News
News
వీడియోలు ఆటలు
X

Henna Hair Pack: నల్ల జుట్టు కావాలా? హెన్నా హెయిర్ ప్యాక్ తో అది సాధ్యమే

గోరింటాకు జుట్టుకి పోషణ అందిస్తుంది. హెన్నా హెయిర్ ప్యాక్ రెగ్యులర్ గా వేసుకున్నారంటే తెల్ల జుట్టుని నల్ల జుట్టుగా మార్చేస్తుంది.

FOLLOW US: 
Share:

హెన్నా జుట్టుకి చాలా మేలు చేస్తుంది. సహజమైన హెయిర్ డైగా ఎన్నో శతాబ్ధాలుగా దీన్ని ఉపయోగిస్తున్నారు. తెల్ల జుట్టుని నల్లగా మార్చేందుకు సహకరిస్తుంది. ఎర్రటి టోన్ ను అందిస్తుంది. జుట్టుకు మంచి కండిషనర్ గా పని చేస్తుంది. నలుపు, గోధుమ, రాగి ఇలా రంగు రంగుల్లో హెన్నా లభిస్తుంది. ఇవి వేసుకోవడం వల్ల జుట్టు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. జుట్టుకి పోషణ ఇచ్చే హెన్నా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.

కావలసిన పదార్థాలు

100 గ్రాముల హెన్నా పౌడర్

నిమ్మరసం - ఒక టేబుల్ స్పూన్

కాఫీ పొడి - ఒక టేబుల్ స్పూన్

కొద్దిగా నీరు

తయారీ విధానం

ఒక గిన్నెలో హెన్నా పౌడర్, కాఫీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మందపాటి పేస్ట్ మాదిరిగా వచ్చేందుకు తగినంత నీరు కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో నిమ్మరసం వేసి బాగా కలపాలి. గిన్నెను మూతతో కప్పి ఆ మిశ్రమాన్ని కొన్ని గంటల పాటు నానబెట్టుకోవాలి. హెన్నా పౌడర్ నుంచి రంగు విడుదల అయ్యేందుకు ఇది సహాయపడుతుంది. తర్వాత మృదువైన హెన్నా హెయిర్ కి ప్యాక్ మాదిరిగా వేసుకోవచ్చు. హెన్నా పెట్టుకునే ముందు జుట్టు బాగా శుభ్రంగా ఉండాలి. నూనె పెట్టుకున్న తల మీద హెన్నా పెడితే జుట్టుకి పట్టదు.

జుట్టుని పాయలు చేసుకుంటూ కుదుళ్ళ వరకు హెన్నా అప్లై చేసుకోవాలి. తర్వాత అది ఎండిపోకుండా జుట్టుని షవర్ క్యాప్ తో కప్పుకోవాలి. హెన్నా హెయిర్ ప్యాక్ ని 2-3 గంటలు అలాగే ఉంచుకోవాలి. ఎంత ఎక్కువ సేపు ఉంచితే అంత ముదురు రంగులో కనిపిస్తుంది. తర్వాత నీటితో దాన్ని శుభ్రం చేసుకోవాలి. 24 గంటల పాటు షాంపూని ఉపయోగించొద్దు. ఆ తర్వాత షాంపూతో మీ జుట్టుని ఎప్పటిలాగే కండిషన్ చేయాలి.

హెన్నా ప్రయోజనాలు

⦿ గోరింటాకు నుంచి హెన్నా తయారు చేస్తారు. ఇందులో యాంటి బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటి వల్ల తల మీద ఉన్న చుండ్రుని వదిలించేస్తుంది. రెగ్యులర్ గా హెన్నా పెట్టుకోవడం వల్ల చుండ్రు సమస్యను పోగొట్టుకోవచ్చు. జుట్టు కూడా మృదువుగా నిగారింపుని సంతరించుకుంటుంది.

⦿ జుట్టుకి బలమైన పోషణని అందిస్తుంది. పొడవుగా పెరిగేందుకు సహాయపడుతుంది. వెంట్రుకలు రాలడాన్ని నివారిస్తుంది.

⦿ నేచురల్ కలర్ ని అందిస్తుంది. చూసేందుకు కూడా జుట్టు మెరుస్తూ ఉంటుంది. హెన్నా అప్లై చేసిన ఒకరోజు తర్వాత జుట్టుకి నూనె రాస్తే దాని రంగు ఎక్కువ రోజుల పాటు ఉంటుంది. దానిమ్మ తొక్కలు, బీట్ రూట్ వంటి సహజ పదార్థాలు వేసుకుని హెన్న రంగు మనకి నచ్చినట్టుగా మార్చుకుని జుట్టుకి అప్లై చేసుకోవచ్చు.

⦿ తల pH స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది. స్కాల్ఫ్ జిడ్డుగా లేకుండా ఉంచుతుంది. ముల్తాని మట్టిని కలిపి హెన్నా పెట్టుకోవచ్చు. హెన్నా పెట్టుకోవడం వల్ల జుట్టులో వచ్చే నూనెని నియంత్రిస్తుంది.

⦿ హెన్నా దుస్తుల మీద పడితే మరకలు పోవు. కాబట్టి చేతికి గ్లవ్స్ ధరించడం మంచిది. బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో గోరింట ప్యాక్ ని వేసుకోవడం ముఖ్యం. జుట్టుకి హెన్నాను రాసేందుకు ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. అలర్జీ ఉంటే హెన్నాను దూరంగా ఉంచుకోవాలి. లేదంటే అది ఇతర సమస్యలకు దారి తీస్తుంది.  

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: సబ్బుతో పదేపదే మొహం శుభ్రం చేసుకుంటున్నారా? ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో తెలుసా?

Published at : 29 Mar 2023 10:05 PM (IST) Tags: Henna Uses Henna Benefits Henna Side Effects Henna Hair Pack

సంబంధిత కథనాలు

Jaggery: వేసవిలో రోజూ చిన్న బెల్లం ముక్క తినడం వల్ల అలాంటి సమస్యలన్నీ దూరం

Jaggery: వేసవిలో రోజూ చిన్న బెల్లం ముక్క తినడం వల్ల అలాంటి సమస్యలన్నీ దూరం

మద్యం అతిగా తాగితే 33 రకాల జబ్బులు, షాకింగ్ న్యూస్ చెప్పిన కొత్త అధ్యయనం

మద్యం అతిగా తాగితే 33 రకాల జబ్బులు, షాకింగ్ న్యూస్ చెప్పిన కొత్త అధ్యయనం

Beauty Tips: ఈ చెత్త అలవాట్లు మీ అందాన్ని చెడగొట్టేస్తాయ్

Beauty Tips: ఈ చెత్త అలవాట్లు మీ అందాన్ని చెడగొట్టేస్తాయ్

Skin Cancer Test: స్మార్ట్ ఫోన్లతో చర్మ క్యాన్సర్‌ను గుర్తించవచ్చా? అదెలా?

Skin Cancer Test: స్మార్ట్ ఫోన్లతో చర్మ క్యాన్సర్‌ను గుర్తించవచ్చా? అదెలా?

ఎంత ప్రయత్నించినా నిద్రపట్టడం లేదా? మిమ్మల్ని మీరు ఇలా మోసం చేసుకుంటే నిద్రే నిద్ర!

ఎంత ప్రయత్నించినా నిద్రపట్టడం లేదా? మిమ్మల్ని మీరు ఇలా మోసం చేసుకుంటే నిద్రే నిద్ర!

టాప్ స్టోరీస్

Telangana Poltics : తెలంగాణ చీఫ్‌ను మారుస్తారని మళ్లీ ప్రచారం - బీజేపీ హైకమాండ్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దుతుంది ?

Telangana Poltics :  తెలంగాణ చీఫ్‌ను మారుస్తారని మళ్లీ ప్రచారం - బీజేపీ హైకమాండ్ పరిస్థితుల్ని ఎలా  చక్కదిద్దుతుంది ?

ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? చించినాడ మట్టి తవ్వకాలపై సీఎంకు చంద్రబాబు లేఖ

ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? చించినాడ మట్టి తవ్వకాలపై సీఎంకు చంద్రబాబు లేఖ

14 రోజుల రిమాండ్‌కు అప్సర హత్య కేసు నిందితుడు సాయికృష్ణ

14 రోజుల రిమాండ్‌కు అప్సర హత్య కేసు నిందితుడు సాయికృష్ణ

పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు టీడీపీ టీం- అడ్డుకున్న పోలీసులు- ఉయ్యూరుపాడు వద్ద ఉద్రిక్తత

పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు టీడీపీ టీం- అడ్డుకున్న పోలీసులు- ఉయ్యూరుపాడు వద్ద ఉద్రిక్తత