Infections: వాతావరణం చల్లబడితే దగ్గు, జలుబు వచ్చేస్తోందా? ఈ జాగ్రత్తలు తీసుకోండి
హఠాత్తుగా వాతావరణం మారినా, చల్లబడినా ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది.
మొన్నటి వరకు ఎర్రటి ఎండలు. వడదెబ్బ తగులుద్దేమో అని భయపడేంతగా మండాయి. రెండు రోజుల నుంచి వాతావరణ చల్లబడిపోయింది. సాయంత్రమైతే మరీ చల్లబడి, తొలకరి చినుకులు కూడా అక్కడక్కడ పలకరిస్తున్నాయి. రుతుపవనాలు కూడా జోరుగా మనవైపు వచ్చేస్తున్నాయి. వాతావరణం హఠాత్తుగా చల్లబడేసరికి ఎంతో మందికి ఆరోగ్యంలో తేడా వచ్చేసింది. జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్నారు. అసలే మొన్నటి వరకు కరోనా వల్ల భయపడిపోయాం. ఇప్పుడు మళ్లీ అలాంటి లక్షణాలే కనిపించేసరికి కరోనాయేమో అని భయపడేవాళ్లు ఉన్నారు. వాతావరణం మారగానే ఇలా జలుబు, గొంతు నొప్పి, జ్వరం వంటివి అనిపిస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
1. ఇలా హఠాత్తుగా వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నప్పుడు అనేక రకాల ఇన్ఫెక్షన్లు దాడి చేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు జలుబో, దగ్గో వచ్చే వరకు ఆగకుండా వేడినీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు అంత త్వరగా గొంతుపై దాడి చేయవు.
2. నీటిని పుష్కలంగా తాగాలి. శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాతావరణం చల్లగా ఉండడం వల్ల దాహం వేయదు. దీని వల్ల తాగే నీటి శాతం తగ్గిపోతుంది. దీంతో శరీరం డీ హైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. దీని వల్ల జ్వరం వచ్చే అవకాశం ఉంది.
3. చల్లని పదార్థాలు, మసాలాలు దట్టించిన కూరలు తినడం మానేసి గోరువెచ్చని పాలు, వేడి వేడి ఆహారాన్ని తినడం మంచిది. త్వరగా ఉపశమనం లభిస్తుంది.
4. రోధనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికే ఇలా వాతావరణం మారగానే ఇన్ఫెక్షన్లు దాడి చేస్తాయి. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయండి.
5. కంటి నిద్ర లేకపోయినా ఇన్ఫెక్షన్లు త్వరగా సోకుతాయి. రోగినిరోధక శక్తి వీక్ గా ఉంటుంది కాబట్టి జలుబు, దగ్గు వచ్చేస్తాయి. రోజుకు 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి.
6. పండ్లు, కూరగాయలు అన్నీ శుభ్రం కడుక్కున్నాకే వినియోగించాలి.
7. ఇంటి చుట్టు దోమలు ఉండే అవకాశం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. నీళ్లు నిల్వ ఉన్న ప్రదేశాల్లో దోమలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఎక్కడా నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి.
8. వానల్లో విషజ్వరాలు, చికెన్ గున్యా, డెంగీ, మలేరియా వంటి జ్వరాలు అధికంగా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి శుభ్రత పాటించాలి.
Also read: ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడండి, గుండె పోటు వచ్చే అవకాశం ఉందని అర్థం
Also read: కార్డియాక్ అరెస్టు, హార్ట్ ఎటాక్ ఒక్కటి కాదా? రెండింటికీ ఏంటి తేడా?