అన్వేషించండి

Job Resignation Reasons : జాబ్ మానేయాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందా? ఉద్యోగుల రాజీనామాల వెనుక అసలు కారణాలు ఇవే

Reasons For Employee Burnout : ఇటీవలి కాలంలో LinkedIn, ఉద్యోగ ఫోరమ్‌లు, కెరీర్ కమ్యూనిటీలలో ఎక్కువగా  కనిపిస్తోన్న, వినిపిస్తోన్న విషయం.. జాబ్ మానేయడం. అసలు దీనికి కారణాలు ఏంటి? 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వృత్తిలో ఎదుగుదల, గుర్తింపు లేకపోవడం ఉద్యోగుల అసంతృప్తికి కారణం.
  • పని ఒత్తిడి, ఆఫీస్ రాజకీయాలు, వ్యక్తిగత సమయం కొరవడటం.
  • మానసిక ఆరోగ్యం, మెరుగైన అవకాశాల కోసం ఉద్యోగాలు వదిలేస్తున్నారు.

Quitting Jobs in 2026 : ఈ మధ్యకాలంలో బాజ్ మానేయాలనుకునేవారి సంఖ్య పెరుగుతుంది. దానికి సంబంధించి సోషల్ మీడియాల్లో.. జాబ్ పోర్టల్స్​లో పలు పోస్ట్​లు చేస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. జాబ్ స్ట్రెస్, ఉద్యోగం మానేయాలనుకుంటున్నాను..బర్నౌట్ అయిపోయాను.. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ లేదు వంటి పోస్టులు ఎక్కువైపోయాయి. అంతేకాకుండా తాము ఎదుర్కొంటున్న సమస్యలు బహిరంగంగా చెప్తున్నారు. ఇంతకీ జాబ్ మానేయాలని అనిపించడానికి ఏవి కారణాలు అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఏళ్లుగా పని చేస్తున్నా.. గ్రోత్ లేకపోవడం

Why Employees Quit Without a New Job Offer

మూడేళ్లుగా అదే పని చేస్తున్నాను.. కెరీర్ పరంగా ఎలాంటి గ్రోత్ ఉండకపోవడం. కెరీర్ గ్రోత్, ప్రమోషన్లు, కొత్త నైపుణ్యాల అభివృద్ధి అవకాశాలు లేకపోతే ఉద్యోగంపై ఆసక్తి తగ్గుతుంది. 

గుర్తింపు లేకపోవడం.. శ్రమ దోపిడి

ఎంత కష్టపడినా అప్రిసియేషన్ ఉండకపోవడం. పని చేసినందుకు తగినంత గుర్తింపు లేదా ప్రశంసలు లేకపోవడం కూడా ఉద్యోగుల్లో నిరుత్సాహాన్ని మరింత పెంచుతుంది. దీంతో చాలామంది ఉద్యోగం మానేయాలనుకుంటున్నారట. 

పెరుగుతోన్న ఆఫీస్ పాలిటిక్స్

Red Flags: Why Employees Quit Without a New Job Lined Up

పని కంటే ఆఫీస్ రాజకీయాలే ఎక్కువ ఇబ్బంది పెట్టడం. మేనేజ్‌మెంట్ సమస్యలు, సహోద్యోగులతో విభేదాలు, ప్రతికూల వాతావరణం కూడా ఉద్యోగులను జాబ్​కి దూరం చేస్తున్నాయి. 

జీతం విషయంలో రెండు రకాల కారణాలు.. 

పనిభారం పెరుగుతోంది.. కానీ జీతం మాత్రం అదే ఉంది అనుకునేవారు ఉన్నారు. ద్రవ్యోల్బణం, జీవన వ్యయాలు పెరుగుతున్న సమయంలో సరైన వేతనం లేకపోవడం కూడా కీలక కారణం.

అలాగే శాలరీ బాగానే ఉంది.. కానీ ఎమోషనల్​గా పూర్తిగా అలసిపోయాను అనే భావన పెరిగిపోవడం కూడా మరో కారణంగా చెప్పవచ్చు. పని గంటలు పెరగడం, నిరంతర ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం వల్ల చాలామంది బర్నౌట్‌కు గురవుతున్నారు.

పర్సనల్ టైమ్ తగ్గిపోవడం

ఆఫీస్ పని ఇంటికీ వస్తోంది.. దీంతో వ్యక్తిగత జీవితానికి సమయం దొరకడం లేదని వాపోయే వారి సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగం, కుటుంబం, వ్యక్తిగత సమయం మధ్య సమతుల్యత లేకపోవడం కూడా రాజీనామా ఆలోచనలకు కారణమవుతోంది.

మానసిక ఆరోగ్యం.. 

Employees Mental Health Burnout

కెరీర్ ముఖ్యం.. కానీ నా ఆరోగ్యం అంతకంటే ముఖ్యమనే ఆలోచన చాలామందిలో పెరుగుతుంది. ముఖ్యంగా కొత్త తరం ఉద్యోగులు జీతం కంటే తమ మానసిక ప్రశాంతత, ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

మంచి అవకాశాల కోసం 

ఉద్యోగం మానేయడం కాదు.. నా విలువకు తగ్గ అవకాశం వెతుక్కోవాలనే కోరిక పెరగడం. హైబ్రిడ్ వర్క్, రిమోట్ జాబ్స్, మెరుగైన కెరీర్ అవకాశాల కోసం చాలామంది కొత్త ఉద్యోగాల వైపు చూస్తున్నారు. 

ఒకప్పటిలా ఉద్యోగం మానేయాలనే ఆలోచన జీతం వల్లే మాత్రమే ఉండట్లేదు. పని ఒత్తిడి, గుర్తింపు లేకపోవడం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ లోపించడం, మానసిక ఆరోగ్యం వంటి అంశాలు కూడా ఇప్పుడు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం చాలామంది ఎక్కువ సంపాదించడం కంటే మంచి, ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు. అందుకే జాబ్ మానేయాలనుకునేవారి సంఖ్య పెరుగుతుందని చెప్పవచ్చు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget