Mutton Recipe: తలకాయ కూర వండడం రావడం లేదా? ఇలా అయితే సింపుల్

నాన్ వెజ్ ప్రియుల కోసం తలకాయ కూర సులువుగా ఎలా వండాలో ఇక్కడ చెబుతున్నాం.

FOLLOW US: 

తలకాయ కూర మటన్ విభాగం కిందకే వస్తుంది. మేక, గొర్రెల తలలతోనే ఈ కూరను వండుతారు. అందుకే మటన్ తినడం వల్ల కలిగే లాభాలన్నీ ఈ కూర తిడనం వల్ల కలుగుతాయి. మటన్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మహిళలు అధికంగా తింటే మంచిది. వీరికి రక్తహీనత సమస్య అధికంగా ఉంటుంది. ఈ మటన్లో బి విటమిన్లు అధికంగా లభిస్తాయి.గర్భిణులు మటన్ తినడం వల్ల పుట్టబోయే బిడ్డకు చాలా లాభాలు కలుగుతాయి. మటన్లో ఉండే పొటాషియం రక్తపోటు, గుండెజబ్బులు, కిడ్నీ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి. ఇందులో ఉండే కాల్షియం దంతాలు, ఎముకల గట్టిదనానికి సహకరిస్తాయి.  తలకాయ కూర సులువుగా ఎలా వండాలో చూడండి.

కావాల్సిన పదార్థాలు
తలకాయ మాంసం - అరకిలో
ఉల్లిపాయ - ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు
కారం - ఒక  స్పూను
పసుపు - ఒక స్పూను
గరం మసాలా - ఒక స్పూను
కొత్తమీరు తరుగు - నాలుగు స్పూనులు
ధనియాల పొడి - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కొబ్బరి తురుము - ఒక స్పూను
మిరియాల పొడి - అరస్పూను
(కొబ్బరి తురుము మీకు నచ్చితే వేసుకోవచ్చు. వేయకపోయినా రుచి బాగానే ఉంటుంది)

తయారీలో ఇలా
1. తలకాయ కూరను బాగా కడిగి పెట్టుకోవాలి. 
2. ఉల్లిపాయలు నిలువుగా సన్నగా తురమాలి. స్టవ్ పై కుక్కర్ పెట్టి అందులో నూనె వేయాలి. 
3. నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. 
4. అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేయించాలి. పసుపు, కారం కూడా కలపాలి. 
5. అందులో తలకాయ కూర వేసి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. 
6. స్టవ్ మీద మరో కళాయి పెట్టి కుక్కర్లోని కూరను ఇందులోకి మార్చాలి. 
7. ఉప్పు కూడా వేసి కాసేపు ఉడికించాలి. 
8. ముక్క 90 శాతం ఉడికిపోయాక మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొబ్బరి తురుము వేసి ఉడికించాలి. అప్పటికే కూర బాగా ఉడికి మంచి వాసన వస్తుంది. 
9. స్టవ్ కట్టేశాక పైన కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి. నాన్ వెజ్ ప్రియులెందరికీ తలకాయ కూరంటే ప్రాణం. ప్రత్యేకంగా వండుకుని తింటారు. ఇలా వండుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. 

Also read: గర్భం ధరించలేకపోతున్నారా? ఒత్తిడి కారణమేమో చూసుకోండి

Also read: వానలో ఈ గొడుగేసుకుంటే తడిసిపోతాం, ధర మాత్రం రూ.లక్షపైనే

Also read: ఈ ఆహారపదార్థాలలో పెయిన్ కిల్లర్స్ లక్షణాలు అధికం, నొప్పిని తగ్గిస్తాయి

Published at : 20 May 2022 10:44 AM (IST) Tags: Telugu vantalu Goat Head Curry recipe in telugu Thalakaya kura Recipe Mutton Recipe in Telugu

సంబంధిత కథనాలు

Fight With Wife: భార్యతో గొడవ, చర్చికి నిప్పంటించిన భర్త - అసలు కారణం తెలిసి షాకైన జనం!

Fight With Wife: భార్యతో గొడవ, చర్చికి నిప్పంటించిన భర్త - అసలు కారణం తెలిసి షాకైన జనం!

Lottery: అధ్యక్షా, లక్కంటే ఇట్టా ఉండాల! ట్రక్కు డ్రైవర్‌కు ఊహించని జాక్‌పాట్, ఒకేసారి..

Lottery: అధ్యక్షా, లక్కంటే ఇట్టా ఉండాల! ట్రక్కు డ్రైవర్‌కు ఊహించని జాక్‌పాట్, ఒకేసారి..

Whistling Scrotum: వృద్ధుడి వృషణాల నుంచి విజిల్స్, కారణం తెలిసి షాకైన డాక్టర్లు!

Whistling Scrotum: వృద్ధుడి వృషణాల నుంచి విజిల్స్, కారణం తెలిసి షాకైన డాక్టర్లు!

Cow Dung Car: కారును ఆవు పేడతో అలికేసిన యజమాని, ఎందుకో తెలిస్తే ఔరా అంటారు!

Cow Dung Car: కారును ఆవు పేడతో అలికేసిన యజమాని, ఎందుకో తెలిస్తే ఔరా అంటారు!

Love With Boyfriend Father: ప్రియుడి తండ్రిని పెళ్లి చేసుకున్న యువతి, ఇద్దరికీ 24 ఏళ్లు గ్యాప్!

Love With Boyfriend Father: ప్రియుడి తండ్రిని పెళ్లి చేసుకున్న యువతి, ఇద్దరికీ 24 ఏళ్లు గ్యాప్!

టాప్ స్టోరీస్

Maharashtra News: అసలైన శివసైనికుడు సీఎం అయ్యాడని, ప్రజలు హ్యాపీగా ఉన్నారు-సీఎం షిండే కామెంట్స్

Maharashtra News: అసలైన శివసైనికుడు సీఎం అయ్యాడని, ప్రజలు హ్యాపీగా ఉన్నారు-సీఎం షిండే కామెంట్స్

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల

TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల

PM Modi Tour: తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని టూర్ షెడ్యూల్ ఇదే- భారీ ఏర్పాట్లు చేసిన బీజేపీ

PM Modi Tour: తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని టూర్ షెడ్యూల్ ఇదే- భారీ ఏర్పాట్లు చేసిన బీజేపీ