అన్వేషించండి

Holi 2026 : హోలీ ఆడేప్పుడు ఈ తప్పులు చేయకండి.. రంగుల పండక్కి రిస్క్ చేస్తే జైలుకెళ్లిపోతారు, జాగ్రత్త

Holi Celebration in India : పిల్లలనుంచి పెద్దలవరకు ఎక్కువమంది ఇష్టపడే పండుగల్లో హోలీ ఒకటి. అయితే హోలీ ఆడేప్పుడు కొన్ని తప్పులు చేస్తే.. పోలీసులు అరెస్ట్ చేస్తారట. అవేంటంటే..

Holi Celebration Rules : కొన్నిసార్లు తెలియక చేసే తప్పులు కూడా నేరాలుగా మారుతాయి. అందుకే ఏ పని చేసేప్పుడు అయినా జాగ్రత్తగా ఉండాలి. అలాగే హోలీ ఆడే సమయంలో కూడా కొన్ని విషయాల జోలికి వెళ్లకూడదు. ఎందుకంటే హోలీ రోజు సంతోషంలో.. ఏమైనా, చిన్న పొరపాట్లు చేసినా కూడా మీరు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. మరి ఇండియాలో హోలీ ఆడేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. 

ఇండియాలో హోలీ అనేది కేవలం పండుగే కాదు. ఇది ఆనందం, సోదరభావం, పరస్పర ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఫాల్గుణ మాసంలో వచ్చే ఈ పండుగ వసంతకాలం రాకను సూచిస్తుంది. ఈ సమయంలో పిల్లల నుంచి పెద్దల వరకు, యువత అందరూ కలిసి రంగులతో ఆడుకుంటారు. గులాబీ రంగు పూసుకుని.. హగ్ చేసుకుని విషెష్ చెప్పుకుంటారు. ఈ పీక్​ మూమెంట్​లోనే కొన్నిసార్లు అత్యుత్సాహంతో, సంతోషంతో కొన్ని తప్పులు చేసి.. ఇబ్బందులు పడుతారు. హోలీని సంతోషంగా, సురక్షితంగా జరుపుకోవాలనుకుంటే.. కొన్ని విషయాలను కచ్చితంగా గుర్తించుకోవాలి. మరి ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు చూసేద్దాం. 

సమ్మతి ఉండాల్సిందే..

హోలీ అనేది రంగుల పండుగ. కానీ అందరూ రంగులతో ఆటుకుంటూ.. పండుగను ఆస్వాదించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరికైనా బలవంతంగా రంగులు పూయడం తప్పు. కాబట్టి ముందుగా ఎదుటి వ్యక్తి అనుమతి తీసుకోండి. ఎవరైనా నిరాకరిస్తే వారి మాటలను గౌరవించాల్సి ఉంటుంది. లేకుంటే ఇది తప్పుగా పరిగణిస్తారు. 

నీటి బుడగలతో

హోలీ సమయంలో నీటి బుడగలు ఒకరిపై ఒకరు విసురుకుంటారు. ఇలా రంగురంగుల బెలూన్లు విసరడం సరదాగా అనిపించవచ్చు. కానీ అవి కంటికి లేదా తలకు గాయాలు అయ్యేలా చేస్తాయి. కొన్నిసార్లు తీవ్రమైన ప్రమాదాలు సంభవించవచ్చు. కాబట్టి బెలూన్లతో హోలీ ఆడటం మానుకోండి. 

కెమికల్స్​కు దూరం..

చౌకైన, కెమికల్స్​తో నిండిన రంగులు చర్మం, కళ్లు, జుట్టుకు హాని కలిగిస్తాయి. కాబట్టి మూలికా లేదా సహజ రంగులను మాత్రమే వాడండి. 

అసభ్య ప్రవర్తన

హోలీ పేరుతో కొందరు ఆకతాయిలు మహిళలను వేధించడం లేదా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇష్టం లేకుండా రంగులు పూస్తారు. ఇది ఎప్పుడూ వారి గౌరవం, మర్యాదను దెబ్బతీస్తుంది. ఇలాంటి సందర్భంలో పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయవచ్చు.

మత్తు పదార్థాలు

హోలీ సమయంలో మద్యం లేదా ఇతర మాదకద్రవ్యాలను తీసుకోవడం వల్ల తగాదాలు, ప్రమాదాలు జరగవచ్చు. కాబట్టి మత్తు పదార్థాలు లేకుండా హోలీని ఆస్వాదిస్తే మంచిది. మీరు కూడా కంట్రోల్లో ఉంటారు. 

బురద లేదా మట్టితో హోలీ

మురుగు నీరు, బురద లేదా ఆవు పేడతో హోలీ ఆడటం తప్పు. ఇది వ్యాధులను వ్యాపింపజేస్తుంది. అలాగే ఇతరులను కూడా బాధపెడుతుంది. 

వాటికి రంగులు వద్దు 

హోలీ సందర్భంగా జంతువులకు రంగులు వేయడం మంచిది కాదు. రంగులలోని రసాయనాలు వాటి చర్మానికి, కళ్లకు హాని కలిగిస్తాయి. వాటికి పూసిన రంగులను తొలగించగలిగినప్పటికీ.. జంతువులు దీర్ఘకాలికంగా బాధపడవచ్చు.

సంతోషంలో రంగులు చల్లుకుంటూ కలిసి ఎంజాయ్ చేయడం మంచిదే. కానీ వీటిలో ఏ తప్పు చేసినా.. ఎదుటివారు మీపై కేసు పెట్టవచ్చు. పోలీసులు కూడా మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లవచ్చు. కాబట్టి పండుగను ఎంజాయ్ చేయాలనుకుంటే లిమిట్స్​లో ఉంటే మంచిదని చెప్తున్నారు నిపుణులు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Anemia Symptoms : మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే ఇది రక్తహీనత (Iron Deficiency) కావచ్చు, లైట్ తీసుకోకండి
మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే ఇది రక్తహీనత (Iron Deficiency) కావచ్చు, లైట్ తీసుకోకండి
Storing Beer in the Fridge : బీరును ఫ్రిడ్జ్​లో పెడుతున్నారా? అయితే ఈ విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోండి
బీరును ఫ్రిడ్జ్​లో పెడుతున్నారా? అయితే ఈ విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోండి
Dementia Signs : మతిమరుపు లేదా డిమెన్షియా? ఈ 7 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త, వైద్యుల సూచనలివే
మతిమరుపు లేదా డిమెన్షియా? ఈ 7 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త, వైద్యుల సూచనలివే
Turkish Chicken Recipe : రెస్టారెంట్ స్టైల్ టర్కిష్ చికెన్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి, రెసిపీ ఇదే
రెస్టారెంట్ స్టైల్ టర్కిష్ చికెన్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి, రెసిపీ ఇదే

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Bank Strike 2026: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు బ్యాంకుల సమ్మె.. ఏటీఎంలు, యూపీఐ పనిచేస్తాయా?
సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు బ్యాంకుల సమ్మె.. ఏటీఎంలు, యూపీఐ పనిచేస్తాయా?
Medaram Jatara Dates: మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Vijayawada News: అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
Mobile Prepaid 30 Days: మొబైల్ రీఛార్జ్‌ల్లో భారీ మార్పులు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!
మొబైల్ రీఛార్జ్‌ల్లో భారీ మార్పులు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!
Embed widget