Optical Illusion: కేవలం మేధావులు మాత్రమే దీన్ని సాల్వ్ చేయగలరు, మీ వల్ల అవుతుందేమో చూడండి
మీకు ఆప్టికల్ ఇల్యూషన్ అంటే ఇష్టమా? దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి.
కళ్లను మాయ చేసే కళ ఆప్టికల్ ఇల్యూషన్‌కే సొంతం. ఒక్కసారి ఇవి అలవాటయ్యాయా? వాటిని సాల్వ్ చేస్తూనే ఉంటారు. మెదడుకు, చూపుకు సవాలు విసిరే ఆప్టికల్ ఇల్యూషన్ ఇది. ఇందులో 36 జంటలు ఉన్నాయి. అన్నీ ఒకేలా ఉన్నాయి. కానీ ఒక్కటి మాత్రం కాస్త తేడాగా ఉంది. ఆ ఒక్కటి ఎక్కడ ఉందో కనుక్కునే ప్రయత్నం చేయండి. వినడానికి ఇది సులువుగా ఉన్నప్పటికీ కనిపెట్టడం మాత్రం చాలా కష్టం. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీన్ని కేవలం రెండు శాతం మంది మాత్రమే పరిష్కరించగలిగారు.
ఇదిగో జవాబు...
ఆ జంటను కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. మీరు చాలా చురుకైన చూపు, పదునైన ఆలోచన కలిగిన వారు. మీరు కచ్చితంగా మేధావుల కోవకే చెందుతారు. ఎవరైతే వెతికి వెతికి విసిగిపోయారో వారి కోసమే ఈ జవాబు. 35 జంటలు ఒకేలా ఉన్నప్పటికీ, వేరుగా ఉన్న ఆ ఒక్క జంట ఎక్కడుందంటే... రెండో లైనులో రెండో జంట. ఆ జంటను కాస్త పరీక్షగా చూడండి. అన్ని జంటలు పెదవులపై ముద్దు పెట్టుకుంటుంటే, ఈ జంట మాత్రం నుదుటిపై ముద్దు పెట్టుకుంటోంది. అదే తేడా. దీన్ని కనిపెట్టడానికి కొన్ని గంటలు సమయం తీసుకున్న వారు కూడా ఉన్నారు. తేడాను కనిపెట్టలేక ఇదంతా ట్రాష్ అని కొట్టిపడేసిన వారూ ఉన్నారు.
ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు మంచి టైమ్ పాస్ లా ఉంటాయి. మెదడుకు మేతగా పనిచేస్తాయి. వీటిలో కళ్ల ముందే అంతా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా దీనిలో ఎన్నో ట్విస్టులు దాక్కుంటాయి. అదే దీని స్పెషాలిటీ. ఆప్టికల్ ఇల్యూషన్ పుట్టుక వెనుక ఎన్నో వేల ఏళ్ల నాటి చరిత్ర ఉందని శిలాజాల తెలుస్తోంది. మన పూర్వీకులు కూడా వీటిని ఆడుకునేవారని చరిత్రకారుల అభిప్రాయం. మెదడు చురుగ్గా పనిచేసేందుకు ఇలాంటి ఆటలు వాడుకలోని వచ్చినట్టు చెబుతారు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్లను ఎవరు, ఎప్పుడు మొదటిగా మొదలుపెట్టారో మాత్రం ఎలాంటి సమాచారం లేదు. వందల ఏళ్ల క్రితం మొదలైనా కూడా ఇప్పటికీ వినోదాన్ని పంచడమే వీటి ప్రత్యేకత.
Also read: ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడండి, గుండె పోటు వచ్చే అవకాశం ఉందని అర్థం
Also read: వాతావరణం చల్లబడితే దగ్గు, జలుబు వచ్చేస్తోందా? ఈ జాగ్రత్తలు తీసుకోండి
Also read: నూడుల్స్ తరుచుగా తింటున్నారా? మీ శరీరంలో కలిగే మార్పులు ఇవిగో