Face Wash: సబ్బుతో ముఖం శుభ్రం చేసుకుంటున్నారా? ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో తెలుసా?
సబ్బుతో ముఖం క్లీన్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇది చాలా చెత్త ఐడియా అని చర్మ వ్యాధి నిపుణులు చెబుతున్నారు.
రోజూ సబ్బుతో ముఖం కడుక్కోవడం అనేది చిన్నప్పటి నుంచి మన తల్లులకు మనకి చెప్తునే ఉంటున్నారు. సబ్బు ఒక సూపర్ ఎఫెక్టివ్ క్లెన్సర్. మురికి, జిడ్డు వదిలిస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ఇది మొహానికి చాలా చెత్తగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బార్ సబ్బు చర్మానికి ముఖ్యంగా ముఖానికి చాలా హానికరం. ఉపయోగించే ఉత్పత్తిని బట్టి అది చర్మం తేమను తొలగించి చర్మాన్ని డల్ గా గరుకుగా మారుస్తుందని చర్మ నిపుణులు అంటున్నారు.
సబ్బు వల్ల సైడ్ ఎఫెక్ట్స్
వృద్ధాప్య సంకేతాలు
దుమ్ము, ధూళి, మురికిని తొలగించడంలో సబ్బు సహాయపడుతుంది. కాలుష్యం వల్ల కలిగే ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని తగ్గిస్తుంది. చర్మంపైన పేరుకుపోయిన మృతకణాలను తొలగిస్తుంది. అయితే ప్రతిరోజూ సబ్బుతో కడగటం వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు ఉన్నాయి. దీని వల్ల చర్మం పొడిబారిపోతుంది. సబ్బులోని రసాయనాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి. టాక్సిన్స్, బ్యాక్టీరియా, జెర్మ్స్, ఇతర మురికి కణాలు చర్మ పొరలోకి లోతుగా వెళతాయి. దీని వల్ల తీవ్ర నష్టం కలుగుతుంది. ముఖంపై చర్మంపై సబ్బు నిరంతరం వాడటం వల్ల ఇలా జరుగుతుంది.
☀ ఇవే కాదు చర్మం ఎర్రగా మారడం
☀ చికాకు, దురద
లోతైన పొరల్లోకి వెళ్ళిన సబ్బు ఆధారిత సర్ఫ్యాక్టెంట్లు నరాల చివరకు చేరుకుంటాయి. వాటి మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. దీని వల్ల వాపు, ముడతలు ఏర్పడతాయి.
చర్మ సూక్ష్మజీవులను దెబ్బతీస్తుంది
సబ్బులు క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం ఉపరితలంపై రంధ్రాలు మూసుకుపోతాయి. చర్మ నిపుణులు అభిప్రాయం ప్రకారం బార్ సబ్బులో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి రంధ్రాలలో పేరుకుపోయి వాటిని మూసేస్తాయి. దీని వల్ల బ్లాక్ హెడ్స్, బ్రేక్ అవుట్స్, ఇన్ఫెక్షన్లు మొదలైన చర్మ సమస్యలకు దారి తీస్తాయి.
విటమిన్లను తొలగిస్తుంది
సబ్బులోని గుణాలు చర్మం నుంచి అవసరమైన విటమిన్లను తొలగిస్తాయి. ఈ విటమిన్లు చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. విటమిన్ డి సూర్యరశ్మి వల్ల ఉత్పత్తి అవుతుంది. అయితే సబ్బులోని కఠినమైన రసాయనాల వల్ల అవి పాడైపోతుందని చర్మవ్యాధి నిపుణులు అంటున్నారు.
తామరను తీవ్రతరం చేస్తుంది
అలర్జీ కారకాలు, కఠినమైన రసాయనాలు కలిగి ఉన్న సబ్బులు చర్మంపై చికాకు కలిగించే అవకాశం ఉండి. వాటి వల్ల తామర మరింత తీవ్రమవుతుంది. ఈ సమస్యని అటోపిక్ డెర్మటైటిస్ అని కూడా పిలుస్తారు. దద్దుర్లు, పొలుసుల పాచెస్, బొబ్బలు, చర్మ ఇన్ఫెక్షన్లకు కూడా కారణమవుతుంది.
ముఖాన్ని సురక్షితంగా కడగడం ఎలా?
సబ్బు తో కాకుండా ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అవి చర్మానికి మృదుత్వాన్ని, మెరుపుని కాపాడుకోవడం కోసం ఇవి ట్రై చేసి చూడండి. మీ చర్మానికి ఎటువంటి హాని కలగకుండా సహజమైన మెరుపుని ఇస్తాయి.
☀ క్రీమ్ క్లెన్సర్స్
☀ ఫోం క్లెన్సర్స్
☀ జెల్ క్లెన్సర్స్
☀ క్లే క్లెన్సర్స్
☀ ఆయిల్ క్లెన్సర్స్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: రోజూ తినే ఈ ఆహార పదార్థాలు ఎంత విషపూరితమో తెలుసా? ఒక్కోసారి ప్రాణాలు పోతాయ్