అన్వేషించండి

Indian Flag: హర్ ఘర్ తిరంగా: జాతీయ జెండాను ఇలా మడతపెడితేనే గౌరవం, కేంద్రం సూచనలు

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ హర్ ఘర్ తిరంగా ఉద్యమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ‘హర్ ఘర్ తిరం’గా ఉద్యమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంలో దేశ ప్రజలందరూ తమ తమ ఇళ్లపై జాతీయ జెండాని ఎగుర వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికీ జాతీయ జెండాని అందించడం కోసం కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్‌లో పౌరులు తమ ఫోటో, పేర్లతో నమోదు చేసుకోవాలి. ఇలా చేసుకున్న వారికి ప్రభుత్వం సర్టిఫికెట్ కూడా ఇస్తుంది.  

1947లో జులై 22వ తేదీన దేశ త్రివర్ణ పతాకాన్ని అధికారికంగా గుర్తించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకం ఎగరాలని ప్రధాని ఆకాంక్షించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే 'హర్ ఘర్ తిరంగా' ఉద్యమాన్ని మొదలుపెట్టారు. పౌరులు తమ సోషల్ మీడియా అకౌంట్ల డీపీలు, స్టేటస్ లాల్లో త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.  

ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల హర్ ఘర్ తిరంగా పాటను విడుదల చేసింది. ఈ దేశ భక్తి గీతంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరోయిన్ కీర్తి సురేష్, క్రికెటర్ విరాట్ కోహ్లీ, అమితాబ్ బచ్చన్, క్రీడా దిగ్గజం కపిల్ దేవ్, నేపథ్య గాయని ఆశా భోంస్లే వంటి ప్రముఖ వ్యక్తులు, క్రీడాకారులు కూడా ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ఖాతాల్లో తమ డీపీగా జాతీయ జెండాని పెట్టుకున్నారు.

ఆగస్టు 13- 15 వరకు అందరూ తమ ఇళ్లపై జాతీయ జెండాని ఎగురవేయాలని ప్రధాని కోరారు. అయితే ఈ వేడుకలు పూర్తైన తర్వాత జెండాని ఎలా మడతపెట్టాలో చాలా మందికి తెలియదు. ఎలా పడితే అలా దాన్ని మడత పెట్టకుండా సరైన పద్ధతిలోనే . లేదంటే జాతీయ జెండాని మనం అవమానపరిచినట్టు అవుతుంది. అందుకే కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి గైడ్ లైన్స్ తో కూడిన ఒక ఫోటోని విడుదల చేసింది. అందులో జాతీయ జెండాని మడిచి పెట్టె విధానాన్ని వివరంగా ఇచ్చారు.

జెండా మడత పెట్టె విధానం ఇది:

Indian Flag: హర్ ఘర్ తిరంగా: జాతీయ జెండాను ఇలా మడతపెడితేనే గౌరవం, కేంద్రం సూచనలుస్టెప్ 1: జెండాను అడ్డంగా ఒక బల్ల మీద పరచాలి.

స్టెప్ 2: కాషాయం, ఆకుపచ్చ రంగులోని భాగాన్ని తెలుపు భాగం కిందకి మడత పెట్టాలి.

స్టెప్ 3: ఇప్పుడు కేవలం తెలుపు రంగు లోని అశోక చక్రం మాత్రమే కనిపించే విధంగా రెండు వైపులా సమానంగా మడత పెట్టుకోవాలి.  

స్టెప్ 4: జెండాని చక్కగా మడిచిన తర్వాత రెండు చేతులు మీద పెట్టుకుని జాగ్రత్తగా మంచి స్థలంలో భద్రపరుచుకోవాలి.

⦿ ఇలా మడతపెట్టేప్పుడు.. జాతీయ జెండాని నేల తాకకుండా చూసుకోవాలి. 

Also Read: ‘హర్ ఘర్ తిరంగా’లో మీ పేరును ఇలా నమోదు చేస్కోండి, ఈ సర్టిఫికెట్ పొందండి

Also read: ఈ దేశాలకు వీసా దొరకడం చాలా కష్టమట, ఆ దేశాలేంటో తెలిస్తే షాక్ తింటారు

టాప్ హెడ్ లైన్స్

Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget