Is neem Leaves Good For Diabetic Patients: షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధంలా వేప- అసలు విషయం తెలిస్తే ఎవరూ వదలరు!
How To Prepare Neem Leaf For Diabetes: వేప కూడా డయాబెటీస్ ను అదుపులో ఉంచేందుకు ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.. ఈ రహస్యం తెలిస్తే రోగులు వేప చెట్టు వద్దకు పరుగెత్తుకు వెళ్తారు.
What Are the Benefits Of Neem Leaves: మధుమేహంతో బాధ పడుతున్నవారు మందులు వాడడంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించేందకు రకరకాల ఇంటి చిట్కాలు కూడా అనుసరిస్తుంటారు. మెంతులు, కాకరకాయ వంటివి షుగర్ కంట్రోల్ చెయ్యడానికి ఉపయోగించడం తెలసినంతగా వేపను ఉపయోగించడం చాలా మందికి తెలియదనే చెప్పాలి. మరి వేప కూడా డయాబెటీస్ ను అదుపులో ఉంచేందుకు ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.
షుగర్ రోగులకు వేప ఆకులు (Neem Leaves) చేదుగా ఉంటాయి. ఈ ఆకులు సహజంగా హైపోగ్లైసెమిక్ (రక్తంలో చక్కర స్థాయులను తగ్గించే లక్షణం) గుణాలు కలిగి ఉంటాయి, ఇవి షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తాయని అనడంలో ఎలాంటి అనుమానం లేదు. వీటిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి, వీటిని ఉపయోగించినపుడు రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. అందువల్ల అనేక ఆరోగ్య సమస్యల నుండి రక్షణ లభిస్తుంది.
వేప ఆకులతో కలిగే ప్రయోజనాలు:
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం: వేప ఆకులు రక్తంలోకి గ్లూకోజ్ ఎక్కువ చేరకుండా నిరోధిస్తాయి. రక్తంలో కి విడుదలయ్యే గ్లూకోజ్ వేగం కూడా బాగా తగ్గుతుంది. దీని వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గుతాయి.
ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుంది: వేప ఆకులు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది కనుక శరీరంలో గ్లూకోజ్ సంశ్లేషణ కూడా మెరుగవుతుంది.
డైబెటిక్ పాద సమస్యల నుంచి ఉపశమనం: వేపలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండడంతో ఇది షుగర్ ఉన్న వారిలో గాయాలు మరియు వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: వేప ఆకులు ఆరోగ్యాన్ని మెరుగుపరచే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
చర్మ సమస్యలకు పరిష్కారం: షుగర్ రోగుల్లో కనిపించే చర్మ సమస్యలను తగ్గించడంలో వేప ఆకులు సహాయపడతాయి.
వేప ఆకులను ఇలా ఉపయోగించాలి:
వేప ఆకుల రసం:
కొన్ని తాజా వేప ఆకులను తీసుకొని వాటిని నీటిలో గ్రైండ్ చేసి రసం చేయాలి.
ఈ రసాన్ని రోజుకు ఒకసారి తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు.
వేప ఆకుల పొడి:
వేప ఆకులను నీడలో ఎండబెట్టి, బాగా పొడిచేసి, పొడిని తయారు చేయాలి. ఈ పొడిని నీటిలో కలిపి, రోజుకు ఒకసారి తీసుకోవచ్చు.
వేప ఆకుల టీ:
కొద్దిగా వేప ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటిని వడకట్టి టీగా తాగడం కూడా మంచి ప్రయోజనాలను ఇస్తుంది.
వేప ఆకులను నమలడం:
నేరుగా కొన్ని తాజా వేప ఆకులను నమలడం కూడా షుగర్ స్థాయిలు తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటుంది.
జాగ్రత్తలు:
వేప అందరికీ సరిపడుతుందని చెప్పలేము. కొందరికి దుష్ప్రభావాలు ఉండొచ్చు. కనుక కొద్ది మొత్తంలో ఒక సారి వాడి చూసిన తర్వాత రెగ్యులర్ గా వాడుకోవచ్చు.
వేప ఆకులను ఎక్కువగా తీసుకుంటే కొన్నిసార్లు పక్షవాతం, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక వైద్యుడి సలహా తీసుకొని మాత్రమే వాడడం మంచిది.
గర్భిణీ స్త్రీలు, పసివారు వేప ఆకులను వాడకూడదు.
వేప ఆకులను ఒక సహజమైన మార్గంగా వాడడం ద్వారా షుగర్ నియంత్రణలో సహాయపడుతుంది, కానీ దీన్ని ఇతర వైద్య చికిత్సలతో పాటుగా మాత్రమే వాడడం ఉత్తమం.
Also Read: థైరాయిడ్ సమస్యా? గుడ్డు తినడం మానకండి