అన్వేషించండి

ViSa: ఈ దేశాలకు వీసా దొరకడం చాలా కష్టమట, ఆ దేశాలేంటో తెలిస్తే షాక్ తింటారు

ప్రపంచదేశాలను చూడాలనుకునే పర్యాటకులకు ఈ దేశాలు అంత త్వరగా వీసా ఇవ్వవు.

ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. వాటికి టూరిస్టులుగా ఎంతో మంది వెళతారు. అలాగే చదువుల కోసం కూడా ఎంతో మంది విదేశాలకు వెళుతుంటారు. అయితే కొన్ని దేశాలు అంత త్వరగా విదేశీయులను తమ దేశంలోకి అనుమతించవు. వీసా ఇచ్చేందుకు ఇష్టపడవు. 

రష్యా 
రష్యా అంత సులువుగా వీసాలు ఇవ్వదు. రష్యన్ వీసా పొందాలంటే మీకు కాస్త ఎక్కువ సమయం పడుతుంది. ఈ దేశ వీసా ప్రక్రియలో భాగంగా ఫారమ్ నింపాల్సి ఉంటుంది కదా, అందులో ప్రశ్నల సంఖ్య ఎక్కువ. అంతేకాదు వీసా ఆమోదం పొందడానికి వారు గత పదేళ్లలో సందర్శించిన అన్ని ప్రదేశాలను కూడా నింపాలి.

చైనా 
చైనా దేశానికి వైద్య విద్య కోసం వెళ్లే వాళ్లే ఎక్కువ. మిగతావారు పర్యాటక ప్రదేశాలు చూసేందుకు వెళతారు. ఈ దేశ వీసా ప్రక్రియ చాలా సుదీర్ఘంగా సాగుతుంది. వీరు అడిగే డాక్యుమెంట్లు కూడా అధికం. ఆ డాక్యుమెంట్లన్నీ సమర్పించడానికే చాలా సమయం పడుతుంది. 

ఇరాన్
ఈ దేశంలో చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఉద్యోగరీత్యా కొంతమంది ప్రయాణాల చేస్తుంటారు. ఈ దేశ వీసా పొందడానికీ చాలా సమయం పడుతుంది. మీ తరుపుణ అధికారిక ఇరానియన్ ట్రావెల్ ఏజెన్సీ వారు ఇచ్చే కోడ్ కోసం ముందుగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆ కోడ్ వచ్చాక వీసా కోసం అప్లయ్ చేయాలి. ఈ కోడ్ ఇరాన్ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా జారీ చేస్తుంది.

తుర్కిమెనిస్తాన్
కఠినమైన వీసా నిబంధనల వల్ల చాలా తక్కువ మంది ఈ దేశాన్ని సందర్శిస్తారు. ఆ దేశంలో ఉండే ఏ సంస్థ లేదా వ్యక్తి నుంచైనా ఆహ్వాన లేఖను పొంది ఉండాలి. తుర్కిమెన్ స్టేట్ మైగ్రేషన్ సర్వీస్ ద్వారా నింపిన వీసా దరఖాస్తును పూర్తి చేయాలి. ఈ దేశ వీసా అంత సులభంగా అయ్యే పనికాదు. 

పాకిస్తాన్
మీరు నవ్వాపుకుంటున్నా కూడా... ఇది నిజమే. పాకిస్తాన్ కు వెళ్లాలన్నా కూడా ఒక స్పాన్సర్ కావాలి. అంటే ఆ దేశంలో మీకు తెలిసిన వ్యక్తులో, టూర్ కంపెనీయో ఉండాలి. వారు పిలిచినట్టు ఆహ్వాన లేఖ మీ దగ్గరుండాలి. ఆ తరువాతే వీసా ప్రక్రియ మొదలవుతుంది.

క్యూబా
కమ్యూనిస్టు దేశమైన క్యూబాకు వెళ్లాలంటే ఇతర దేశస్థులు కొంచెం సులువుగా వీసా పొందుతారేమో కానీ అమెరికన్లకు మాత్రమే చుక్కలు కనిపిస్తాయి. అక్కడ టూరిస్టు కార్డులు ఉంటాయి. కొందరికి గ్రీన్ టూరిస్ట్ కార్డులు ఇస్తారు. అమెరికన్లు వస్తే పింక్ టూరిస్టు కార్డులే. అంటే చాలా మందికి వీసా రాదు. 

ఉత్తక కొరియా
ప్రపంచంలో నియంతను కలిగి ఉన్న ఏకైక దేశం ఉత్తర కొరియా. హిట్లర్ ను మించిపోయేలా నియమాలు పెడతాడు ఆ దేశ అధ్యక్షడు కిమ్ జాంగ్ ఉన్. వీసాను పొందడం కష్టతరమయ్యే కొద్ది దేశాల్లో దీనిదే మొదటి స్థానమని చెప్పుకోవాలి. దక్షిణ కొరియా నుంచి వచ్చే వారు, అమెరికన్లు ఈ దేశంలోకి అడుగపెట్టలేరు. వీసా రావడం చాలా కష్టం. వచ్చినా కూడా ఆ దేశస్థులతో మాట్లాడకూడదు. ఇక నియంత కిమ్ గురించి మాట్లాడడం నిషిద్ధం. మీకు నచ్చినట్టుగా పర్యాటక ప్రదేశాలకు వెళ్లకూడదు. అందుకే ఆ దేశానికి టూరిస్టులెవరూ ఎక్కువగా వెళ్లరు. 

చాద్
ఇదొక అందమైన దేశం. కానీ వీసా ప్రాసెసింగ్ పద్ధతికి సరైన సమయం, నియమాలు లేనందున వీసా పొందే ప్రక్రియ చాలా ఆలస్యమైపోతుంది. దరఖాస్తు కేవలం ఫ్రెంచ్  భాషలో మాత్రమే ఉంటుంది. కాబట్టి వేరే దేశస్థులు నింపలేరు. 

Also read: షాకింగ్, పరగడుపున ఖాళీ పొట్టతో టీ తాగడం అంత హానికరమా? ఇలా చేస్తే సేఫ్

Also read: రోజూ బ్రెడ్ తినడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వస్తుందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Embed widget