సైకిల్ తొక్కితే స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా? అబ్బాయిలూ ఈ వాస్తవాలు తెలుసుకోండి!
క్యాన్సర్, డయాబెటిస్ వంటి కొన్ని సమస్యల్లో త్వరగా గుర్తించి చికిత్స ప్రారంభించడం అనేది చాలా అవసరం. కానీ చికిత్స అవసరం లేని అనారోగ్యలకు గురించిన అపోహలను కట్టి పెట్టి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
పురుషుల ఆరోగ్యంలో కాస్తా తేడా చేసినా సరే వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెడుతారట. చీటికిమాటికి క్లినిక్ కి పరుగెత్తుకు వస్తున్నారని బుపా హెల్త్ క్లినిక్స్ లో నాలుగింట ఒక వంతు మంది పురుషులను వీలైనంత ఎక్కువ కాలం క్లినిక్ కు రావద్దని సూచించారట. 58 శాతం వరకు వారి ఆరోగ్య సమస్యలు పట్టించుకోకుండా వదిలేస్తే వాటంతట అవే తగ్గిపోతాయని చెబుతున్నారు నిపుణులు. మహిళలు పురుషుల కంటే 20 శాతం తక్కువ వైద్యులను సంప్రదిస్తారని స్టడీస్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి పురుషుడు.. తమ జీవితంలో వినే కొన్ని అపోహల్లో నిజం ఎంత ఉందనేది తెలుసుకోవాలి. అవేంటో చూసేయండి మరి.
అపోహ: ఒత్తిడి తగ్గించుకునేందుకు కాస్త తాగితే తప్పు లేదు
వీకెండ్ పార్టీల్లో వారంలో ఒకసారి తాగేవారి గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. కానీ అది కాస్త వ్యసనంగా మారుతుందేమో కనిపెట్టుకుని ఉండాలి. ఒత్తిడి నుంచి బయటపడేందుకు లేదా సంతోషాన్ని సెలబ్రేట్ చేసేందుకు అంటూ కారణాలు వెతికి తాగుతుంటే మాత్రం నిజంగా తాగాల్సిన అవసరం ఉందా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవడం అవసరమని ఫాన్సీపుల్ కు చెందిన డాక్టర్ డార్డ్ అంటున్నారు. వారానికి 14 యూనిట్లకు మించి తాగుతుంటే మాత్రం కచ్చితంగా మీరు మీ అలవాటు గురించి ఆలోచించాలి. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, లేదా మీ పని మీద కూడా ఆల్కహాల్ ప్రభావం చూపుతుంటే మాత్రం తప్పకుండా మీరు నిపుణుల సహాయం తీసుకోవాలని గుర్తుంచుకోండి
అపోహ : సైక్లింగ్ తో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది
సైక్లింగ్ తో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని మిడిల్ ఏజ్ పురుషులు చాలామంది అనుకుంటారు. నిజానికి సైక్లింగ్ మంచి వ్యాయామం. దాని వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. సైక్లింగ్ వల్ల కౌంట్ తగ్గదు. కానీ బిగుతుగా ఉండే దుస్తులు ఎక్కువ సమయం పాటు ధరించి ఉండడం వల్ల వృషణాల్లో ఉష్ణోగ్రతలు పెరిగి కౌంట్ తగ్గవచ్చనేది వాస్తవం.
అపోహ: పురుషుల్లో ఆస్టియోపొరోసిప్ రాదు
సాధారణంగా 50 సంవత్సరాల పైబడిన వయసు మహిళల్లో ఆస్టియోపొరోసిస్ సమస్య కనిపిస్తుంటుంది. వారిలో ఎముకల్లో సాంద్రత తగ్గుతుంటుంది. అయితే పురుషుల్లో మహిళల్లో అంత ఎక్కువగా కనిపించదు. అయితే సియోలియాక్ డిసీజ్ కు చికిత్సగా చాలా కాలం పాటు స్టెరాయిడ్లు వాడడం, లేదా ఇమ్యూనోసెంప్రసెంట్స్ వాడడం వల్ల పురుషుల్లో ఆస్టియోపొరోసిస్ రావచ్చు.
ఇలాంటి సందర్బాల్లో స్ట్రెంత్ ట్రెయినింగ్ ను నిపుణులు సిఫారసు చేస్తున్నారు. దీని వల్ల ఎముకలు, కండరాలను బలోపేతం చేస్తుంది. ఇది గాయాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది.
అపోహ : అందరూ గురక పెడతారు, ఇది సాధారణం
గురకపెట్టడం కేవలం పురుషులు మాత్రమే కాదు.. కొంత మంది స్త్రీలలో కూడా ఉంటుంది. బరువు తగ్గడం, ఒకవైపు తిరిగి పడుకోవడం ద్వారా గురకను నివారించవచ్చు. గురక అనేది అంత నిర్లక్ష్యం చెయ్యదగిన సమస్య కాదు. రాత్రి పూట తీవ్రమైన గురక ఉండడం, పగటి పూట చాలా అలసట కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే అది స్లీప్ ఆప్నియా కావచ్చేమో అని అనుమానించాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్లీప్ ఆప్నియా గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, డిప్రెషన్ వంటి వాటితో ముడి పడి ఉంటుంది. కనుక తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవాలి. కాబట్టి, అందరూ గురక పెడతారు కదా.. పెద్ద సమస్య కాదని మాత్రం భావించొద్దు.
అపోహ : రొమ్ము క్యాన్సర్ కేవలం స్త్రీలకే వస్తుంది
రొమ్ము క్యాన్సర్ కేవలం స్త్రీలకే వస్తుందనేది కేవలం అపోహా. ఏడాదికి 400 మంది పురుషులు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారట. ఆల్కహాల్, స్థూలకాయం, కుటుంబ చరిత్ర వంటివన్నీ కారణం అవుతున్నాయి. సాధారణంగా మహిళలకు తరచుగా రొమ్ములను స్వీయ పరీక్ష చేసుకోవాలని సూచిస్తారు అలాగే పురుషులకు వృషణాలను పరీక్షించుకోవాలని చెబుతారు. అలాగే పురుషులు కూడా తరచుగా రొమ్ములు కూడా పరీక్షించి చూసుకోవాలి. గడ్డలు లేదా ఏదైనా మార్పులు కనిపిస్తే తప్పకుండా డాక్టర్ ను కలవాలి.
Also read : దెయ్యాలను నమ్మే దేశాలివే - అక్కడైతే చదువుకున్నవారు కూడా చేతబడులు చేస్తారట!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial