అన్వేషించండి

Heavy School Bags : పిల్లల స్కూల్ బ్యాగులు మరీ బరువుగా ఉన్నాయా? వెన్నెముక ఆరోగ్యంపై పడే ప్రభావం ఇదే.. వైద్యుల హెచ్చరికలు

School Bag Weight : స్కూల్ బ్యాగు బరువు చిన్న విషయం అనిపించినా, అది పిల్లల వెన్నెముక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనివల్ల పిల్లలకు ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయో చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పిల్లల బరువైన స్కూల్ బ్యాగులు వెన్నెముక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.
  • బ్యాగు బరువు శరీరంలో 10% దాటితే వెన్నునొప్పి వంటి సమస్యలు వస్తాయి.
  • తల్లిదండ్రులు, పాఠశాలలు జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల ఆరోగ్యం కుదురు.

School Bags Affect Childrens Spine : ప్రస్తుతం చాలా మంది పిల్లలు ప్రతిరోజూ భారీ బరువున్న స్కూల్ బ్యాగులను మోస్తున్నారు. పుస్తకాలు, నోట్‌బుక్స్, లంచ్ బాక్స్‌లు, వాటర్ బాటిల్స్ వంటి వస్తువులతో బ్యాగుల బరువు పెరుగుతోంది. అయితే ఈ అలవాటు వల్ల పిల్లల వెన్నెముక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం ప్రకారం.. చిన్న వయసులో పిల్లల వెన్నెముక, కండరాలు, లిగమెంట్లు ఇంకా అభివృద్ధి దశలోనే ఉంటాయి. ఈ సమయంలో అధిక బరువున్న స్కూల్ బ్యాగులు మోయడం వల్ల శరీరంపై అదనపు ఒత్తిడి పడుతుంది.

బ్యాగు బరువు ఎంత ఉండాలి?

వైద్యపరంగా చూస్తే.. పిల్లల స్కూల్ బ్యాగు బరువు వారి శరీర బరువులో 10 శాతానికి మించకూడదు. ఉదాహరణకు.. ఒక పిల్లవాడి బరువు 30 కిలోలు ఉంటే అతని స్కూల్ బ్యాగు గరిష్టంగా 3 కిలోల వరకు మాత్రమే ఉండటం మంచిదని చెప్తున్నార డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం. 
ఈ పరిమితిని మించితే పిల్లలు బ్యాలెన్స్ కోసం ముందుకు వంగడం, భుజాలను గుండ్రంగా ఉంచడం లేదా వెన్నును అసహజంగా వంచడం వంటి మార్పులు జరుగుతాయి. దీని వల్ల క్రమంగా మెడ నొప్పి, భుజాల నొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు.

బరువు ఎక్కువైతే కనిపించే లక్షణాలు ఇవే

స్కూల్ బ్యాగు బరువు ఎక్కువగా ఉండటం వల్ల పిల్లల్లో కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపించవచ్చు. తరచూ వెన్నునొప్పి రావడం, భుజాల నొప్పి లేదా బరువుగా అనిపించడం, కండరాల నొప్పి, నడిచేటప్పుడు లేదా నిలబడేటప్పుడు శరీర భంగిమ మారడం వంటివి జరుగుతాయి. అలాగే ఒక భుజం మరొక భుజం కంటే కిందకు కనిపించడం, బ్యాగు మోసేటప్పుడు అసౌకర్యంగా అనిపించడం జరుగుతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

వెన్నెముకపై ప్రభావం 

సాధారణంగా భారీ బ్యాగులు ఆరోగ్యవంతమైన పిల్లల్లో శాశ్వత వెన్నెముక వంకరలకు కారణం కాకపోయినా.. దీర్ఘకాలికంగా కండరాలు, కీళ్లపై ఒత్తిడిని పెంచుతాయని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల వెన్నెముక సహజ కదలికల్లో మార్పులు రావడంతో పాటు ఎదుగుదల దశలో శరీర బయోమెకానిక్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంటుందట.

తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పిలల్లో ఈ సమస్యలు పెరగకుండా తల్లిదండ్రులు, సూల్క్ యాజమాన్యం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వెడల్పాటి, మెత్తని షోల్డర్ స్ట్రాప్స్ ఉన్న బ్యాగులను ఎంచుకోవాలి. పిల్లలు రెండు భుజాలపై బ్యాగును సమానంగా మోయగలిగేలా చూసుకోవాలి. బరువైన పుస్తకాలను బ్యాగులో వెన్నుకు దగ్గరగా ఉంచాలి. అవసరం లేని పుస్తకాలు ప్రతిరోజూ స్కూల్‌కు తీసుకెళ్లకుండా చూడాలి.

స్కూల్ యాజమాన్యం పాఠశాలల్లో పిల్లలకు లాకర్ సదుపాయం కల్పించాలి. అలాగే డిజిటల్ లెర్నింగ్ లేదా ప్రత్యామ్నాయ పద్ధతులను ప్రోత్సహించాలి. దీనివల్ల పిల్లలకు బుక్స్ భారం కాస్త తగ్గుతుంది. 

పిల్లల వెన్నెముక ఆరోగ్యానికై..

సరైన భంగిమలో కూర్చోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం, కోర్, వెన్ను కండరాలను బలపరిచే కార్యకలాపాలు చేయించాలి. పిల్లల వెన్నెముక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే పిల్లలకు సమతుల్య ఆహారం అందించడం కూడా చాలా ముఖ్యమని అంటన్నారు. కాల్షియం, విటమిన్ D, విటమిన్ B12 వంటి పోషకాలు ఎముకల బలానికి, కండరాల పనితీరుకు, నరాల ఆరోగ్యానికి కీలక పాత్ర పోషిస్తాయి. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. 

మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్, ఇంటి చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget