అన్వేషించండి

Thyroid–Blood Pressure: థైరాయిడ్​తో పాటు హై బీపీ కూడా ఉందా? ఈ జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాన్ని తగ్గించొచ్చు అంటోన్న వైద్యులు

Thyroid and Hypertension : మీకు థైరాయిడ్​తో పాటు బీపీ కూడా ఉంటే కొన్ని అలవాట్లు వెంటనే మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అసలు వీటి మధ్య కనెక్షన్ ఏంటో.. వైద్యుల సూచనలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • థైరాయిడ్ సమస్యలు అధిక రక్తపోటుకు దారితీసే అవకాశం.
  • హైపర్/హైపో థైరాయిడిజం గుండె పనితీరుపై ప్రభావం చూపుతుంది.
  • థైరాయిడ్ చికిత్సతోపాటు జీవనశైలి మార్పులు బీపీ నియంత్రణకు ముఖ్యం.
  • ప్రారంభ చికిత్స గుండె, ఇతర దీర్ఘకాలిక సమస్యల ప్రమాదం తగ్గిస్తుంది.

Managing High Blood Pressure in Thyroid Patients : థైరాయిడ్ సమస్యలు, అధిక రక్తపోటు (హై బీపీ) రెండూ వేర్వేరు వ్యాధులుగా కనిపించినప్పటికీ.. వీటి మధ్య చాలా దగ్గరి సంబంధం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోతే.. గుండె, రక్తనాళాల పనితీరుపై ప్రభావం పడుతుంది. ఫలితంగా రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే థైరాయిడ్‌ను నియంత్రణలో ఉంచడం కూడా హై బీపీ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు.

థైరాయిడ్, బీపీ కనెక్షన్

హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్​గా చేస్తోన్న డాక్టర్ దిలీప్ గూడె ప్రకారం.. థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అయ్యే హైపర్ థైరాయిడిజం ఉన్నవారిలో గుండె వేగంగా కొట్టుకోవడంతో పాటు ఎక్కువ రక్తాన్ని పంప్ చేస్తుంది. దీంతో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ పెరగవచ్చు. మరోవైపు హైపో థైరాయిడిజం ఉన్నవారిలో రక్తనాళాలు గట్టిపడి, వాటి సౌలభ్యం తగ్గిపోవడం వల్ల కూడా రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. చాలా మందిలో థైరాయిడ్ సమస్యకు సరైన చికిత్స తీసుకున్న తర్వాత రక్తపోటు కూడా మెరుగుపడుతుందని ఆయన తెలిపారు.

థైరాయిడ్ ఉంటే హై బీపీని ఇలా కంట్రోల్ చేయండి

వైద్యులు సూచించిన విధంగానే థైరాయిడ్ మందులను తీసుకోవాలి. అలాగే థైరాయిడ్ ఫంక్షన్ టెస్టులను క్రమం తప్పకుండా చేయించుకోవాలి. హార్మోన్ స్థాయిలు నియంత్రణలో ఉంటే రక్తపోటు కూడా స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రీసెంట్​గా థైరాయిడ్ వచ్చిన వారు లేదా మందుల మోతాదులో మార్పులు చేసినవారు రక్తపోటును తరచూ చెక్ చేసుకోవాలి. దీనివల్ల మార్పులను ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవచ్చని డాక్టర్ దిలీప్ గూడె వెల్లడించారు.

ఉప్పు తగ్గించాల్సిందే..

ఈ రెండు సమస్యలు ఉన్నవారు ఆహారంలో కచ్చితంగా ఉప్పు పరిమాణాన్ని తగ్గించాలి. అలాగే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 

బరువు సమస్య

అధిక బరువు ఉంటే థైరాయిడ్ సమస్యలతో పాటు హై బీపీ కూడా మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అందుకే ఆరోగ్యకరమైన బరువును కొనసాగించాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనికోసం వైద్యుల సలహా తీసుకుని నడక, సైక్లింగ్, ఈత వంటి వ్యాయామాలు చేయాలి. శారీరక చురుకుదనం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచి రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

ఒత్తిడిని తగ్గించుకోవాలట

అధిక ఒత్తిడి రక్తపోటును పెంచే అవకాశం ఉంది. ధ్యానం, యోగా, రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించడం, తగినంత నిద్రపోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

ధూమపానం, మద్యం వద్దు

స్మోకింగ్, అధిక మద్యం సేవించడం గుండె, రక్తనాళాల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అందువల్ల వీటిని పూర్తిగా మానేయడం లేదా తగ్గించడం మంచిది.

ఈ టెస్ట్​లు చేయించుకోవాలి..

థైరాయిడ్ సమస్యలున్నవారు కొలెస్ట్రాల్ స్థాయిలు, గుండె ఆరోగ్యం, కిడ్నీ పనితీరును కూడా క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ సమస్యలు కలిసి ఉండే అవకాశం ఉండటంతో గుండె సంబంధిత ప్రమాదాలు పెరగవచ్చు.

హై బీపీ తగ్గకపోతే?

థైరాయిడ్‌కు సరైన చికిత్స తీసుకుంటున్నప్పటికీ.. రక్తపోటు ఎక్కువగానే ఉంటే అదనంగా బీపీ మందులు వాడాల్సి ఉంటుంది. అందుకే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగించడం చాలా ముఖ్యం. 

థైరాయిడ్ వ్యాధి, హై బీపీ రెండింటినీ ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే గుండె జబ్బులు, స్ట్రోక్, ఇతర దీర్ఘకాలిక సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. అందుకే ఎండోక్రైనాలజిస్ట్, ఫిజీషియన్‌లను క్రమం తప్పకుండా సంప్రదిస్తూ ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget