అన్వేషించండి

Job Interview Tips : జాబ్ రావాలంటే ఇంటర్వ్యూకు వెళ్లే ముందు ఈ తప్పులు చేయకండి.. సక్సెస్ కావచ్చు

Job Interview Preparation : జాబ్ కోసం చూస్తున్నారా? ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏ తప్పులు చేయకూడదు? ఉద్యోగాన్ని అవకాశాన్ని పెంచే టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కంపెనీ గురించి తెలుసుకొని, సమయానికి చేరుకోవడం ముఖ్యం.
  • వృత్తిపరమైన దుస్తులు ధరించి, రెజ్యూమెను క్షుణ్ణంగా చదవండి.
  • ఆత్మవిశ్వాసంతో స్పందించి, ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడగాలి.

Common Interview Mistakes : ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వడం అనేది చాలా మందికి ఒత్తిడితో కూడుకున్న విషయం. మంచి విద్యార్హతలు, స్కిల్స్ ఉన్నప్పటికీ.. కొందరు చిన్న చిన్న తప్పుల కారణంగా ఉద్యోగ అవకాశాన్ని కోల్పోతుంటారు. అయితే ఇంటర్వ్యూకు ముందు చేసే కొన్ని పొరపాట్లు మీపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చని తెలుసా? అందుకే జాబ్ ఇంటర్వ్యూకు వెళ్లే ముందు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

కంపెనీ గురించి తెలుసుకోకపోవడం

చాలామంది అభ్యర్థులు కంపెనీ గురించి కనీస సమాచారం కూడా తెలుసుకోకుండా ఇంటర్వ్యూకు వెళ్తారు. ఇది మీకు పెద్ద నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అవ్వొచ్చు. మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్న కంపెనీ ఏంటి? దాని చరిత్ర, ఏ సేవలు అందిస్తారు, కంపెనీ లక్ష్యాలు ఏంటి వంటి విషయాలపై అవగాహన ఉండాలి. ఇది రిక్రూటర్​కి మీపై మంచి అభిప్రాయాన్ని కలిగిస్తుంది.

ఆలస్యంగా వెళ్లడం

ఇంటర్వ్యూకు ఆలస్యంగా వెళ్లడం మీ క్రమశిక్షణ, సమయపాలనపై చెడు ప్రభావం చూపుతుంది. కనీసం 10-15 నిమిషాల ముందే ఇంటర్వ్యూ జరిగే ప్లేస్​కి వెళ్లడం మంచిది.

డ్రెస్సింగ్ 

మీ దుస్తులు మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. చాలా క్యాజువల్‌గా లేదా ఐరన్ చేయని దుస్తులు ధరించడం ఇంటర్వ్యూయర్‌పై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కాబట్టి నీట్​గా ఐరన్ చేసిన ఫార్మల్ డ్రెస్​లు వేసుకోండి. 

రెజ్యూమే చెక్

మీ రెజ్యూమేలో మీరు ఏ విషయాలు అయితే రాశారో.. వాటి గురించి రిక్రూటర్ క్వశ్చన్ చేయవచ్చు. అందుకే ఇంటర్వ్యూకు ముందు ఒకసారి రెజ్యూమేను పూర్తిగా చేసుకోండి. 

ఫోన్‌ను సైలెంట్‌లో పెట్టకపోవడం

ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో ఫోన్ రింగ్ అవ్వడం లేదా నోటిఫికేషన్లు రావడం ప్రొఫెషనలిజం లోపాన్ని చూపిస్తుంది. కాబట్టి ఇంటర్వ్యూకు ముందు ఫోన్‌ను సైలెంట్ లేదా స్విచ్ ఆఫ్ చేయడం మంచిది.

ప్రాక్టీస్ చేయకపోవడం

ఇంటర్వ్యూలో రెగ్యులర్​గా అడిగే ప్రశ్నలకు ప్రిపేర్ కాకపోవడం. రిక్రూటర్ మీ గురించి చెప్పండి, మీ బలాలు, బలహీనతలు ఏమిటి? వంటివి అడిగే అవకాశం ఉంటుంది. దాదాపు ప్రతి ఇంటర్వ్యూలో వీటిని అడుగుతారు. అందుకే వీటికి ముందుగానే సమాధానాలు సిద్ధం చేసుకోవాలి. 

నెగెటివ్‌ టాక్

ఇంటర్వ్యూలో మునుపటి కంపెనీ, బాస్ లేదా సహోద్యోగుల గురించి చెడుగా మాట్లాడటం వంటివి మీ వ్యక్తిత్వంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఎప్పుడూ పాజిటివ్​గా మాట్లాడాలి.

నిద్రపోండి..

ఇంటర్వ్యూకు ముందు రాత్రి టెన్షన్​తో సరిగ్గా నిద్రపోరు. కానీ సరైన నిద్ర లేకపోతే అలసట, ఏకాగ్రత లోపం కనిపించవచ్చు. కనీసం 7-8 గంటల నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. 

కాన్ఫిడెన్స్

ఇంటర్వ్యూ సమయంలో అతిగా భయపడటం లేదా మీ సామర్థ్యాన్ని తక్కువగా చూపించుకోవడం మంచిది కాదు. కాన్ఫిడెంట్​గా, స్పష్టంగా సమాధానాలు ఇవ్వడం ముఖ్యం.

క్వశ్చన్ చేయండి..

ఇంటర్వ్యూ చివర్లో చాలామంది మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అని అడిగితే చాలా మంది లేవు అని చెప్తారు. కానీ ఉద్యోగ బాధ్యతలు, టీమ్, సంస్థ గురించిన ప్రశ్నలు అడగడం వల్ల జాబ్​ పట్ల మీ ఆసక్తిని తెలియజేస్తుంది.

కెరీర్ నిపుణుల ప్రకారం.. ఇంటర్వ్యూలో విజయం సాధించడంలో సాంకేతిక నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్, ప్రిపరేషన్, సమయపాలన కీ-రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి ఇంటర్వ్యూకు ముందు సరైన ప్రణాళికతో సిద్ధమైతే విజయావకాశాలు గణనీయంగా పెరుగుతాయి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget