అనేక ప్రముఖ సంస్థలు ఉచిత ఆన్‌లైన్ యోగా కోర్సులను, సర్టిఫికేషన్లను అందిస్తున్నాయి. ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, స్వయం పోర్టల్, యూట్యూబ్ ఛానెల్స్ వంటివి వీటిలో కొన్ని.
Free Yoga Online: ఉచితంగా యోగా.. ఆన్‌లైన్‌లో ఫ్రీ కోర్సులు అందించే టాప్ సంస్థలు ఇవే!
Free Yoga Online: ఇంట్లోంచే ఉచితంగా యోగా నేర్చుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం, ప్రముఖ యోగా సంస్థలు ఉచితంగా యోగా శిక్షణను అందిస్తున్నాయి.

- ప్రముఖ సంస్థలు, యూట్యూబ్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ యోగా నేర్చుకోండి.
- ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, స్వయం ముఖ్యమైన వేదికలు.
- ప్రారంభకులు శరీరానికి తగ్గట్టు జాగ్రత్తలతో యోగా సాధన చేయాలి.
- ఆరోగ్య సమస్యలుంటే, నిపుణుడి సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
Free Yoga Online: ఆన్‌లైన్‌లో ఫ్రీగా యోగా నేర్చుకోవాలనుకునే వారి కోసం ఎన్నో ప్రసిద్ధ సంస్థలు ఉచిత కోర్సులను, సర్టిఫికేషన్లను అందిస్తున్నాయి. ఇంట్లోనే కూర్చుని, మీ వీలును బట్టి యోగా క్లాసులు వింటూ నేర్చుకోవచ్చు.
ఉచిత యోగా కోర్సులను అందించే ప్రముఖ సంస్థలు
ఈషా ఫౌండేషన్ (సద్గురు)
సద్గురు నేతృత్వంలోని ఈషా ఫౌండేషన్ మానసిక ప్రశాంతత, ఆరోగ్యం కోసం శక్తివంతమైన యోగా శిక్షణను ఉచితంగా అందిస్తోంది. 'ఈషా క్రియ', 'ఉప-యోగా' (Upa-Yoga) వంటి సులువైన, శక్తివంతమైన పద్ధతులను నేర్పిస్తారు. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి "Sadhguru App" డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందులో తెలుగుతో పాటు పలు భాషల్లో ఉచిత వీడియోలు ఉంటాయి. లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా యోగా నేర్చుకోవచ్చు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ సంస్థ ప్రాథమిక యోగాసనాలు, ప్రాణాయామంపై ఉచిత యోగా క్లాసులు నిర్వహిస్తుంది. శ్వాస ప్రక్రియలు, ప్రాథమిక మెడిటేషన్, యోగా టిప్స్ నేర్పిస్తారు. వీరి అధికారిక వెబ్‌సైట్ లేదా యూట్యూబ్ ఛానల్‌లో ఉచిత ఇంట్రడక్షన్ సెషన్స్ ఉంటాయి. అలాగే అప్పుడప్పుడు ఆన్‌లైన్‌లో ఫ్రీగా లైవ్ వెబ్‌నార్లు నిర్వహిస్తారు. వాటికి రిజిస్టర్ చేసుకోవచ్చు.
Also Read: జాబ్ రావాలంటే ఇంటర్వ్యూకు వెళ్లే ముందు ఈ తప్పులు చేయకండి.. సక్సెస్ కావచ్చు
స్వయం పోర్టల్
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'స్వయం' పోర్టల్‌లో యోగాపై ఉచిత ఆన్‌లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ భారతీయ యూనివర్సిటీల ప్రొఫెసర్లు సర్టిఫైడ్ యోగా కోర్సులు నేర్పిస్తారు.
swayam.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి 'Yoga' అని సెర్చ్ చేసి ఉచితంగా ఎన్‌రోల్ చేసుకోవచ్చు.
యూట్యూబ్ ఛానల్స్
Yoga With Adriene ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఉచిత యోగా ఛానల్ ఇది. బిగినర్స్ కోసం '30 డేస్ యోగా జర్నీ' వంటి అద్భుతమైన ఫ్రీ సిరీస్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారిక ఛానల్‌లో కామన్ యోగా ప్రోటోకాల్ వీడియోలు తెలుగుతో సహా అన్ని భాషల్లో ఉచితంగా అందిస్తోంది. వీటిల్లో మీకు అనుకూలంగా ఉన్న వాటిల్లో మీ అవసరానికి తగ్గట్టుగా ఒక ప్లాట్‌ఫారమ్‌ను సెలెక్ట్ చేసుకోండి. మీ ఈమెయిల్ ఐడీ లేదా గూగుల్ అకౌంట్‌తో ఉచితంగా సైన్-అప్ అవ్వండి. మీరు మొదటిసారి చేస్తున్నట్లయితే, నేరుగా అడ్వాన్స్‌డ్ కాకుండా 'Yoga for Beginners' లేదా 'Level 1' కోర్సులను మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఆన్‌లైన్ క్లాసులు కాబట్టి మీకు వీలైన టైమ్‌లో యోగా నేర్చుకోవచ్చు. కానీ ఉదయం పూట ఖాళీ కడుపుతో యోగా చేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి.
Also Read: కాళ్లలో తిమ్మిర్లు తరచూ వస్తున్నాయా? డయాబెటిస్, విటమిన్ B12 లోపం సహా ఈ సమస్యలకు సంకేతం కావచ్చు
తగన జాగ్రత్తలు
- యోగా మ్యాట్ - ఇంట్లో జారిపోకుండా ఉండటానికి ఒక మంచి యోగా మ్యాట్ లేదా మందపాటి దుప్పటిని యూజ్ చేయండి.
- లూజ్ దుస్తులు- యోగాసనాలు వేసేటప్పుడు శరీరం ఫ్రీగా కదలడానికి వీలుగా ఉండే లూజ్ లేదా స్ట్రెచబుల్ దుస్తులు ధరించండి.
- శరీరాన్ని మరింత కష్టపెట్టొద్దు - స్క్రీన్‌పై ట్రైనర్ సులువుగా చేస్తున్నారని, మీ శరీరాన్ని ఎక్కువగా వంచడానికి ప్రయత్నించవద్దు. మీ శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకే ప్రాక్టీస్ చేయండి.
- ఆరోగ్య సమస్యలు ఉంటే- ఒకవేళ మీకు తీవ్రమైన వెన్నునొప్పి, మోకాళ్ళ నొప్పులు లేదా గర్భధారణ పరిస్థితులు ఉంటే, ఆన్‌లైన్ క్లాసులు చూసి సొంతంగా యోగా ప్రాక్టీస్ చేయొద్దు. డాక్టర్ లేదా సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ సలహా కచ్చితంగా తీసుకోవాలి.
Also Read: జీవితాన్ని మార్చేసే మార్నింగ్ రొటీన్.. ఉదయాన్నే కేవలం 30 నిమిషాలు కేటాయిస్తే చాలు!
Frequently Asked Questions
ఉచితంగా ఆన్‌లైన్ యోగా నేర్చుకోవడానికి ఏ సంస్థలు అందుబాటులో ఉన్నాయి?
ఆన్‌లైన్ యోగా నేర్చుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
యోగా మ్యాట్, వదులైన దుస్తులు ధరించాలి. శరీరాన్ని ఎక్కువగా కష్టపెట్టకూడదు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలుంటే నిపుణులను సంప్రదించాలి.
భారత ప్రభుత్వం అందించే ఉచిత యోగా కోర్సులు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి?
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'స్వయం' పోర్టల్‌లో ఉచిత ఆన్‌లైన్ యోగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ యూనివర్సిటీల ప్రొఫెసర్లు వీటిని నేర్పిస్తారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















