Skipping Breakfast : బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే నిజంగానే బరువు తగ్గుతారా? ఎవరు అస్సలు మానకూడదు
Breakfast Myths vs Facts : ఉదయం అల్పాహారం మానేస్తే బరువు తగ్గుతారా? అల్పాహారం, ఫాస్టింగ్, కేలరీలు, లైఫ్‌స్టైల్ బరువును ఎలా ప్రభావితం చేస్తాయో చూసేద్దాం.

Skipping Breakfast for Weight Loss : ఎన్నో ఏళ్లుగా అల్పాహారం(టిఫెన్) తీసుకోకపోవడమనేది.. బరువు పెరగడం, జీవక్రియ తగ్గడం, పేలవమైన ఆహారంతో ముడిపడి ఉంది. అయితే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, ఆలస్యంగా తినడం అనే కాన్సెప్ట్స్ బరువు తగ్గడానికి ప్రధాన మార్గంగా నిలిచాయి. ఇలాంటి సమయంలో అసలు బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం వల్ల బరువు తగ్గుతారా? లేదా ఫాస్టింగ్, స్కిప్ చేయడం ద్వారా బరువు తగ్గుతారా? అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి.
బ్రేక్‌ఫాస్ట్‌ని 'ఇంపార్టెంట్ మీల్' అని ఎందుకంటారు?
అల్పాహారం జీవక్రియను పెంచుతుందనే నమ్మకాన్ని ఇది హైలెట్ చేస్తుంది. బ్రేక్‌ఫాస్ట్ తినడం వల్ల శరీరంలో కేలరీలను బర్న్ చేసే విధానం 'ఆన్' అవుతుంది. రాత్రి ఉపవాసం తర్వాత ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి. దీనివల్ల రోజులో కలిగే ఫుడ్ క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయి. అల్పాహారం చాలా మందికి అంటే.. యువకులు, పిల్లలు, టీనేజర్లు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, భారీగా శారీరక శ్రమ చేసే వారికి కచ్చితంగా అవసరం. దీనివల్లనే వారు రోజంతా శక్తి, ఏకాగ్రతతో తమ పనులపై ఫోకస్ చేయగలుగుతారు.
అల్పాహారం మానేస్తే బరువు తగ్గవచ్చు.. ఎలా అంటే..
బరువు తగ్గాలనే కోణం నుంచి చూస్తే.. అల్పాహారం మానేయడం మంచి ఎంపికే. దీనివల్ల రోజువారీ కేలరీల తీసుకోవడం తగ్గుతుంది. దీనివల్ల అతిగా తినలేరు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో భాగంగా చాలామంది బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడానికి ఇదే ప్రధాన కారణంగా చెప్తారు. అందుకే బరువు కూడా తగ్గుతారు.
- ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది.
- బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసిన ఫాస్టింగ్ సమయంలో శరీరంలోని కొవ్వు బర్న్ అవుతుంది.
- చిరుతిళ్లు, అతిగా తినడం తగ్గుతుంది.
బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే బరువు పెరగడానికి కారణాలు ఇవే
కొందరు బరువు తగ్గాలని బ్రేక్‌ఫాస్ట్ మానేసి.. మధ్యాహ్న భోజనంలో ఎక్కువగా తినేస్తారు. తర్వాత మీల్స్ అని పెద్ద భాగంలో తీసుకుంటారు. అధిక చక్కెర, అధిక కొవ్వు పదార్ధాలు తినాలనే క్రేవింగ్స్ పెరిగిపోతాయి. అలాగే బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నామనే భావనలో రాత్రుళ్లు ఎక్కువగా తినేస్తారు. ఇది కొవ్వును పెంచేస్తుంది. ఉదయం తగ్గిన కేలరీలు.. తర్వాత భోజనాల్లో పెరిగి.. బరువు పెరగడానికి కారణమవుతుంది.
తినాలా వద్దా కాదు.. ఇవి తెలుసుకోండి
తాజా అధ్యయనాలు ఏమి చెబుతున్నాయంటే.. అల్పాహారం తినాలా లేదా అనే దానికంటే.. మొత్తం కేలరీల వినియోగం, ఆహార నాణ్యత, భోజనం క్రమం, నిద్ర, వ్యాయామం వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. అల్పాహారం మానేయడం బరువు తగ్గడానికి సరైన మార్గం కాదని.. అలాగే తినడం వల్ల బరువు పెరగకుండా ఉంటారనుకోకూడదని చెప్తున్నారు. ప్రధాన విషయం ఏమిటంటే.. ఆహార షెడ్యూల్ తగినంత శక్తిని సరఫరా చేయగలదా? ఆకలిని నియంత్రించగలదా? అలాగే దీర్ఘకాలిక అలవాటుగా మారగలదా అనేది చూసుకోవాలంటున్నారు.
ఎవరు బ్రేక్‌ఫాస్ట్ మానేయకూడదంటే..
కొందరు అసలు బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయకూడదని చెప్తున్నారు. మధుమేహం లేదా రక్తంలో చక్కెర సమస్యలు ఉన్నవారు, హార్మోన్ల రుగ్మతలు ఉన్నవారు (అంటే PCOS, థైరాయిడ్), భారీ వ్యాయామాలు చేసేవారు, పిల్లలు, టీనేజర్లు ఉదయాన్నే సరైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలంటున్నారు. వీరు అల్పాహారం తీసుకోకపోవడం వల్ల మైకం, అలసట లేదా అతిగా తినడానికి అవకాశాలు పెరుగుతాయని చెప్తున్నారు.
బరువు తగ్గాలంటే కేలరీలు కౌంట్ చేసుకుంటూ సరైన మోతాదులో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలని అంటున్నారు. వీటివల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. అలాగే ఆరోగ్యకరమైన రీతిలో పోషకాహారలోపం లేకుండా బరువు తగ్గగలుగుతారని చెప్తున్నారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.






















