అన్వేషించండి

Tamil Nadu Assembly Elections 2026: దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు తమిళనాడు అసెంబ్లీ పోల్స్ - ఖర్చు వేల కోట్లు ఖాయం!

Tamil Nadu: ఎన్నికలు అంటే డబ్బులు నీళ్లలా ఖర్చు పెట్టే రాష్ట్రం తమిళనాడు. ఈ సారి కూడా అలాగే కనిపిస్తోంది.

Tamil Nadu Costly Assembly Elections : తమిళనాడు రాజకీయాలంటేనే ఒక ఉత్కంఠభరితమైన పోరాటం. వెండితెర గ్లామర్, భావోద్వేగపూరితమైన నినాదాలు ఒకవైపు ఉంటే, కళ్లు చెదిరే స్థాయిలో ఖర్చు చేయడం మరోవైపు ఉంటుంది. ప్రస్తుత తమిళనాడు ఎన్నికల ఖర్చు మునుపెన్నడూ లేని విధంగా స్వతంత్ర భారత చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు గా రికార్డు సృష్టించబోతున్నాయని ఇప్పటికే రాజకీయ పార్టీలు చేస్తున్న ఖర్చు చూస్తే అర్థమైపోతుంది.

ప్రజాస్వామ్యపు ఖరీదైన యుద్ధం

సాధారణంగా తమిళనాడులో డీఎంకే (DMK), అన్నాడీఎంకే (AIADMK) మధ్యే ప్రధాన పోటీ ఉండేది. కానీ ఇప్పుడు దళపతి విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ అనూహ్యంగా తెరపైకి రావడంతో సమీకరణాలు మారిపోయాయి. దీనికి తోడు అన్బుమణి రాందాస్ (PMK) ,సీమాన్ (NTK) వంటి నేతలు కూడా తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ త్రిముఖ, చతుర్ముఖ పోటీ వల్ల ప్రతి ఓటరును ప్రసన్నం చేసుకోవడానికి పార్టీలు కళ్లు చెదిరే బడ్జెట్‌ను సిద్ధం చేసుకున్నాయి. గత ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో ప్రధాన అభ్యర్థులు పెట్టిన ఖర్చు కంటే, ఈసారి అది రెట్టింపు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఓటుకు నోటు - గత రికార్డులు

తమిళనాడులో గతంలో జరిగిన ఆర్‌కే నగర్ ఉప ఎన్నిక , ఈరోడ్ తూర్పు ఉప ఎన్నికల సమయంలో ఒక్కో ఓటుకు వేల రూపాయలు పంపిణీ చేశారనే ఆరోపణలు జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో  ఎన్నికల కమీషన్ సుమారు రూ. 450 కోట్లకు పైగా నగదు, భారీ ఎత్తున బంగారం, మద్యం పట్టుకుంది. ఈసారి పోటీ తీవ్రంగా ఉండటంతో, నిఘా వర్గాల అంచనా ప్రకారం అక్రమంగా ప్రవహించే నగదు ప్రవాహం వేల కోట్లకు చేరవచ్చు. ఒక్కో అభ్యర్థి ఎన్నికల ఖర్చు పరిమితికి లోబడి కాకుండా, అనధికారికంగా కోట్లలో కుమ్మరించడానికి సిద్ధపడుతున్నారు.

ప్రచారంలో డిజిటల్ జోరు 

ఈసారి ఖర్చు కేవలం నగదు పంపిణీకే పరిమితం కాకుండా, డిజిటల్ ప్రచారం వైపు మళ్లింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ ప్రకటనలు, డేటా అనలిటిక్స్ సంస్థల కోసం పార్టీలు వందల కోట్లు కేటాయిస్తున్నాయి. తమిళనాడులో దాదాపు ప్రతి పార్టీకి ఒక ఐటీ వింగ్ ఉండటమే కాకుండా, ముంబై ,  బెంగళూరుకు చెందిన కార్పొరేట్ పీఆర్ సంస్థలను విజయ్ వంటి నేతలు నియమించుకోవడం ఈ ఎన్నికలను మరింత ఖరీదైనవిగా మారుస్తోంది.

ప్రజాస్వామ్యానికి సవాల్ 

డబ్బు ప్రభావం పెరగడం వల్ల సామాన్య ప్రజలు లేదా మధ్యతరగతి మేధావులు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం క్రమంగా కనుమరుగవుతోంది. కేవలం వందల కోట్లు ఖర్చు పెట్టగల సామర్థ్యం ఉన్న వారికే పార్టీలు టిక్కెట్లు కేటాయిస్తుండటంతో, తమిళనాడు రాజకీయాలు ఒక కార్పొరేట్ యుద్ధంగా మారుతున్నాయి. ఈ ధన ప్రవాహాన్ని అడ్డుకోవడం ఎన్నికల కమీషన్‌కు ఈసారి పెను సవాల్‌గా పరిణమించనుంది. ఓటరు తీర్పును డబ్బుతో ప్రభావితం చేయాలనుకునే ఈ ధోరణి భారత ఎన్నికల చరిత్రలో ఒక దురదృష్టకరమైన రికార్డుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.                        

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget