అన్వేషించండి

English Speaking Skills : ఇంగ్లీష్ అర్థమవుతున్నా మాట్లాడలేకపోతున్నారా? రోజూ ఈ అలవాట్లు ఫాలో అయితే ఫ్లూయెంట్‌గా మాట్లాడొచ్చు!

Tips To Speak English More Confidently : చాలామందికి ఇంగ్లీష్ అర్థమవుతుంది కానీ.. మాట్లాడేందుకు భయపడతూ ఉంటారు. మీరు కూడా అలాంటి వారిలో ఒకరు అయితే.. ఈ చిట్కాలు ఫాలో అవుతూ స్కిల్స్ పెంచుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రోజువారీ ఇంగ్లీష్ మాట్లాడటం, వినడం నైపుణ్యాన్ని పెంచుతుంది.
  • కొత్త పదాలు నేర్చుకుంటూ, ఇంగ్లీష్‌లో చదవడం ముఖ్యం.
  • అద్దం ముందు, ఇంగ్లీష్‌లో ఆలోచించడం ఆత్మవిశ్వాసం పెంచుతుంది.

Tips To Improve Your English Communication Skills : ఈ రోజుల్లో ఇంగ్లీష్ మాట్లాడటం ఒక స్కిల్ మాత్రమే కాదు. చదువు, ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత అభివృద్ధి వంటి అనేక రంగాల్లో అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్‌గా మారింది. అయితే చాలామంది ఇంగ్లీష్ అర్థం చేసుకోగలిగినా.. మాట్లాడే సమయంలో మాత్రం తప్పుగా మాట్లాడతామేమోనని సంకోచిస్తుంటారు. మీరు కూడా అలాంటి వారిలో ఒకరు అయితే ప్రతిరోజూ కొన్ని చిన్న అలవాట్లు ఫాలో అవ్వండి. వాటిని పాటిస్తే మీరు కూడా ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యాన్ని మెరుగుపరచుకోగలుగుతారు. 

15–20 నిమిషాలు ఇంగ్లీష్‌లో మాట్లాడండి

ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం పెరగాలంటే దానికి తగ్గట్లు ప్రాక్టీస్ చాలా ముఖ్యం. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మీ రోజువారీ పనుల గురించి ఇంగ్లీష్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించండి. ఇది మీలో ఇతరులతో మాట్లాడే ధైర్యాన్ని పెంచుతుంది.

ఇంగ్లీష్ వార్తలు, పోడ్‌కాస్ట్‌లు వినండి

ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్స్, పోడ్‌కాస్ట్‌లు లేదా ఆడియోబుక్స్ వినడం ద్వారా పదాలు సరైన విధంగా ఎలా పలకాలో.. వాక్య నిర్మాణం ఎలా చేయాలో తెలుసుకోవచ్చు. అలాగే కొత్త పదాలను నేర్చుకోవచ్చు. వినడం ద్వారా భాషపై అవగాహన కూడా పెరుగుతుంది.

కొత్త పదాలు నేర్చుకోండి..

ప్రతిరోజూ కనీసం 5 కొత్త ఇంగ్లీష్ పదాలను నేర్చుకోండి. వాటితో ఏదైనా వ్యాక్యాన్ని తయారు చేయండి. పదాల అర్థం తెలుసుకోవడం మాత్రమే కాకుండా వాటిని ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకోవడం ముఖ్యం. 

ఇంగ్లీష్‌లో చదివండి

ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుంటే.. ఇంగ్లీష్‌లో పేపర్స్, బ్లాగులు, కథలు లేదా చిన్న వ్యాసాలను చదవడం నేర్చుకోండి. దీనివల్ల పదజాలం పెరుగుతుంది. అలాగే వాక్యాలను ఎలా నిర్మించాలో కూడా అర్థమవుతుంది.

అద్దం ముందు ప్రాక్టీస్

మీరు మిర్రర్ ముందు నిలబడి.. మీ గురించి లేదా ఏదైనా అంశంపై ఇంగ్లీష్‌లో మాట్లాడండి. ఇలా చేయడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా మీ తప్పులను సులభంగా గుర్తించగలుగుతారు. 

ఇంగ్లీష్‌లో ఆలోచించండి..

చాలామంది ఏదైనా విషయం గురించి ముందుగా తెలుగులో ఆలోచించి.. తర్వాత ఇంగ్లీష్‌లోకి అనువదిస్తారు. దీనివల్ల మాట్లాడే వేగం తగ్గుతుంది. కాబట్టి చిన్న చిన్న విషయాలను కూడా నేరుగా ఇంగ్లీష్‌లో ఆలోచించే ప్రయత్నం చేయండి. దీంతో ఇంగ్లీష్‌లో కమ్యూనికేట్ చేయగలిగే సామర్థ్యం మెరుగవుతుంది.

ఇంగ్లీష్ సినిమాలు, సిరీస్‌లు

ఇంగ్లీష్ మూవీస్ లేదా వెబ్ సిరీస్‌లను సబ్‌టైటిల్స్‌తో చూడడం ద్వారా సంభాషణలు సహజంగా ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. దీనివల్ల లిజనింగ్, స్పీకింగ్ స్కిల్స్ రెండూ మెరుగవుతాయి. 

రికార్డ్ చేసుకోండి

మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడుకుంటున్నప్పుడు.. మీ వాయిస్‌ను రికార్డ్ చేసి వినండి. మీరు పదాలను ఎలా పలుకుతున్నారు.. గ్రామర్ లేదా ఫ్లూయెన్సీలో ఉన్న లోపాలను గుర్తించండి. వాటిని కరెక్ట్ చేసుకునేందుకు ట్రై చేయండి. 

తప్పులు చేస్తే భయపడకండి

ఇంగ్లీష్ అనే కాదు.. ఏ భాష అయినా నేర్చుకునే ప్రక్రియలో తప్పులు చేయడం సహజం. అలా అని తప్పులు మాట్లాడతామని.. భయంతో మొత్తానికి మాట్లాడకుండా ఆగిపోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ముందుగానే మాట్లాడటం నేర్చుకోండి.

ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం ఒక్కరోజులో రాదని గుర్తించుకోవాలి. ప్రతిరోజూ కొద్దిసేపు అయినా ప్రాక్టీస్ చేస్తే క్రమంగా ఫ్లూయెన్సీ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్‌ను మెరుగుపరచడానికి ప్రత్యేక కోర్సులు లేదా ఖరీదైన శిక్షణ అవసరం లేదు. రోజువారీ జీవితంలో ఈ చిన్న చిన్న అలవాట్లను అలవరచుకుని.. వాటిని కంటిన్యూ చేస్తే.. ఇంగ్లీష్‌ను ధైర్యంగా, సులభంగా మాట్లాడగలుగుతారు. 

మరిన్ని లైఫ్​స్టైల్​, హెల్త్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. 

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
Monsoon 2026: వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Lenin Collection Day 1: లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Embed widget