..  పీసీసీ చీఫ్..సిట్టింగ్ ఎంపీ సహా కీలక నేతలు బీజేపీలో చేరిపోయారు. వారిని ఆపడానికి రాహుల్,ప్రియాంక చేసిన ప్రయత్నాలు కూడా ఫలితం ఇవ్వలేదు.   ఒకప్పుడు అప్రతిహతంగా పాలించిన ఈ రాష్ట్రంలో, నేడు ఆ పార్టీ మనుగడ కోసమే పోరాడాల్సిన దయనీయ స్థితికి చేరుకుంది.  

పీసీసీ చీఫ్ నిష్క్రమణ - గట్టి దెబ్బ 

ఎన్నికలకు కేవలం కొద్ది  రోజుల ముందు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా పార్టీని వీడి బీజేపీలో చేరడం కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ. ఫిబ్రవరి 2026లో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళాన్ని నింపింది. కాంగ్రెస్‌లో ఆత్మగౌరవం ఉన్నవారు ఎవరూ ఉండలేరు  అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలోని అంతర్గత సంక్షోభానికి అద్దం పడుతున్నాయి. భూపేన్ బోరా ఒక్కరే కాదు, సిట్టింగ్ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ వంటి ఉద్దండులు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో అస్సాం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం  రాజీవ్ భవన్  నేడు వెలవెలబోతోంది.

రాహుల్, ప్రియాంకల విఫల యత్నాలు 

పార్టీని కాపాడుకోవడానికి ప్రియాంక గాంధీ వాద్రాను స్వయంగా అస్సాం ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా అధిష్టానం నియమించింది. ఆమె గువహటిలో పర్యటించి, ప్రభుత్వంపై  చార్జిషీట్లు  విడుదల చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను నిలబెట్టలేకపోయారు. అగ్రనేతల బుజ్జగింపులను సైతం లెక్కచేయకుండా కీలక నేతలు వరుస కడుతుండటంతో, గాంధీ కుటుంబం పట్టు కూడా అస్సాంలో పనిచేయడం లేదు అని క్లారిటీవస్తోంది. 

అధికార వ్యతిరేకతను అందుకోలేని స్థితి 

హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ, సహజంగా వచ్చే అధికార వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. అభివృద్ధి పథకాలు, హిమంత బిశ్వ శర్మ  గట్టి పట్టు ముందు కాంగ్రెస్ వ్యూహాలు తేలిపోతున్నాయి. పాత తరం నేతలు వెళ్ళిపోవడంతో, గౌరవ్ గొగోయ్ వంటి యువ నేతలు ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోంది.  
బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన అసోం సన్మిలితో మోర్చా  కూటమి కూడా బీటలు వారుతోంది. సీట్ల సర్దుబాటు విషయంలో ఏకాభిప్రాయం కుదరక రైజోర్ దళ్  వంటి మిత్రపక్షాలు కూటమి నుంచి బయటకు రావడం కాంగ్రెస్‌ను మరింత బలహీనపరిచింది. ఒంటరిగా బీజేపీని ఎదుర్కొనే సత్తా లేక, మిత్రపక్షాలను కలుపుకోలేక కాంగ్రెస్ ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా మారింది.

బిజెపి  ముఖాముఖి  వ్యూహం 

కాంగ్రెస్ బలహీనపడటంతో బీజేపీ తన వ్యూహాన్ని మరింత పదును పెట్టింది. కాంగ్రెస్‌లోని  చివరి హిందూ నేత  కూడా తమ పార్టీలోకి వచ్చేయాలని హిమంత శర్మ బహిరంగంగా సవాల్ విసరడం, కాంగ్రెస్‌ను కేవలం ఒక నిర్దిష్ట వర్గానికి పరిమితమైన పార్టీగా ముద్ర వేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. ముఖాముఖి పోరులో కాంగ్రెస్‌ను మానసికంగా దెబ్బతీసి, ఎన్నికల ముందే విజయాన్ని ఖరారు చేసుకునే దిశగా కమలనాథులు అడుగులు వేస్తున్నారు.  అస్సాంలో కాంగ్రెస్ పరిస్థితిని చూస్తుంటే, ఆ పార్టీ తన పునాదులను పూర్తిగా కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు తరూర్ గొగోయ్ వంటి నేతలు నిర్మించిన కంచుకోట, నేడు సరైన నాయకత్వం లేక పేకమేడలా కూలిపోతోంది. పరిస్థితి మారకపోతే మే 2026 ఫలితాలు   కాంగ్రెస్ ఉనికిని  నామమాత్రం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget