అన్వేషించండి

డిజిటల్ యుగం.. ప్రమాదంలో పిల్లల ‘నిద్ర’ - ఈ పాపం పెద్దవాళ్లదే!

డిజిటల్ టెక్నాలజీ పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపుతోంది? ముఖ్యంగా నిద్ర నాణ్యత, నిద్రించే వ్యవధి తగ్గుతోందా? దీని నుంచి పిల్లలను ఎలా కాపాడుకోవాలి? పెద్దగా ఎవరూ ఆలోచించని ఈ విషయాలు ముఖ్యమైనవి

మొబైల్.. టీవీలు.. లేని రోజుల్లో పిల్లలు బయటకు వెళ్లి ఆటలాడుకొనేవారు. బాగా అలసిపోయి వెంటనే నిద్రపోయేవారు. కానీ, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. టీవీలు, మొబైల్ ఫోన్స్ చూసే పిల్లల సంఖ్య పెరిగింది. దాని ప్రభావం ఇప్పుడు వారి నిద్రపై కూడా పడుతోంది.

బాల్యంలో నిద్ర చాలా ప్రధానమైన విషయం. ఇది పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు చాలా అవసరం. శారీరక ఎదుగుదల కోసం మాత్రమే కాదు, మెదడు వృద్ధి చెందేందుకు, సామాజిక నైపుణ్యాల కోసం కూడా నిద్ర చాలా కీలకమైన విషయం. పగటి పూట గమనించిన, అనుభవంలోకి వచ్చిన విషయాలను పిల్లలు రాత్రి నిద్రలోనే నేర్చుకుంటారు.

ఈరోజుల్లో దాదాపు అందరు పిల్లలు చాలా చిన్న వయసు నుంచే గాడ్జెట్స్ వాడుతున్నారు. ఇది పిల్లల బాల్యం మీద తీవ్రమైన ప్రభావమే చూపుతున్నాయి. పిల్లల ఎదుగుదల మీద గాడ్జెట్స్ వినియోగం అన్నిరకాలుగాను ప్రభావితం చేస్తున్నట్టు కొత్త అధ్యయనాలు రుజువులు సైతం చూపుతున్నాయి.

తల్లిదండ్రులు కూడా పిల్లలు వీలైనంత ఎక్కువ నేర్చుకోవాలని, అది కూడా వీలైనంత త్వరగా నేర్చుకోవాలని ఆశపడుతున్నారు. ఆ నేర్చుకోవడం కూడా లేటెస్ట్ టెక్నాలజీ వినియోగించే తెలివి తేటలు కలిగి ఉండేలా ఉండాలని అనుకుంటున్నారు. ఎప్పుడూ ప్రపంచంతో కనెక్టెడ్ గా ఉండాలని కూడా అనుకుంటున్నారు.

మరోవైపు ఈ ప్రహసనంలో పిల్లల స్క్రీన్ టైమ్ పెరిగి పోతోంది. పిల్లల శారీరక శ్రమ తగ్గిపోతోంది. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపుతోంది.   

నిద్ర చాలని పిల్లల్లో ఏకాగ్రత తగ్గిపోతుంది. ఈ సమస్య దీర్ఘకాలంలో ఆరోగ్యం మీద మాత్రమే కాదు అది వారి సామాజిక సంబంధాల విషయంలోనూ సమస్యగా పరిణమించవచ్చు.

సాంకేతిక పరిజ్ఞానం ప్రభావం పిల్లల మీద ఎలా ఉంటోంది?

సాంకేతిక మూడు రకాలుగా పిల్లలపై ప్రభావం చూపుతోంది. మొదటిది.. పిల్లలు సాయంత్రం తర్వాత కూడా ప్రకాశవంతమైన కాంతికి ప్రభావితం అవుతున్నారు. దాదాపు అన్ని రకాల స్క్రీన్ల నుంచి కూడా కాంతి వెలువడుతుంది. మొబైల్స్ కంటికి చాలా దగ్గరగా ఉంటాయి. శరీరంలో సిర్కాడియన్ రిథమ్ కాంతి మీద ఆధారపడి ఉంటాయి. రాత్రి పూట చిన్న కాంతికి ఎక్స్పోజ్ అయినా సరే సిర్కాడియన్ రిథమ్ ప్రభావితం అవుతుంది. గాడ్జెట్స్ నుంచి వెలువడే కాంతి చాలా వరకు నీలిరంగు కాంతి (బ్లూ లైట్). ఇది నిద్రను చాలా ప్రభావితం చేస్తుంది.

రెండవ సిద్ధాంతం సమయపాలన తప్పడం. రాత్రిపూట గాడ్జెట్స్ వినియోగం పెరిగితే ఒక రాత్రి భోజనం, స్నానం, చదివే సమయం లేదా సాధారణ నిద్ర వేళలు అన్ని కూడా సమయం తప్పే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల నిద్ర పొయ్యే సమయం తగ్గిపోతుంది.

అదీ కాకుండా డిజిటల్ కంటెంట్ భావోద్వేగాలను ప్రభావితం చెయ్యవచ్చు. అందువల్ల భావోద్వేగాలు చాలా డిస్టర్బ్ అవుతాయి. నిద్ర సమయానికి ఇలా జరిగితే నిద్ర పోయే సమయం వాయిదా పడే ప్రమాదం పెరుగుతుంది.

ఇంట్లో టెక్నాలజీ పాత్ర

టెక్నాలజీ మన ఇళ్లలోకి చేరి చాలా రోజులైంది, రోజురోజుకి టెక్నాలజీ పాత్ర ఇంట్లో పెరుగుతోంది. ఇంట్లో వెలిగే లైట్ నుంచి నేడు ప్రతి చేతిలో మోగే పాడ్కాస్ట్ ల వరకు అంతా టెక్నాలజీ యే కదా. లైట్ ఒక విప్లవాత్మక మార్పుగా మారి రాత్రి పూట కార్యకలాపాలు నిరాటాకంగా సాగడం మొదలైంది. ఇప్పుడు పగటికి, రాత్రికి తేడా లేకుండా పనులు చేస్తున్నారు.

ఈ రోజుల్లో పిల్లలకు కూడా రాత్రి పూట నిద్ర తగ్గుతోందట. పుట్టినప్పటి నుంచి టీనేజి దాటే వరకు పిల్లల ఎదుగుదల మీద మారిన ఈ నిద్ర ఆందోళనకరమైన మార్పులు కనిపిస్తున్నాయట.

పెద్దవారి కంటే పిల్లలకు నిద్ర చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. పిల్లలు సరైన సమయం తగినంత నిద్ర పోవడం చాలా అవసరం. ఇంటి వాతావరణం అందుకు అనుగుణంగా లేకపోతే పిల్లల తగినంత నిద్ర ఉండకపోవచ్చు. కొంచెం ఎదిగిన పిల్లల నుంచి యువత వరకు వారివారి వ్యక్తిత్వ ప్రాధాన్యతలను బట్టి కూడానిద్ర ఆధారపడి ఉంటుంది. వాతావరణ మార్పుల నుంచి సామాజిక అంశాలు, పాండమిక్ పరిస్థితుల వరకు అన్నీ పిల్లల జీవితం మీద ప్రభావం చూపుతున్నాయి.

టెక్నాలజీ పిల్లలకు అందుబాటులో ఉండడం మంచిదా కాదా అనేది ఆ పిల్లల మానసిక స్థితిగతులు, వ్యక్తిత్వాల మీద ఆధారపడి ఉంటుంది. ముందుగా పోషకాహారం, తగినంత శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన సామాజిక సంబంధాలు ఉంటే  ఆతర్వాత రిలాక్సేషన్, లెర్నింగ్, కనెక్టివిటిలో టెక్నాలజి పాత్రను గురించి ఆలోచించవచ్చనేది నిపుణుల ఉద్దేశం.

Also Read : Immunity Drinks: వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటూ బరువు తగ్గాలా? ఈ వెచ్చని పానీయాలను సిప్ చేస్తే చాలు!
డిజిటల్ యుగం.. ప్రమాదంలో పిల్లల ‘నిద్ర’ - ఈ పాపం పెద్దవాళ్లదే!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget