GAS stove: గ్యాస్ స్టవ్ వాడుతున్నారా? కంటికి కనిపించని ఈ ప్రమాదాన్ని మీరు ఊహించి ఉండరు!
ఎల్ పీ జీ గ్యాస్ వినియోగం వల్ల రకరకాల బ్లడ్ క్యాన్పర్ల కు కారణం అవుతోందని ఒక అధ్యయనం వివరాలు అందిస్తోంది.
వంటింట్లో విప్లవం తెచ్చిన ఆవిష్కరణ గ్యాస్ స్టవ్. గ్యాస్ స్టవ్ వినియోగంలోకి వచ్చిన తర్వాత వంట చాలా సులభం అయ్యింది. అంతేకాదు వంట చేసే వారి కళ్లకు, శ్వాసకు ఇబ్బంది లేకుండా వంట పూర్తయ్యే మార్గం దొరికింది. స్త్రీలపాలిట వరదాయిని గ్యాస్ స్టవ్ అని చెప్పాలి. ప్రస్తుత కాలంలో గ్యాస్ లేదంటే వంట లేదని అర్థం. గ్యాస్ బండ ధరలు ఎంత పెరుగుతున్నా.. భరించడానికి కారణం.. సులభంగా పనైపోవడం. అయితే, ఈ గ్యాస్ వల్ల ఆరోగ్యం చెడిపోతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
స్టాన్ పోర్డ్ యూనివర్సిటికి చెందిన పరిశోధకుల ఇటీవలే ఈ షాకింగ్ విషయాన్ని ప్రకటించారు. సాధారణంగా ఆయిల్ ఫీల్డులు, రిఫైనరీల్లో మంటలు వెలువడే అధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాల్లో బెంజిన్ ఏర్పడుతుంది. మనం నిత్యం ఇంట్లో వెలిగించే ఎల్‌పీజీ స్టవ్ మండినపుడు కూడా బెంజిన్ ఉంటుందని ప్రొఫెసర్ రాబ్ జాక్సన్ తెలిపారు. కేవలం ఒక్క సారి బర్నర్ వెలిగిస్తే చాలు.. సిగరెట్ పొగ కంటే ఎక్కువ బెంజిన్ ఉత్పత్తి అవుతుందట. అయితే వంటింటికి మంచి వెంటిలేషన్ ఉంటే.. దీని తీవ్రతను కాస్త తగ్గే అవకాశం ఉంటుందట. ఎగ్జాస్ట్ ఫ్యాన్లు అంత సమర్థవంతంగా బెంజిన్ తొలగించలేకపోతున్నాయని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
గ్యాస్ స్టవ్‌లు.. బెంజిన్ తో సహా 21 ఇతర ప్రమాదకర కాలుష్య కారకాలకు కారణం అవుతున్నాయి. అవి లుకేమియా నుంచి పుట్టుకతో వచ్చే అనేక బ్లడ్ క్యాన్సర్లకు కారణం కావచ్చు. స్టవ్ ఆఫ్ లో ఉన్నపుడు కూడా బెంజిన్ విడుదల స్థాయిని కూడా పరిశీలించారు. స్టవ్ నుంచి విడుదలయ్యే బెంజిన్ ఇల్లంతా వ్యాపిస్తుందట. స్టవ్ ఆప్ చేసిన గంటల తర్వాత కూడా బెడ్ రూముల్లో బెంజిన్ స్థాయి ప్రమాదకర స్థాయిలోనే ఉంది. ఇండక్షన్ స్టవ్ లు ఉపయోగించిన వంటకాల్లో పెద్ద నష్టం కలిగించే రసాయనాలు కనిపించలేదట.
ఈ తాజా అధ్యయనాన్ని ఎన్వరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రచురించారు. దేశంలో ప్రధాన వంట చెరుకు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఎల్ పీ జీ గ్యాసే. ఈ అధ్యయనం గురించి తెలిసిన తర్వాత ప్రముఖ రచయిత యన్నాకస్తాన్ తాను ఎలక్ట్రిక్ స్టవ్ అందుబాటులో ఉన్న ఫ్లాట్ అద్దెకు తీసుకోవాలని అనుకుంటున్నట్టు ప్రకటించారు. గ్యాస్ స్టవ్ ల వల్ల కలిగే కాలుష్యం గురించి తెలుసుకున్న తర్వాత అది లేకుండా జీవించడమే తనకు బావుంటుందని కూడా అన్నారు. ఇక గ్యాస్ పక్కన పెట్టి ఇండక్షన్ స్టవ్ ల బాట పట్టాల్సి వస్తుందేమో మరి చూడాలి.
Also read : సైకిల్ తొక్కితే స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా? అబ్బాయిలూ ఈ వాస్తవాలు తెలుసుకోండి!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.