Umbrella: వానలో ఈ గొడుగేసుకుంటే తడిసిపోతాం, ధర మాత్రం రూ.లక్షపైనే
ఇప్పుడు ఒక గొడుగు కారణంగా రెండు అంతర్జాతీయ సంస్థలు ట్రోలింగ్ బారిన పడ్డాయి.
గొడుగు ఎందుకు వాడతాం? ఎండా వానల నుంచి రక్షణ కోసం కదా. కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్న గొడుగు ఎండ నుంచి రక్షణ కల్పిస్తుంది, కానీ వానలో వేసుకుంటే మాత్రం తడిసి ముద్దయిపోతారు. దీంతో అసలు దీన్ని గొడుగుని ఎలా అంటారు? అంటూ ఆటాడేసుకుంటున్నారు నెటిజన్లు. గొడుగు ముఖ్యంగా వానల నుంచి రక్షణకే వాడతాం. ఎండ ఉన్నా కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయే వాళ్లే ఎక్కువ. పోనీ ఈ గొడుగు ధరేమైనా తక్కువా అంటే అదీ కాదు, ఒక లక్షా 27 వేల రూపాయలు. ఆ ధరకు, దాని పనితీరుకు మ్యాచ్ కాకపోవడంతో ట్రోలింగ్ బారిన పడ్డాయి ఆ గొడుగును తయారు చేసిన సంస్థలు. ఇంతకీ ఆ సంస్థలేవో తెలుసా గూచీ, ఆడిదాస్. ఈ రెండు ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లు.
అలంకరణకే...
పాశ్చాత్య దేశాల్లో గొడుగులను అలంకరణకు కూడా వాడతారు. అందుకే దీన్ని కూడా అలంకరణ గొడుగు కిందే తయారుచేశారట. అందుకే వాన పడినప్పుడు ఇప్పుడు వాటర్ ప్రూఫ్ కాదని,తడిసిపోతారని చెబుతున్నారు సంస్థ ప్రతినిధులు. చైనా సోషల్ మీడియా వీబో. ఇందులో ఈ గొడుగు ఫోటోను పోస్టు చేసి, వివరాలు రాశారు. దీన్ని ఇప్పటివరకు 14 కోట్ల మంది నెటిజన్లు చూశారు. భారీగా ట్రోలింగ్ చేశారు. ఈ గొడుగును కొనుక్కనే వాళ్లు ఉంటారా? అని ఒకరు కామెంట్ చేస్తే, తమ దగ్గర డబ్బులున్నాయని చెప్పుకోవడానికి కొంతమంది కొనుక్కునే వస్తువు ఇది అని మరికొందరు కామెంట్ చేశారు. త్వరలోనే ఈ గొడుగు ఆన్ లైన్లో అమ్మకానికి రాబోతోందట.
లగ్జరీ ఫ్యాషన్ లేబుల్ గూచీ, స్పోర్ట్స్ వేర్ దిగ్గజం అడిదాస్ కలిసి ఈ గొడుగును మార్కెట్లో పరిచయం చేయబోతున్నారు. దీనికి ‘సన్ అంబ్రెల్లా’ అని పేరు పెట్టారు. దీన్ని ఇటలీలో తయారుచేశారు. గూచీ వెబ్సైట్లో ఈ గొడుగు వివరాలు పొందుపరిచారు. గూచీ సంస్థకు ట్రోలింగ్, నిరసనలు అర్థమయ్యాయి. అందుకే వారు ‘మేము ముందుగానే చెప్పాం ఇది కేవలం అలంకరణకు లేదా సూర్యుని నుంచి రక్షణకు మాత్రమే పనికివస్తుంది అని’ తెలిపారు.
⚠️warning!🤣⛽️
— cubist👽🐼🧛♂️🧟♂️🧚♀️🤖 (@cubist_pg) May 13, 2022
☔️Umbrellas are not waterproof!#adidasxGucci @adidasoriginals @gucci #VirtualWorld #REALITY #Blockchain #CryptocurrencyNews #Metaverse #NFTCommunity #NFTcollectibles #NFTartist #nftcollector pic.twitter.com/xmudzHHxrW
Also read: ఈ ఆహారపదార్థాలలో పెయిన్ కిల్లర్స్ లక్షణాలు అధికం, నొప్పిని తగ్గిస్తాయి
Also read: గోడ కుర్చీ శిక్ష కాదు ఆరోగ్యానికి రక్ష, రోజుకు అయిదు నిమిషాలు వేస్తే ఎన్ని ప్రయోజనాలో