Walking: వాకింగ్‌తోనే మూడు నెలల్లో 30 కిలోలు తగ్గొచ్చు తెలుసా? ఇలా వాకింగ్ చేస్తే ఇది సాధ్యమే
అధిక బరువును తగ్గించేందుకు వాకింగ్ చేస్తే చాలు మంచి ఫలితం పొందవచ్చు.
ఊబకాయం, అధిక బరువు ఈ రెండు భవిష్యత్తులో పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. ఎక్కువ అనారోగ్యాలన్నింటికీ ఇవే కారణం కావచ్చని అంచనా వేస్తున్నారు ఆరోగ్యనిపుణులు. అందుకే అధిక బరువును కచ్చితంగా తగ్గించుకోమని చెబుతున్నారు. చాలా మంది బరువు తగ్గించుకోవడం కోసం జిమ్ ట్రైనర్లకు వేలకు వేలు ఖర్చుపెడతారు. నిజానికి చాలా సింపుల్‌గా బరువు తగ్గొచ్చు. కేవలం వాకింగ్ ద్వారానే బరువు తగ్గవచ్చు. కాకపోతే రోజూ దాదాపు గంట సేపు కచ్చితంగా నడవాలి. ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదు. మిగతా వ్యాయామాలు చేయకుండా వాకింగ్ ద్వారానే సన్నని మెరుపుతీగలా మారొచ్చు.
ఇలా తగ్గొచ్చు...
పలు అధ్యయనాల ప్రకారం రోజూ గంట పాటూ వాకింగ్ చేస్తే వారంలోనే 3 కిలోల వరకు బరువు తగ్గే అవకాశం ఉంది. ఇలా 12 వారాల పాటూ చేస్తే 30 కిలోలు తగ్గొచ్చు అని చెబుతున్నారు. తక్కువగా వేసుకున్నా కూడా 20 కిలోలు సులువుగా తగ్గొచ్చు. అందులోనూ వాకింగ్ ద్వారా బరువు తగ్గడం చాలా ఆరోగ్యకరమైన పద్ధతి. ఈ సమయంలో ఆహారాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. పోషకాహార నిపుణుల సాయం తీసుకుని నీరసం రాకుండా డైట్ ప్లాన్ మార్చుకోవాలి. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాల్సిఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. పిండి పదార్థాలు తక్కువగా ఉండేలా చేసుకోవాలి. పండ్లు, కూరగాయలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. ఈ సమయంలో మాంసాహారాన్ని తగ్గాంచాలి. కొలెస్ట్రాల్ చేరే అవకాశం ఉన్న ఏ ఆహారాన్ని తీసుకోకూడదు.
వాకింగ్ చేసేటప్పుడు చేతులు ఊపుతూ నడవాలి. వేగంగా నడవాలి. మెల్లగా నడవడం వల్ల ఉపయోగం లేదు. అలాగని ప్రారంభం నుంచి వేగంగా నడవకూడదు. మెల్లగా మొదలుపెట్టి క్రమంగా వేగం పెంచుకుంటూ వెళ్లాలి. మొదటిరోజే గంట నడవడం కష్టం అనుకునేవాళ్లు,రెండు మూడు రోజులు అరగంట పాటూ నడిచి క్రమంగా సమయాన్ని పెంచుకుంటూ వెళితే మంచిది.
ఇంకా ఎన్నో ప్రయోజనాలు
1. వాకింగ్ వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అల్జీమర్స్, మతిమరుపు వంటి సమస్యలు రావు.
2. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. అంధత్వానికి కారణమయ్యే గ్లకోమాను నిరోధిస్తుంది.
3. అమెరికా హార్ట్ అసోసియేషన్ తెలిపిన ప్రకారం గుండెకు కూడా చాల మేలు. రక్తసరఫరా బాగా జరిగి గుండె పోటు వచ్చే అవకాశం తగ్గుతుంది.
4. అధిక రక్తపోటు ఉన్నవారికి వాకింగ్ చాలా అవసరం. బీపీ అదుపులో ఉంటుంది.
5. నడక వల్ల ఊపిరితిత్తులకు చాలా మేలు. దానికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి.
Also read: Optical Illusion: కేవలం మేధావులు మాత్రమే దీన్ని సాల్వ్ చేయగలరు, మీ వల్ల అవుతుందేమో చూడండి
Also read: ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడండి, గుండె పోటు వచ్చే అవకాశం ఉందని అర్థం