News
News
వీడియోలు ఆటలు
X

Beauty Care: చర్మం నిగనిగలాడుతూ మెరిసిపోవాలంటే ఈ ఆహారాలు రోజూ తీసుకోవాల్సిందే

చర్మాన్ని రిపేర్ చేసి మృదువుగా మారాలంటే అది ఆహార పదార్థాల వల్లే అవుతుంది. అందుకే వీటిని తప్పకుండా తినండి.

FOLLOW US: 
Share:

చాలా మంది చర్మ సంరక్షణ కోసం రకరకాల మేకప్ ఉత్పత్తులు వాడుతూ ఉంటారు. ఇవి కాస్త ఖరీదైనవి. అది కాకుండా చర్మానికి వీటిని అధికంగా ఉపయోగించడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. మేకప్ ఉత్పత్తులు బయటి నుంచి మాత్రమే చర్మాన్ని జాగ్రత్తగా చూస్కుంటాయి. కానీ లోపలి నుంచి చర్మాన్ని రిపేర్ చేయడంలో ఇవేవీ సహాయపడవు. పైగా మేకప్ ఎక్కువగా వేసుకుని ఉండటం వల్ల ముఖం ముదురుగా కనిపిస్తుంది. వయసు తక్కువగా ఉన్న ముఖం మాత్రం ముదిరిపోయిన బెండకాయలాగా కనిపించేస్తారు. మేకప్ తో అందం తెచ్చుకోకుండా చర్మాన్ని రిపేర్ చేసుకోవాలంటే అది ఆహారం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. రోజువారీ ఆహారాలు శరీరానికి అనేక ప్రయోజనాలు ఇవ్వడమే కాదు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కఠినమైన, పొడి చర్మంతో విసిగిపోతే మీ చర్మాన్ని మెరిసేలా, ప్రకాశవంతంగా మార్చడానికి ఈ ఆహారాలు తప్పకుండా తీసుకోండి.

అవకాడో

అవకాడో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. దీన్ని రోజూ తీసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. డల్ స్కిన్ ని రిపేర్ చేసి మెరుస్తూ ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది.

వాల్ నట్స్

మెదడుని ఆరోగ్యంగా ఉంచే వాటిలో ముందుండేది వాల్ నట్స్. ఇవి జ్ఞాపకశక్తిని పెంపొందించేందుకు సహాయపడతాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్న ఏకైక శాఖాహారంగా వాల్ నట్స్ పరిగణిస్తారు. చర్మ సంరక్షణకు ముఖ్యమైన సోడియం, పొటాషియం, ఐరన్, ప్రోటీన్ లను కలిగి ఉంటాయి. ఇవి సహజంగా చర్మాన్ని రిపేర్ చేసి మృదువుగా మారుస్తాయి.

టొమాటో

పోషకాలు అధికంగా ఉండే టొమాటోలు చర్మానికి చాలా మేలు చేస్తాయి. వాటిలో లైకోపీన్, విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని హానికరమైన కిరణాల నుంచి రక్షిస్తాయి. టొమాటోలు తినడం వల్ల చర్మంపై ఉండే ముడతలు కూడా సులువుగా తొలగిపోతాయి. టొమాటో మొహానికి రాసుకుంటే మురికి వదిలించేస్తుంది. ఇదే కాదు టొమాటోని సగానికి కట్ చేసుకుని దాని మీద పంచదార, కాఫీ పొడి వేసి నల్లగా ఉనన్ మెడ మీద స్క్రబ్ చేస్తే ట్యాన్ తొలగిపోతుంది.

బ్రకోలి

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది బ్రకోలి తినడానికి ఆసక్తి చూపిస్తారు. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా సూర్యరశ్మి నుంచి చర్మం దెబ్బతినకుండా రక్షిస్తుంది. ఇందులో విటమిన్ సి, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని రిపేర్ చేసి మెరిసేలా చేయడంలో సహాయపడతాయి.

స్వీట్ పొటాటో

ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్స్, విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లతో నిండి ఉంటుంది. ఇందులో అధిక శాతం నీరు ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే హైడ్రేట్ గా ఉండటం చాలా ముఖ్యం. అప్పుడే స్కిన్ నిగనిగలాడుతూ కనిపిస్తుంది. లేదంటే నిర్జీవంగా మారి చికాకు పెట్టేస్తుంది. అందుకే మీ రోజువారీ ఆహారంలో ఈ పదార్థాలు తప్పనిసరిగా చేర్చుకుంటే మంచిది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: నల్ల జుట్టు కావాలా? హెన్నా హెయిర్ ప్యాక్ తో అది సాధ్యమే

Published at : 31 Mar 2023 06:00 AM (IST) Tags: Beauty tips TOMATO Avocado SKin Care tips Summer Skin Care

సంబంధిత కథనాలు

Heart Attack: గర్భనిరోధక మాత్రలు అతిగా వాడే మహిళలు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఎక్కువ

Heart Attack: గర్భనిరోధక మాత్రలు అతిగా వాడే మహిళలు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఎక్కువ

kadaknath: ఈ నల్ల కోడిమాంసాన్ని తింటే మంచి రుచే కాదు, ఎంతో ఆరోగ్యం కూడా

kadaknath: ఈ నల్ల కోడిమాంసాన్ని తింటే మంచి రుచే కాదు, ఎంతో ఆరోగ్యం కూడా

Jaggery: వేసవిలో రోజూ చిన్న బెల్లం ముక్క తినడం వల్ల అలాంటి సమస్యలన్నీ దూరం

Jaggery: వేసవిలో రోజూ చిన్న బెల్లం ముక్క తినడం వల్ల అలాంటి సమస్యలన్నీ దూరం

మద్యం అతిగా తాగితే 33 రకాల జబ్బులు, షాకింగ్ న్యూస్ చెప్పిన కొత్త అధ్యయనం

మద్యం అతిగా తాగితే 33 రకాల జబ్బులు, షాకింగ్ న్యూస్ చెప్పిన కొత్త అధ్యయనం

Beauty Tips: ఈ చెత్త అలవాట్లు మీ అందాన్ని చెడగొట్టేస్తాయ్

Beauty Tips: ఈ చెత్త అలవాట్లు మీ అందాన్ని చెడగొట్టేస్తాయ్

టాప్ స్టోరీస్

ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? చించినాడ మట్టి తవ్వకాలపై సీఎంకు చంద్రబాబు లేఖ

ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? చించినాడ మట్టి తవ్వకాలపై సీఎంకు చంద్రబాబు లేఖ

14 రోజుల రిమాండ్‌కు అప్సర హత్య కేసు నిందితుడు సాయికృష్ణ

14 రోజుల రిమాండ్‌కు అప్సర హత్య కేసు నిందితుడు సాయికృష్ణ

Two Planes Collide: రన్‌వేపై ఢీకొట్టుకున్న విమానాలు, విరిగిపోయిన రెక్కలు - తృటిలో తప్పిన ప్రమాదం

Two Planes Collide: రన్‌వేపై ఢీకొట్టుకున్న విమానాలు, విరిగిపోయిన రెక్కలు - తృటిలో తప్పిన ప్రమాదం

Amazon Plane Crash: అడవిలో కూలిన విమానం, 40 రోజుల అన్వేషణ - సజీవంగా నలుగురు చిన్నారులు

Amazon Plane Crash: అడవిలో కూలిన విమానం, 40 రోజుల అన్వేషణ - సజీవంగా నలుగురు చిన్నారులు